1956 తర్వాత తెలంగాణా లోకి వచ్చిన ఇల్లరికపు అల్లుళ్ళ సంతానం కి "పీజ్ రియంబర్స్ మెంట్ " ఇవ్వరా ?!

                                                    
                                                                       

                                                           మాత్రు దేవో భవ !
                                                             పితృ దేవో భవ !
                                                              ఆచార్య దేవో భవ !

  ఇది మనం ప్రత్యక్ష  దేవుళ్ళని దర్శించే సంప్రదాయం. ఎవరికైనా సరే అమ్మ వాస్తవం అయితే అయ్య నమ్మక్కం . కానీ మన తెలంగాణా అధికారులకు మాత్రం వాస్తవం కంటే నమ్మక్కం మీదే బోల్డంత నమ్మక్కం ఉన్నట్లుంది . అందుకే తెలంగాణా విద్యార్దులకు "పిజ్ రియంబర్స్మెంట్ " చెల్లించే విదానం గురించి సలహాలు ఇమ్మని ముక్యమంత్రి గారు కోరినప్పుడు కొందరు అధికారులు " 1956 కు ముందు ఉన్న తండ్రుల స్తానికతను  మాత్రమే  సంతానంకి  వర్తింపచేసి  పీజ్ రియంబర్స్ మెంట్  ఇవ్వాలని " వారు మాత్రమే తెలంగాణా బిడ్డలు అని నొక్కి చెప్పినట్లు తెలిసింది . సర్కార్ వారు కూడా  అదే సలహాను అనుసరించి జీ.ఓ లు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సమంజసం అయిన నిర్ణయం అవుతుందా అని నా  అనుమానం. ఎందుకో చూద్దాం .

    మన సమాజం లలో పురుషులు అత్తారింటికి ఇల్లరికాలు వెళ్ళడం సాంప్రాదయమే . ఒక వేళ ఇల్లరికం గా కాక పోయినా అత్తవారింటి తరపు వారు కొంచం కలిగిన వారైతే , వారి అండన బ్రతుకుదాం అనే ఉద్దేశ్యం తో అయినా చాలా మంది తమ స్వస్తలాలు వదలి అత్తవారింటికి లేక వారు ఉంటున్న ప్రాంతం లోకి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతున్నదే . అలాగే 1956 తర్వాత ఎవరైనా తెలంగానేతర పురుషుడు తెలంగాణా అమ్మాయిని పెండ్లి చేసుకుని అక్కడికే వెళ్లి స్తిరపడి పోయి , పిల్లల్ని కని పెంచి పోషిస్తూ అక్కడె  చదివిస్తుంటె , ఇప్పుడు రాబోయే జీ. ఓ  వలన , ఆ పిల్లలకు రెయంబర్స్ మెంట్ వస్తుందా  అంటే ఖచితంగా రాదనే చెప్పాలి . ఎందుకంటె వారి తండ్రి వాళ్ళ అమ్మని 1956 తర్వాత చేసుకుని తెలంగాణా వచి స్తిర పడ్డాడు కాబట్టి . పోరాటాలు చేసే టప్పుడు . రాణి రుద్రమలు . చాకలి ఐలవ్వ వీర గాధలు పాడి మురిసి పోయిన మనం,  పిల్లల జన్మ కారకురాలైన తల్లి తండ్రులలో కేవలం తండ్రి  ప్రాంతాన్ని ,వారసత్వాన్నే పరిగణన లోకి తీసుకోవడం నిజంగా అమ్మను అవమానించడమే.

   కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కూలంకష పరిశిలన చేసి, తెలంగాణా బిడ్డల పీజ్ రెయంబర్స్ మెంట్ విషయంలో ఏది చేసినా తల్లి తoడ్రులకు సమాన హోదా , గౌరవం ఇవ్వవలసినదిగా కోరడమైనది. జన్మ భూమి ని "తెలంగాణా తల్లి " గా కొలిచే మనకు బిడ్డల జన్మకు తండ్రిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం పాడి కాదు అని నా అభిప్రాయం.

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )