ఒక్క రాహుల్ ముందు అయిదు కోట్ల సీమాంద్రులు ఆప్ట్రాలా!


                                                                                     
                                                               

  మనది ప్రజాస్వామ్య దేశమట! నమ్మమని నమ్మకంగా చెపుతుంటారు అధికారంలో ఉన్న వారు. ఇక్కడ మెజార్టీ ప్రజలు అవునన్నదే చట్ట రూపంలో చలామణీ అవుతుందని చాలా మంది విశ్వాసం. కాని అది తప్పు అని, డిల్లీ పాలకులకు ఆంద్రా ప్రజలు అంటే గడ్డిపరకతో సమానమని నిన్న జరిగిన సంఘటణ రుజువు చేస్తుంది.

  గత 64  రోజులుగా సీమాంద్రా లోని అయిదుకోట్ల మంది ప్రజలకు నిత్యావసర సేవలు నిలుపుదల చేసి ఆ ప్రాంత ఉద్యోగులు,విద్యార్దులు, రైతులు, ఇతర అనేకానేక సంఘాలవారు రాజకీయాల కతీతంగా ,రోజూ కొన్ని లక్షలమంది ప్రజలు, చారిత్రాత్మకం అనిపించే రీతిలో, అహింసాయుతంగా ఆందోళన చేస్తుంటే, కనీసం కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించిన పాపానా పోలేదు. వారు కోరుతుంది రాష్ట్ర విబజన ఆపమని, దానికి కారణం తమకు విబజన వలన కలిగే నష్టాలే అని అంటున్నపుడు వాటి మీద సవివరంగా వివరణ ఇచ్చి కనీసం వారీ భయాందోళనలు తీర్చాల్సిన బాద్యత కేంద్ర ప్రబుత్వానిదే. ఎందుకంటే ఇక్కడి ముఖ్య మంత్రి గారు కూడా అదే సందేహాలు వెలిబుచ్చుతొ, కేంద్రాన్ని విభనానంతర సమస్యల పరిష్కారం ఏమిటో చెప్పాలని, ఆ తర్వాతే విభజన నిర్ణయం టిసుకోవాలని చెప్పాకా ఇక కేంద్రం వారు తమ బాద్యత నుంచి తప్పించుకోలేరు. కానీ కేంద్రం సమస్యను రాజకీయం చెయ్యడానికి తన పార్టీలోని చీమూ, నెత్తురు లేని వారిని రంగం లోకి దించింది. ఈ డిల్లీ పాలకుల కాళ్ళు పిసికి పబ్బం గడుపుకునే వారు సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదే విమర్శలు చెయ్యడం మొదలెట్టారు.

  అటు ముఖ్య మంత్రి అయినా, ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా విలువ ఇవ్వాల్శింది మెజార్టీ ప్రజల అభిప్రాయానికే. రాష్ట్ర విబజన విషయంలో నిర్ణయమ్ జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే  శిలా శాసనం అని చెపుతున్న వారు,నిన్న రాహుల్ గాందీ చెప్పిన ఒక్క మాటతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా వెనక్కు తీసుకున్నారు? అంటే మీకు మీ యువరాజు మాట మీద ఉన్నంత గౌరవం అయిదుకోట్ల ప్రజల మాట మీద లేదన్నమాట! ఇదేగా మీ ద్రుష్టిలో తెలుగువారి కున్న విలువ? మీరు తెలంగాణా ప్రజల అకాంక్షల మేరకు తెలంగాణా ఇవ్వటం లేదు అనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్రమ్ లోని సీమాంద్రా పెద్దలు కొంతమంది, తెలంగాణా వారు కొంతమంది, కేంద్రం లోని దిగ్విజయ్ సింగ్ లాంటి వారితో కలసి వారి స్వలాబాలకు, పార్టీకి లాభమ్ అని చెప్పి సోనీయాగాందిని ఒప్పించి యావత్ తెలుగు ప్రజానీకానికి చేస్తున్న ద్రోహమే "తెలాంగాణా ప్రకటణ". ఇదే ద్రోహం గురించి, హైద్రాబాద్ U.T   ఏర్పాటు కొరకు వారి మద్య జరిగిన చీకటి ఒప్పందాలు గురించే, బహూశా లగడపాటి గారు తన రాజీనామా అనంతరం బయట పెడతానన్నది కావచ్చు.

  ముఖ్యమంత్రి గారి ప్రకటణ తర్వాత చీకటి ఒప్పందాల అమలుకు తహ తహ లాడుతున్న తెలుగు జాతీ ద్రోహులు,. అంత ఉద్యమం శిమాంద్రాలో జరుగుతున్న కనీసం ఆ ప్రజల మీద జాలీ కూడా లేదు వారికి. ఇక్కడి తెలంగాణా ప్రజలు అక్కడి ప్రజలును చూసి బాదపడుతున్నారు కానీ, సీమాంద్రా లోని డిల్లీ వారికి అడుగులు మడుగులొత్తే  రాజకీయ నాయకులు మాత్రం ఎంత తొందరగా ముఖ్యమంత్రి ని తప్పించి, తెలుగు ప్రజల గొంతు కోదామా అని తహ తహ లాడుతున్నారు. వీరి చీకటి ఒప్పందాలు అటూ తెలంగాణాకు, ఇటు సీమాంద్రాకు మొత్తంగా తెలుగు జాతికి చేటు తెచ్చేవే అనేది ఖాయం. లగడ పాటి గారి వద్ద ఉన్న వారీ చీకటి ఒప్పందాలు బయపరచే ఆ "బ్రహ్మాస్త్రాన్ని" ఎంత త్వరగా వదిలితే అంత మంచిది. సీమాంద్రా ప్రజలు కూడా ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ క్రింద ఏకమై ఈ తెలుగుజాతి ద్రోహుల ఆట కట్టిస్తే పలితముంటుంది. ఎందుకంటే కుహానా రాజకీయ నాయకుల ఉద్దేశ్యం ఎంటటి గొప్ప ఉద్యమం అయినా రాజకీయ లక్ష్యం  లేకుండా ఎక్కువ కాలం కొనసాగలేదు అని.

  కాబట్టి ఒక్క మాటతో కేంద్ర సర్కార్ మెడలు వంచిన రాహుల్ గాందీ స్పూర్తీగా, అయిదుకోట్ల మంది తెలుగు వారు ఉద్యమించి కుహానా రాజకీయాలను "వీరనరసింహులై" చీల్చి చెండాడండి.ఆత్మగౌరవం ముందు, ఆ తర్వాతే ఏదైనా. ఇందిరమ్మ సర్కార్  నే మెడలు వంచిన తెలుగుజాతికి సోనియమ్మ సర్కార్ మెడలు వంచడం పెద్ద లెక్కా? ఆ నాడు నందమూరి గారి ఆత్మగౌరవ నినాదానికి స్పందించిన రీతినే స్పందిస్తే తప్పా ఈ చీకటి ఒప్పంద రాజకీయ నాయకులకు బుద్ది రాదు.          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!