ఈ సంవత్సరం మన రాష్ట్రం లో కరువు తాండవించడానికీ కారణం వారేనా !?

                                                                       


మొన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మన రాష్త్రంలో కరవు అనేది లేదని ,ఈ  సంవత్సరం తిరిగి చంద్రబాబు గారు  పాలనా పగ్గాలు చెపట్టారు కాబట్టి తిరిగి కరువు దేవత మన రాష్ట్రం లోకి వచ్చిందని అనేసరికి నేను చాలా ఆశ్చర్య పోయాను. అయన గారి సిద్దాంతం ప్రకారం చంద్ర బాబు గారి పూర్వపు 9 ఏండ్ల పాలనలో తెలుగు రాష్ట్రంలో కరువు నెలకోందట . ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దేవుడి పాలన దివికి దిగి వచ్చిందా అన్నట్లు వేంటనే వర్షాలు పడి బీళ్ళు సస్యశ్యామలం అయ్యాయట! ఆ తర్వాత 10 ఏండ్లు ఏ నాడు "తెల్ల కాలం " ఏర్పడలేదట . తిరిగి ఈ  సంవత్సరమే వర్షాలు వెనుకాడాయి అట. దానికి సోల్ కారణం నవ్యాంద్ర ముఖ్యమంత్రి గారు అధిపతి కావడమేనట. ఇలా అయన చెపుతున్న రీజనింగ్ విన్న నాకు ఠక్కున ఒక డౌట్ వచ్చింది. పోనీ అయన చేప్పేదే నిజమయితే , చంద్రబాబుగారు నవ్యాంద్ర వరకే ముఖ్యమంత్రి కానీ , మొత్తం భారత దేశానికి కాదు కదా , మరి దేశం అంతా కరవు కాలమే కదా ? అంటే , చంద్ర బాబు గారీ లెగ్ సామాన్యమైనది కాదని, దానీ ప్రభావం యావత్ దేశం అంతా ఉంటుందని , తన వాదనని సమర్దించుకున్నాడు ఆ నాయకుడు.

   నిజానికి ఆ నాయకుడికి , చంద్ర బాబు గారన్నా , అయన పార్టి అన్నా అసలు గిట్టదు కాబట్టి అలా అంటున్నాడు అని అనుకోవచ్చు .కానీ అసలు వర్షాబావం కి కారణమైన వాతావరణ ప్రక్రియను గురించి వింటే  కొన్ని ఆసక్తికర ఆంశాలు గమనించవచ్చు . పసిపిక్ మహాసముద్రం లో డిసెంబర్ నెలలో ఏర్పడే " ఎల్ నినో " అనే ఒక ప్రత్యేక వాతావరణ పరిస్తితే నేడు మన దేశం లో వర్షాలు వెనుకాడడనికి కారణం అట. "ఎల్ నినో " అంటే "బాల  యేసు " అని అర్ధం అట. అంటే పద అర్దం పరంగా  "బాల  యేసు " వలన మనకు ఇంత అనర్దం జరుగుతుందని  భారతీయులు అనుకోవచ్చా ? . అలాగే ఈ  మద్య పిల్లల్ని కనగలిగి శక్తి ఉండి కూడా , తమ అందం అరిగిఫొతుందనే కారణం తోనో , మరే కారణతోనో చాలా మంది ధనవంతులు సర్రోగసి  మార్గం లో పిల్లల్ని పొందుతున్నారు . మరి అలాటి ప్రక్రుతి విరుద్దంగా పుడుతున్న వారిని  కూడ ఎల్ నినో లు అనవచ్చు . ఎందుకంటే ఎల్ నినో అంటే "బాలుడు " అనే అర్దం కోడ ఉందట . మరి అలాంటి ఎల్ నినో లను పుట్టిస్తున్న వారిని చూసి చూసి   ప్రకృతికి కోపం వచ్చి తానే  "ఎల్నినో " గా మారి కొన్నీదేశాలను వరదలుతో మరి కొన్ని దేశాలను కరువులతో కభలిస్తుంది అని మనం అనుకోవచ్చా?

   ఏది ఏమైనా కంటికి కనిపించేది సైన్స్ అయితే , కనిపించంని కారణం దైవ మాయ అవుతుంది . విచిత్రం ఏమిటంటె సైన్స్ కారణాలకు కూడా  దేవుని పేరులు పెట్టడం. హిగ్స్ బాసన్ కి గాడ్ పార్టికిల్ అని పెట్టడం లాంటిదే "ఎల్నినో " అనేది కూడా . మంచి జరిగితే మన మాయ , లేకుంటే ఎదుటోడి మాయ అన్నట్లుంది పైన చెప్పిన రాజకీయ నాయకుడి మాటలు !.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!