తమిళనాడులో కుష్బూ ! తెలంగాణాలో సోనియా ! ఇద్దరూ దేవతలే!


                                                              


దేవత అంటే ఎవరు? ఈ   ప్రశ్న  కు బదులివ్వండి అని అని తెలంగాణా కాంగ్రెస్ వారిని అడిగితె  తడుముకోకుండా  ఠక్కున చెప్పే సమాధానం "సోనియా గాందీ ". ఎందుకంటే వారికి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది ఆమె అని వారి ప్రగాడ విశ్వాసం మరి!. అయిదు కోట్ల మంది అరుపులను ఆఫ్ట్రాల్  అని తన జన్మ దిన కానుకగా ప్రకటించిన "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటుకు ఆమె పార్టీ కట్టుబడి ఉండేలా చేసినందుకు ఆమె కు తెలంగాణా కాంగ్రెస్ వారు జీవితాంతం చాకిరి చేసినా వారి రుణం  తీరదు కాక తీరదు . కాబట్టే వారు ఆమెకు తమ గుండెల్లో గుడి కట్టారు. ఆ అభిమానాని వారు బహిరంగంగా ప్రదర్శించారు కూడా !.

 తెలంగాణా లో కె,సి,ఆర్  గారు తెలంగాణా తల్లి ఆకృతిని ఆవిష్కరించి , ఆమే తమ దేవత అని ప్రకటించారు . కానీ తెలంగాణా కాంగ్రెస్ వారు మాత్రం తమ దేవత "సోనియా గాందీ" గారే అని తేల్చేసారు . తెలంగాణా ను ఇచ్చింది సోనియా గాందీ గారే కాబట్టి ఆమె  గారే "తెలంగాణా  దేవత" కావాలని వారి ద్రుడాభిప్రాయం. రేపు ఒక వేళ తెలంగాణా లో కాంగ్రెస్ వారు ,అధికారం లోకి వస్తే "తెలంగాణా తల్లీ" బొమ్మ స్తానం లో "సోనియా గాంది " గారి బొమ్మ పెట్టిన ఆశ్చర్యపోవలసిన పని లేదు.

మనిషికి ఉన్న అనేక మానసిక సమస్యల్లో "అతి అభిమానం " ఒకటి. ఇది ఉన్న వారు తాము అభిమానించే వారిని , దేవుళ్ళు , దేవతలు లాగా కొలవడం పరిపాటి . తమిళ నాడులో కుష్బూ అనే నటిమణి గారు ఉంది. ఆమె గారిని "దేవత" లా బావించే అభిమాన గణం కూడా  అక్కడ ఉంది. అందుకే వారు ఆమెకు "గుడి" కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు . మరి కేవలం సినిమాలో ఆమె చూపిన నటన కే ముగ్దులై ఆమె కు గుడి కట్టినపుడు, తమ గోడు ఆలకించి "ప్రత్యేక తెలంగాణా " రాష్ట్రాన్ని ప్రకటించిన సోనీయమ్మకు, తెలంగాణా కాంగ్రెస్ వారు  వారి అభి మానాన్ని ఎలా చాటుకోవాలి?  అందుకే వారు ప్లెక్షి తో గుడి కట్టారు! ఆ గుడిలో ఆమెను పెట్టారు! అలా తమ భక్తిని ప్రదర్శించా రు!  కాక పోతే ఒక చిన్న డౌట్  ఏమిటంటే , ఆమె గారేమో అన్య మతస్తు రాలు . ఆమెకు తగిన ప్రార్దనాలయం  కడితే ఆమెకు సంతోషం కానీ, మన మతం కు చెందిన" గుడి"  కట్టి అందులో కొలువు ఉండు తల్లీ అంటే ఉంటుందా ? అని . అందుకే ఆమె కు నచ్చిన ప్రార్ధనా లయం కడితే ఆమె గారి కరుణ పొందటం ఈజీ !

         "ఎవడి పిచ్చి వాడి కానందం " అని ఊరికే అన్నారా పెద్దలు!

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )