విభజన వాదుల్లో ఉన్న సమైక్యతా బావం ,సమైక్య వాదుల్లో లేకపోవడం విడ్డూరం!

                                                     

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తెలంగాణా నాయకులు మొన్నటిదాక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించినప్పటి నుంచి ఏ పార్టీ వారు కూడా   తెలంగాణాలోని ఇతర పార్టీల వారి మీద పెద్దగా విమర్శలు చెయ్యడం లేదు సరికదా, సిమాంద్రా  నాయకుల వాదనలను సమైక్యంగా ,సమర్దవంతంగా తిప్పికొడుతున్నారు . రాష్ట్ర ఏర్పాటు విషయంలోను వారు పైకి పార్టీల పరంగా ఏమనుకున్నా, అందరూ అవసరమైనప్పుడు అయిక్యంగానే ప్రవర్తించారు . దీనికిగాను సీమాంద్రా ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు కూడా , తమ ప్రాంత నాయకుల అనైక్యతను ఎత్తి చూపే అనేక సందర్బాలలో  ప్రస్తావించడం గమనార్హం.

  ఇకపోతే సీమాంద్రా నాయకులలో, పేరుకే సమైక్యతా రాగం . కానీ శ్రుతి వేరు,తాళం వేరు, లయ  వేరు. ఒకరంటే ఒకరికి చచ్చినా పడదు. సీమాంద్రా తెలుగుదేశం వారంటే, సీమాంద్రా వై.సి.పి. వారికి ఒంటి మీద తేళ్ళు , జెర్రులు పాకినట్లుంటుంది. అలాగే తెలుగు దేశం వారికి. లగడ పాటి, ఉండవల్లి లాంటి రాజకీయ నాయకులు చలసాని శ్రీనివాసరావు లాంటి సమైక్యాంద్రా వాదులు ఎంత గొంతు చించుకున్నా ,ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, సీమాంద్రా నాయకులలో సమైక్యతా రావడం అసాద్యం. మరి వారి రాజకీయ నాయకులలో సాదించలేని సమైక్యతను ,యావత్ ఆంద్రప్రదేశ్ లో సాదిస్తామని కలలు గనడం విడ్డూరం కాక మరేమిటి?

  చంద్రబాబు గారేమో తమ పార్టీని తుంగలో తొక్కడానికే కాంగ్రెస్ ,జగన్ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టే ప్లాన్ చేసారు అంటారు. జగన్ గారేమో తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలసి రాష్ట్ర విభజనకు ఒ.కె అన్నారు అని అంటారు .ఇక కాంగ్రెస్ వారి వాదన అయితే మరీ అడ్డగోలు వాదం. రాష్త్ర విబజన చేయిస్తున్న తమ నాయకురాలిని ఏమనలేక, చంద్రబాబు గారి లేఖ వలనే తెలంగాణా రాష్త్రం ఇవ్వాల్సి వచ్చిందని అంటారు. మరి ఇటువంటి శ్రుతి , మతి లేని రాజకీయ నాయకులు కలసి ఆలపించలేని రాగం సమైక్యతా రాగం ఎలా అవుతుంది? . కాబట్టి ఇటువంటి విభజన మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నంత కాలం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు ఏ డోకా ఉండదు. సీమాంద్రా ప్రజలు కూడా  కె.సి.ఆర్. గారిని తెలంగాణా నాయకులను నిందించడం మాని, మీ ప్రాంత రాజకీయ నాయకుల కుటిల రాజకీయాలను ప్రక్షాళన చేస్తే మంచిది. అటువంటి నాయకులు రేపు రాష్ట్రం విడిపోయినా వారి వల్ల  జరిగే అభివృద్ధి శూన్యం . వారికి కొట్టుకోవడం, తిట్టుకోవడం మీద ఉన్న శ్రద్ద ,ప్రజల సంక్షేమం మీద లేదు అనేది నిర్వివాదంశం. .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన