మాల్యా బాబా " బికినీ భామలు "మంత్రం తో బ్యాంక్ ల గేట్లు బార్లా తెరచుకున్నాయా !!?
'అరేబియన్ నైట్స్ ' కధల్లో ప్రఖ్యాత మైన 'ఆలీ బాబా నలబై దొంగలు ' గురించి పామరులు నుండి పండితులు వరకు అందరకు తెలిసినదే . ఆలీబాబా అనే కట్టెలు కొట్టుకునే వ్యక్తీ అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళడం, అక్కడ దొంగల గుహ లో దొంగలు "తెరచుకో సేసెం " అనే మంత్రం ద్వారా ఆ గుహ ద్వారాన్ని తెరచి , తాము దోచుకోచ్చిన సొత్తును అందులో ఉంచి , తిరిగి "మూసుకో సేసెం " అని అంటే గుహ ద్వారాలు మూసుకోవడం , వారు వెళ్లి పోయిన తర్వాత , ఆలీబాబా కుడా అదే మంత్రాన్ని పఠించి , గుహలోకి వెళ్లి కొంత సొత్తును తీసుకుని తన ఇంటికి వెళ్లి ,అక్కడ గొప్ప వంతుడిగా మారి పోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆలీబాబా అన్న కూడా తన తమ్మున్ని బ్రతిమాలి ఆ మంత్రం తెలుసుకుని తానూ దొంగల గుహలోకి అయితే వెళతాడు కాని, అందులో ఉన్న సంపద చూసి ఉబ్బి తబ్బిబ్బు అయి మంత్రం మరచిపోయి చిక్కుపడిపోతే, దొంగలు వచ్చి చితకొట్టి , అతని ద్వారా ఆలీబాబా రహస్యం తెలుసుకుని అతన్ని చంపడానికి ప్రయత్నించడం , చివరకు అల్లా దయ వలన అలిబాబాయే వారిని ఉపాయం తో తుదముట్టించడమ్ తో కద ముగుస్తుంది . ఇప్పుడు ఈ కధ గురించి ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే , ఈ ఆలీబాబా నలబై దొంగలు కధను మించిన వాస్తవ కదా చిత్రం మన దేశం లో నడుస్తుంది . దాని పేరే "మాల్యా బాబా 17 బ్యాంకులు ".
కాక పోతే ఆలీబాబా కదలో ఆలీబాబా కట్టెలు కొట్టుకునే నిరుపేద అయితే , మన మాల్యా బాబా కధలో మాల్యా బాబా కిక్కు ఎక్కించే కింగ్ఫిషర్ బ్రేవరేజేస్ కి, గాలిలో మోసుకెళ్ళే విమానయాన సంస్తకి అధిపతి. ఇక ఆ కధలో దొంగలు తాము దోపిడీ చేసిన సొత్తును గుహలో దాస్తే, ఇక్కడ మదుపరులు తమ సొత్తును బ్యాం కుల్లో దాచుకున్నారు. సామాన్య రైతులు, సాదా సీదా వ్యాపారస్తులు , కంపెనీలు వీరెవరికి బ్యాంక్ లను ఓపెన్ చేసే మంత్రం అంటే బ్యాంక్ అధికారులని ప్రసన్నం చేసుకునే పద్దతి ఏమిటో తెలియక వేల రూపాయల లోను కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుంది . కాని అదే మాల్యా బాబాకి ఆ మంత్రం ఏమిటొ తెలిసినట్లు ఉంది . దానిని ప్రయోగించే ఒక కోటి కాదు ,రెండు కోట్లు కాదు ఏకంగా 7000 కోట్లు అప్పు రూపం లో కాజేసి చెప్పా చెయ్యకుండా దేశం వదిలి వెళ్లి పోయాడు. ఇప్పుడు ఆలిబాబా ని చంపడం కోసం దొంగలు విశ్వ ప్రయత్నం చేసినట్లు , 17 బ్యాంకుల అధికారులు మాల్యా బాబా ని ఇండియాకి రప్పించడానికి పాట్లు పడుతున్నారు. ఇంతకీ మాల్యా బాబాకి తెలిసిన ఆ మంత్రం "కింగ్ఫిషర్ బికినీ బామలు ". మంత్రం కాబోలు.
మాల్యా బాబా తన కింగ్ ఫిషర్ కిక్కు ప్రజల్లో బాగా పాపులర్ కావాలని 2003 నుండి నేటి వరకు "బికినీ బామల " తో కూడిన కింగ్ ఫిషర్ క్యాలండర్ ఒకటి ప్రచురించడం మొదలు పెట్టాడు . అందులో దేశం లోని టాప్ మోడల్స్ కి కోట్లు ఇచ్చి , వారిని ప్రపంచం లో వేరు వేరు ప్రాంతాలకు తీసుకు వెళ్లి, బికినీ లు దరింపచేసి , ఫొటోలు తీసి వారి ముఖ చిత్రాలుతో క్యాలండర్ తీస్తే , మందు కొట్టే వారికి ఎక్కే కిక్కే వేరు . అలా 2003 నుంచి నేటి వరకు కింగ్ ఫిషర్ క్యాలండర్ లలో ఫోజులు ఇచ్చిన బికినీ బామల వివరాలు ఇవి.
(From Wikipedia).
మరి ఈ భామలను బ్యాంక్ ల ముందుకు తీసుకు వెళ్లి "ఓపెన్ బ్యాంక్" అనగానే సదరు బ్యాంక్ ల గేట్లు బార్లా తెరచుకునేవి అనుకుంటా. దానితో మాల్యా బాబా గారు బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి కోట్లు కోట్లు తీసుకుంటుంటే , బయట బ్యాంక్ అధికారులు బికినీ బామల బికినత్వానికి మతి తప్పి పడిపోయి ఉండేవారు కాబోలు.. అలా మాల్యా బాబా అప్పుల రూపం లో బ్యాంకులను కొల్ల గొట్టిన బ్యాంకులు వివరాలు కొన్ని:
మరి ఈ భామలను బ్యాంక్ ల ముందుకు తీసుకు వెళ్లి "ఓపెన్ బ్యాంక్" అనగానే సదరు బ్యాంక్ ల గేట్లు బార్లా తెరచుకునేవి అనుకుంటా. దానితో మాల్యా బాబా గారు బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి కోట్లు కోట్లు తీసుకుంటుంటే , బయట బ్యాంక్ అధికారులు బికినీ బామల బికినత్వానికి మతి తప్పి పడిపోయి ఉండేవారు కాబోలు.. అలా మాల్యా బాబా అప్పుల రూపం లో బ్యాంకులను కొల్ల గొట్టిన బ్యాంకులు వివరాలు కొన్ని:
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా :1623 కోట్లు . IDBI బ్యాంక్ : 700 కోట్లు, బ్యాంక్ అఫ్ ఇండియా :300 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ :290 కోట్లు, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్ :108 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా : 350 కోట్లు, కార్పోరేషన్ బ్యాంక్: 400 కోట్లు , స్టేట్ బ్యాంక్ అప్ మైసూర్ : 400 కోట్లు, విజయా బ్యాంక్ :400 కోట్లు . ఇలా 17 బ్యాంకులు అన్నీ కలసి సుమారు 7000 కోట్లు మాల్యా బాబాకి అప్ప చెప్మరి దీనికి మాల్యా బాబా టెక్నికల్ గా ఇచ్చిన ఆస్తి హామీ ఏమిటంటె తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్త మరియు దాని గుడ్ విల్ అంట. బ్యాంకుల వారు 2009 లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్ గుడ్విల్ లేక బ్రాండ్ వేల్యూ ని 4000 కోట్లుగా నిర్దారిస్తే 2014 నాటికి దాని బ్రాండ్ విలువ కేవలం 6 కోట్లుకి పడిపోయింది అంట. కాని తీసుకున్న అప్పు మాత్రం వడ్డీలు పోనూ 7000 కోట్లు అలాగే ఉందట. మరి ఇప్పుడు బ్యాంక్ లు ఏమి చేయాలి? వాటిలో కొన్నింటి పరిస్తితి దివాలా దిశగా ఉన్నాయి అంటున్నారు.అటు మాల్యా బాబా తను తీసుకున్న అప్పులు లో సింహ బాగం బినామీల పేరు మీద విదేశాలకు తరలింంచాడని తెలుస్తుంది. అవేవో కానీ పెట్టి భారత దేసానికి తీసుకు రాలేక పోతే , బ్యాంకు అధికారులు బికినీ బామలు ను చూసుకుంటూ సొల్లు కార్చుకోవడం తప్పా అవి చేయగలిగేది కూడా ఏమి ఉండదు అనిపిస్తుంది.
కాబట్టి ఇండియాలో 17 బ్యాంకులు కేవలం మాల్యా అనబడే విజయ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనినో , బీరు కంపెనినో చూసి వందల కోట్లు ఇచ్చాయి అనుకోవడం పొరపాటు. దానికి ప్రతిపలంగా ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో కూడా ప్రజలకు తెలియాల్సి ఉంది. ఈ దిశగా C.B.I వారు క్రుషి చేసి సఫలీక్రుతులు ఔతారని ఆశిద్దాం .
సోర్స్:http://www.dnaindia.com/money/report-of-rs-7000-crore-lent-to-kingfisher-banks-can-now-recover-just-rs-6-crore-2061256
(16/3/2016 Post Republished)
(16/3/2016 Post Republished)
manchi vishayaalu raastunnaru. mee blog lo ilaanti photolu anta sobhaskaram kaademo. okkasari aalochinchagalaru.
ReplyDeletemodels photos has been removed. thanks for your suggestion .
Delete