మనిషి కమ్యూనిస్ట్! మనసు మాత్రమే "కరెన్సీ ఇస్ట్"!                                                                

  మనిషిని చెప్పె మాటలు బట్టి కాక, చేసె పనులు బట్టి అంచనా వెయ్యాలి.ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏ వ్యక్తి అయినా తన సహజ గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేడు. అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నటన అయి ఉండాలి. మన దేశం లో నిజాయితీ,నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. కాకపొతే వెనుకటి తరంలో అలాంటి వారు ఎక్కువుగా ఉంటే, ప్రస్తుత కాలంలో వేళ్ల మీద లెఖ్ఖ పెట్టగలిగే స్తాయికి వచ్చారు.  ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే మిగతా వారికన్నా ఎంతో నిజాయితీ పరులు అయి ఉండే వారు. వెనుకటి తరంలో అటువంటివారు చేసిన సేవల వలనే ఈ నాటికి దేశంలో ఆ పార్టీలు బ్రతికి ఉన్నాయి. కానీ నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో కేరలకు చెందిన సి.పి.యం. నేత అయినా "సమర్ ఆచార్జీ" లో కమ్యూనిజమ్ అంత ఉందని రుజువు అయింది.

  ఆయన పేరు  సమర్ ఆచార్జీ. వయస్సు  సంవత్సరాలు.కేరళ మార్క్శిస్ట్ పార్టీకి స్తానిక నేత. పాపం ఆయనకు చిన్ననాటినుండి ఒక కల కనే వాడు. అది డబ్బు కట్టల మీద నిద్రించాలని. కానీ ఆయన బీదరికం ఆయన కోరికకు అడ్డు పడుతూ ఉండేది. చేసే ఉద్యోగం ఏదో జూట్ మిల్లులో కార్మికుడు. సంపాదన అంతతంత మాత్రమే. మరి ఎలా తన కోరిక నెరవేర్చుకునేది? అందుకే అకాడి అధికార పార్టీ అయిన సి.పి.యం లో చేరాడు. చాలా కాలంగా అక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఎలాగో పైరవీలు చేసుకుని "మరుగుదొడ్ల నిర్మాణం" కాంట్రాక్టర్ గా అవతారమెత్తి గవర్నమెంట్ కాంట్రాక్టర్ గా డెబ్బై లక్షలు సంపాదించాడట! ఆ సంతోషంలో ఆ డెబ్బై లక్షలు లోనుంచి ఒక ఇరవై లక్షలు తీసి తన మంచం మీద పరచి వాటి మీద హాయిగా పడుకున్నాడు అంట. పడుకున్నోడు పడుకున్నట్లు ఉండకుండా తన స్నేహితులను పిలిచి మరీ తన ఘన కార్యం చూపాడు. అంతే! ఆ స్నేహితులలో ఎవరికో కన్ను కుట్టినట్లుంది. సెల్ ద్వారా ఆ తతంగం అంతా చిత్రీకరించి, మీడీయాకు లీక్ చేసారు. ఆ దెబ్బతో జాతీయ స్తాయిలో విమర్శలు చెల రేగే సరికి, నష్టనివారణ చర్యల్లో బాగంగా పార్టీ ఆయన్ని బహిష్కరించింది.

  సరే, సమర్ ఆచార్జీ అక్రమ సంపాదన గురించి కాసేపు ప్రక్కన పెడితే, మనిషి అనే వాడు తనలో ఉండే కోరికలు తీర్చుకోవడానికి జీవితంలో ఎలా నటిస్తాడో ఆయన చెప్పిన మాటల్లోనే విశదమవుతుంది.అది తను స్వయంగా కష్టపడి సంపాదించిన సొమ్మని, దానిని తనకు ఇష్టం వచ్చినట్లు వాడుకునే స్వేచ్చ ఉందని, ఎన్నాళ్ళనుంచో డబ్బుల పరుపు మీద పవళించాలనేది తన కోరిక అని, త్వరలో కోటి రూపాయాల  కట్టలు పరచుకుని నిద్రిస్తాను అని చెప్పాడు.  తాను పార్టీ లోని ఇతర పెద్దలు లాగా  హిపోక్రటిక్ కాదని, చెసేది చెప్పటం తన నైజం అని తన నిజాయితీని చాటుకోబయాడు సదరు కమ్యూనిస్ట్ నేత!అన్నీ బాగానే ఉన్నయి కానీ తన మనసులో ఉన్న చిన్న నాటి కోరిక గురించి పార్తీలో చేరే ముందు చెపితే బాగుండేది. లేకపొతే అందులో అనుభవజ్ణుల సలహ తీసుకున్నా బాగుండేది. మనసులో కోరికలు తీర్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగర్తలు గురించి చెప్పే వారు. ఇప్పుడు చూడండి, పార్టీ పదవీ పోయే, దానితో పాటు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు పోయే!కోటి రూపాయల పరుపు కల ఎప్పుడు నెరవేర్చుకుంటాడు పాపం!కమ్యూనిస్ట్ ..కాదు..కాదు..కరెన్సీ ఇస్ట్ నేత!    

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!