కోడల్ని ఇచ్చిన వారికే తమ వోటు అంటున్న హర్యానా కొడుకులు!

                                                                       
 

చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవా ! అని హర్యానా లో పాతికేళ్ళ పై బడిన యువకులు పెండ్లి పెటాకులు లేక విల విల లాడి పోతున్నారట . కారణం ఏమిటయ్యా అంటే ఆ  రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు మాత్రమే  ఉన్నారట! మరి అలాoటి అసమతుల్యత కు కారణమేమిటి అంటే విజ్ఞానపు  స్కానింగ్ ల పుణ్యమాని ఆడపిల్లలను గర్బంలోనే  కనిపెట్టి  ఖతం చేసిన వారు కొందరయితే , అజ్ఞానపు ఆలోచనలతో పురిటిలోనే అడశిశువును అంత మొందించిన వారు మరి కొందరు . మొత్తానికి హర్యానా లో దేవుడిచ్చిన  ఆడపిల్లలను భూమి మీదకు ఆహ్వానించకుండా అడ్డు పడిన అమ్మా బాబుల పుణ్యామాని , ఈ  నాడు హర్యానా కొడుకులకి కోడళ్ళు దొరకని పరిస్తితిని దాపురిoప  చేసారు .

                 హర్యానా లో సుమారు 7000 గ్రామాలలో  తీసిన లెక్కల ప్రకారం , ప్రతి గ్రామంలో 150 నుండి 200 మంది యువకులు వరకు అమ్మాయిలు దొరకక అవురావురవురు మనుకుంటూ ఊళ్ళ మిద పడి కని పించిన ప్రతి ఆడపిల్ల తండ్రిని " మీ అమ్మాయి నిస్తారా , మీ అమ్మాయి నిస్తారా " అని ప్రాదేయ పడుతుంటే , "ఉద్యోగం లేని వాడికి మా అమ్మాయి నిచ్సెదే  లేదు" అని ముఖం మీదే కరా ఖండిగా చెప్పెస్తున్నారట , ఆ తండ్రులు . అలా ప్రాదేయ పడుతున్న వారి వయస్సు తక్కువేమీ కాదు , 25-29 సంవత్సరాల మద్య వారే .   "బెండకాయ ముదిరినా , బ్రహ్మ చారి ముదిరినా దండగే అని సామెత! పాపం మాటి మాటికి ఆ  సామెత గుర్తు వచ్చి, ముదిరి పోతున్న తమ బెండకాయలను తలచుకుని మరింత కృంగి పోతున్నారట  హర్యానాలోని ముదురు బ్రహ్మ చారులు . వారంతా కలిసి, పోయిన ఎలేక్షన్లకే అంటే 2009 లోనే' పవన్ కుమార్' అనే బ్రహ్మచారి నేతృత్వంలో " అఖిల హర్యానా బ్రహ్మ చారుల సంఘంగా" ఏర్పడి ప్రబుత్వం కి తమ బాదలు చెప్పుకోవడం ప్రారంబించారట .  కనీసం తమకు ఉద్యోగం తొందరగా ఇప్పిస్తే , తమను చూసి కాక పోయినా , తమ ఉద్యోగం చూసి అయినా ఆడపిల్లల తల్లి తండ్రులు తమకు పిల్లలు ఇస్తారు అని ప్రాదేయ పడుతున్నారట .

 
                        సదరు సంఘం వారు 2014 ఎన్నికలలో నిలబడే అబ్యార్డులకు ఒకే ఒకే విషయం అడుగుతున్నారట . "మాకు సబ్సిడీలు , నిరుద్యోగ బ్రుతులు వద్దూ , మా ఇంటికి కోడల్ని ఇవ్వండి . మా ఇంట్లో వోట్లన్ని పట్టుకు పొండి " అని అడుగు తున్న వారిని చూసి ఏమి చెయ్యాలో అర్ధం కాక తలలు పట్టుకున్తున్నారట , తల పండిన రాజకీయ నాయకులు. " ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చింది " అని హర్యానా ముదురుల పెండ్లి , అకడి రాజకీయ నాయకుల చావు కొచ్చింది . ఎన్నికల ప్రచారానికే టైం లేక చస్తుంటే ఇప్పుడు పెండ్లిళ్ళ పేరయ్యల ను ఎక్కడ వెతకాలి అని వారు విసుకుoటున్నారట. మీరేమి చేస్తారో మాకు తెలియదు " కోడల్ని తెండి , వోట్లను పట్టుకెల్లండి " అని భిష్మించుకున్నారట హర్యానా కొదుకులు.  అది కద!


 
           కాబట్టి , నాయనలారా ! ఆడపిల్లలకి ఉసురు ఉంటుందని ఇప్పటికైనా గ్రహించండి . వారిని భూమి మీదకు ఆనందంగా ఆహ్వానించండి . మీ ఇళ్ళకు వచ్చె "లక్ష్మికళ " ను మిరే చేజేతులారా నాశనం చేసుకోకండి . కాదూ , కూడదు , మేము "గే , లెస్బియన్" మేదావుల సంఘం లో చేరి వారి వివాహ హక్కులకై కొట్లాడాలి సిందే అంటారా , డిల్లి వెళ్లి సోనియమ్మా , రాజీవ్ అన్నను కలవండి . తప్పక మీకు న్యాయం జరుగుతుంది . మాకైతే మా ఆడపిల్లలే మాకు బంగారం . జై బంగారు తల్లి ! జై జై బంగారు తల్లి!  

                                                    (17/3/2014 Post Republished).

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )