పేరుకి "కరుణగిరి కారుణ్య భవన్",కానీ ఆడపిల్లలకి అరణ్య భవన్ అట!
గురువు శిష్యుల బందం తండ్రి పిల్లల సంబందం అనేది సాంప్రదాయ బావన. ఆడపిల్లలు చదువుల నిమిత్తం ఉన్న ఊరిలో కాకుండా పొరుగూరు వెళ్లి హాస్టల్లో ఉండి చదువుకోవలసిన పరిస్తితి. అక్కడ తల్లి తంద్రుల పర్యవేక్షణ ఉండదు. కాబట్టి ఆ యా పాఠశాలలు, లేక వసతి గ్రుహాల నిర్వాహకులే ఆ బాద్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీరందరి కంటే ఆడపిల్లలకు విద్య బోదించే గురువులు వయసుతో నిమిత్తమ్ లేకుండా కన్న తండ్రి వలే వారికి విద్యాబోదనతో పాటు నైతిక జీవన ఆవశ్యకత గురించి చెప్పాల్శిన బాద్యత ఉంది. ఒక వేళా వారి ప్రవర్తనలలో ఏదైన అనుమానం అనిపిస్తే తల్లితండ్రులకు తెలియ చెప్పాల్శిన బాద్యత కూడా ఉంది. కానీ తండ్రి వయసున్న ఉపాద్యాయుడే పదవ తరగతి చదివే అమ్మాయిని మాయ మాటలతో వంచించి, తన అవసరాలకు వినియోగించుకుంటుంటే ఇంకెవరిని నమ్మి, ఆడపిల్లల్ని ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు పంపేది?
ఖమ్మం లో కరుణగిరి సంస్థ పేరు పొందిన సేవాసంస్థ అని కొంత మంది నమ్మకం. దానికి అనుబందం గా ఒక విద్యాలయం ఉంది .అదే "కారుణ్య విద్యా భవన్". ఆ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిది ఖమ్మం దగ్గరలోని పల్లెటూరు. విద్య కోసం రోజూ స్వగ్రామమ్ నుండి రావడం కష్టమై అక్కడే వసతి గ్రుహం లో ఉంటుందట. ఆ కారుణ్య భవన్ లో బౌతిక శాస్త్రం బోదించే ఉపాద్యాయుడికి ఆ అమ్మాయి తండ్రి వయసు ఉంటుంది. అతను ఈ అమ్మాయికి స్పెషల్ క్లాస్ పేరుతో అప్పుడప్పుడు తన ఇంటికి తీసుకు వెళుతుంటాడట.ఈ విషయం తల్లి తండ్రులకు తెలియదు. మొన్నీమద్య వారు వసతి గ్రుహానికి వస్తే అమ్మాయి అక్కడ లేదు . దీనితో కొంత మంది ఇచ్చిన సమాచారం తో ఆ బౌతిక శాస్త్రం బోదించే ఉపాద్యాయున్ని ప్రశ్నిస్తే ’ ఓ మై గాడ్! ఆమె నాకు కూతురు లాంటిది" అని నమ్మఖం గా చెప్పే సరికి నిజమెనని నమ్మారు. ఆదివారం అమ్మాయి ఇంటికి వచ్చినపుడు అమ్మాయి మొబైల్ ను అబ్సర్వేషన్ లో పెడితే, ఆయన గారు అమ్మాయితో మాట్లాడుతూ దొరికి పోయాడట! వేంటనే తల్లి తండ్రులు బందువులు పాఠ శాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తే పాఠశాల యాజమాన్యం సదరు పంతులను దాచి పెట్టింది. పోలిసులు కేసు నమోదు చేసారు. అ ఉపాద్యాయుడికి బార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారట! అయినా బౌతిక వాంచలు తీర్చుకోవాలన్న తపన ఎక్కువ ఆ బౌతిక శాస్త్ర బోదకుడుకి!. అందుకే కూతురు లాంటి దానిని మాయ మాటలతో ఏ మార్చాడు అని అంటునారు ఖమ్మం లోని విద్యార్ది సంఘాల వారు. సదరు పంతులును అతనికి సహకరిస్తున్న పాఠశాల యాజమాన్యం మీద కఠిన చర్యలు టిసుకోవలసినదిగా ఖమ్మం లోని మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు ఆందోళన చేస్తున్నారు. అదీ కధ!
ఈ రోజుల్లో ఆడపిల్లని చదివించడానికి ప్రతి తల్లి తండ్రి శ్రద్ద తీసుకుంటునారు. మగ పిల్ల వాడితో సమానంగా అడపిల్లల్ని చూడాలన్న ఆలోచన మన సమాజం లో వచ్చింనందుకు అందరం సంతోషించాలి. కాని రక్షణ విషయం వచ్చే సరికి ఆడపిల్లల తల్లితండ్రులు గుండే మీద చేతులు వేసుకుని నిద్ర పోలేని పరిస్తితి. ఈ పరిస్తితులు ఇలాగే కొన సాగితే తిరిగి ఆడపిల్లల చదువు పట్ల వివక్షత, పద్దెనిమిదేళ్ళు నిండకుందానే పెండ్లిల్లు చేసి పంపడమనే పాత పద్దతులు తిరిగి రావచ్చు. మరి అటువంటి పరిస్తితిని నివారించలంటే పాఠ శాలల మీద,ప్రైవేట్ ఉపాద్యా నియామకల మీద కూడా ప్రభుత్వ, పేరెంట్స్ కమిటీ నియంత్రణ ఉండేలా చట్ట సవరణలు చేయాలి. అలాగే రాజకీయాల కతీతంగా పేరెంట్స్ కమీటిలు ఏర్పాటు చెయ్యాలి. ఈ నిబందన మైనార్టీ విద్యా సంస్థలకూ వర్తింప చేయాలి. లేకుంటే కారుణ్య భవన్ ల లో కూడ ఆడపిల్లల రోదనలు అరణ్య రోదనలుగా మారుతాయి. ఈ కరుణ గిరి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి
Comments
Post a Comment