అనాధ పిల్లలు చేత గొడ్డు మాంసం తినిపించి , బలవంతంగా బైబిల్ చదివిస్తున్న "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ "

                                                                               


                             
                                  కడివెడు పాలు లో ఒక్క విషం చుక్క కలిపినా అవి త్రాగటానికి నిస్సందేహంగా పనికిరానివే. అదే విదంగా భారత దేశం లో కొన్ని  క్రైస్తవ మిషనరీలు సేవలు పేరిట చేస్తున్న తతంగం వెనుకాల ఉన్న అసలు ఉద్దేశ్యం  "మత  మార్పిడి " యే కాబట్టి , అట్టి సేవలు ఏవైనా   ఈ  దేశానికి, సంస్కృతికి   అంతిమంగా చేటు తెచ్చేవే. కాబట్టి అటువంటి వాటిని తిరస్కరించాల్సిందే. ఇటీవల గ్రేటర్ నొయిడా , మీరట్ ల  లో "ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ " అనే క్రిస్టియన్ సంస్తలు నిర్వహిస్తున్న అనాధ పిల్లల ఆశ్రయ కేంద్రాలు మీద పోలిసులు దాడి చేసి అందులో బాదలు పడుతున్న సుమారు 30 మంది పిల్లలకు విముక్తి కలిగించారు. వారిని కౌన్సిలర్లు విచారణ జరుపగా వారు చెప్పిన విషయాలు విని కౌన్సిలర్ లకు మతి పోయింది అట.

                                    హాస్పిటల్స్ మరియు  మురికి వాడలకు కి వెళ్లి  బీద తల్లితండ్రులను "మీ పిల్లలను పెంచి పెద్ద చేస్తాం , IAS  ఆఫీసర్ లను చేస్తాం" అని వారిని ప్రలోభ  పరచి వారి వద్ద నుండి పిల్లలను తీసుకు వచ్చి వారిని తాము నిర్వహించే " అనాదల హోమ్" లలో పడేస్తారు. పిల్లలకు సరి అయిన సౌకర్యాలు సంగతి అటుంచి వారిని కనీసం పిల్లలు లా కాకుండా బానిసలు లా చూస్తారు అట . మొదట వారిని బలవంతంగా క్రిస్టియన్ మతం లోకి మార్చి వేస్తారు. రోజూ వారి చేత బైబిల్ ని వల్లే వేయిస్తారు అట . ఎవరైనా తప్పుగా బైబిల్ ప్రవచనాలు చదివితే వారి చేతులను తాళ్ళతో కట్టి   వేలాడ  తీసి గొడ్డ్లను బాదినట్లు బాదుతారు అట. బైబిల్ లోని వాక్యాలు  మరచి పోయిన వారికి 3 రోజుల పాటు ఆహారం ఇవ్వరట.

    క్రిస్టియన్ మత పిచ్చితో సదరు హోమ్ లకు దానాలు ఇచ్చే దాతలు వచ్చినప్పుడు , వారి ముందు పిల్లలతో గొడ్డు మాంసం తినిపించి  బైబిల్ ని వల్లే వేయిస్తూ తామెలా పిల్లలని బైబిల్ బానిసలుగా మారుస్తుంది చూపిస్తారు అట. అంతే కాక వారి ముందు పెంపుడు జంతువులను పెరేడ్ చేయించినట్లు పెరేడ్ చేయిస్తారట.

   ఇతర దాతలు, సందర్శకులు వచ్చినప్పుడు మాత్రం మంచి బట్టలు అవి వేసి వారి ముందు పెద్ద కరుణామయుళ్ళ పోజులు కొట్టె నిర్వాహక వర్గం, వారు వెళ్లి పోగానే వెంటనే వేసిన మంచి బట్టలు తీసి తిరిగి తమ దానవ రూపం ప్రదర్శిస్తూ ఉంటారట. పిల్లలను గలీజుగా ఉండె నేల మీదే పరుండబెడతారట. ఇవ్వన్ని గమనించిన పిల్లల తల్లి తండ్రులు కొందరు  తమ పిల్లల  దీనావస్త చూచి గుండె  చెరువు అయి , పోలీసులకు కంప్లైంట్ చేస్తే, డిసెంబర్ 29 న పోలిసులు రైడ్ చేసి 30 మంది పిల్లలకు విముక్తి కలిగించారు. వారిలో కొందరు చెప్పిన కటిక నిజాలు వలన  ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రానివి ఎన్ని  ఉన్నాయో!

               కంప్లైంట్ చేసిన వారిని ఇమ్మానుయెల్ సేవా గ్రూప్ గుండాలు బెదిరిస్తున్నారు అట. రోజూ రాత్రి వేళలో వారి ఇండ్ల మీద రాళ్ళు వేయడం , పిల్లలని తిరిగి పంపిచక పోతే వారి అంతు చూస్తామని బెదిరించడం లాంటివి చేస్తున్నారట. వీటన్నింటి  మీద సక్రమ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షింప చేస్తామని సంబందిత పోలిస్ వారు అంటున్నారు. దీనంతటికి మూల కారణం బలవంతపు మత మార్పిళ్ళు .  మత మార్పిడి చేయిస్తున్న వ్యక్తులకు , సంస్తలకు విరివిగా విరాళాలు అందుతున్నందు  వల్లే ఇటువంటి ఘోర కృత్యాలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని  ఆపాలంటే బలవంతపు మత  మార్పిళ్ళు   చేసె వారి మీదే కాకుండా , అందుకు విరాళాలు రూపేణా  ధన సహాయం చేస్తున్న వ్యక్తులను , సంస్థలను గుర్తించి , కేసులు పెట్టి  ప్రాసిక్యూట్ చేయడం అనివార్యం.


SOURCE:       http://www.hindustantimes.com/noida/greater-noida-shelter-kids-starved-forcibly-converted-to-christianity/story-msJFyEoZaffHcjNHA3I3UM.html

Comments

  1. Please check the spelling mistakes after typing. difficult to read.

    ReplyDelete
  2. mistakes rectified. thanks for your valuable suggestion.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం