తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు

                                                    (రాజారపు వినోద్ కుమార్ గారి సౌజన్యంతో)                    

  మనకు జన్మనిచ్చిన జన్మదాతలు వారు. మనల్ని పెంచి పోషించి మన ఉన్నతి కోసం నిరంతరము తపించిన ఔదార్యమూర్తులు వారు. మనం బాదపడుతుంటె తల్లడిల్లిపోయిన కారుణ్యమూర్తులు వారు. వారికి చదువు లేకపోయిన మన చదువుల కోసం మన పుస్తకాలు మోసి , మనల్ని ప్రయోజకుల్ని చెసిన వయోజనులు వారు . మన కోసమ్ ఉన్న ఊళ్లో ఆస్తులు తాకట్టు పెట్టి మన భవిష్యత్తు కోసం బంగారు భాటలు వేసిన శ్రామికులు వారు. వారే మన తల్లి తండ్రులు.

       అటువంటి   తల్లి తండ్రులును వ్రుద్దాప్యంలో తగిన గౌరవ ,సౌకర్యాలతో చూడవలసిన బాద్యత పిల్లల మీద లేదా? ఈ మద్య నా మిత్రుడు ఒకరి గురించి చెప్పాడు. తన మిత్రుదు ఒకాయనకి బార్య,ఇద్దరు పిల్లలు,తల్లి తండ్రి ఉన్నారంట . అయన బాగా స్తితిమంతుడంట. తనకి ఒక కారు, బార్యకి ఒకటి, అలాగే పిల్లలు ఇద్దరికి చెరొకటి. ఇన్ని ఉన్న ఆయనకు బార్య మీద అదుపు లేదు. అమేని మెప్పించటం కోసం తన ఆ స్తితి కి కారకులైన తల్లి తంద్రుల ఆలన పాలన చూడకుండ వారు లేకుండ ఉంటే బాగుండు ,వారి వల్లనే తనకి సుకం లేకుండా పోయిందని నా మిత్రుడు ముందు వాపోయాడట. నిజానికి అంత గొప్ప ఆస్తిపరుడుకి, తల్లి తంద్రుల బాగోగులు చూడడం కష్టమా? ఒకవేళ తన బార్యకి,తల్లితంద్రులకు పడకపోతే వెరే నివాసం  ఏర్పాటు చేసి ఐన వాళ్లను చూడవచ్చు. తగిన పనివాళ్లను నియమించి వారికి బాదలు లేకుండ చూడవచ్చు. అంతే కాని వారు లేకుండా పోవాలనుకోవడం అమానుషత్వం.

   కొంత మందిని చూస్తుంటాము. ఇంట్లో తల్లి తండ్రులని నిర్లక్షం చేస్తూ, దేవుళ్లకు మాత్రం లక్షలు,లక్షలు దానాలు చేసి పేపర్లలో మీడియాలలో ప్రచారం చేసుకుంటు ఉంటారు. పాపం వీరు చేసే దానాలను భగవంతుడు స్వీకరిస్తాడని వీరి నమ్మకం కాబోలు. సాక్షాతు ఇలవేల్పులైన తల్లి తండ్రులను కానని వారికి, ఆ భగవంతుని కటాక్షం,  లక్ష కోట్లు దానం చేసిన దొరకదు. ఇటువంటి వారి గురించి మహాకవి వేమన చెప్పిన దేమిటంటే,

                                                      తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు,

                                                      వాడు పుట్టినేమి,గిట్టినేమి.

                                                    పుట్టలోని చెదలు పుట్టవా! గిట్టవా!

                                                       విశ్వదాభి రామ! వినుర వేమ!

Comments

  1. వ్రుద్దాప్యంలో ఉన్న తల్లి తండ్రులకు చేసే సేవను మించిన భగవత్ సేవ లేదు.వారికి పెట్టె ప్రతి ముద్ద,నిత్య నైవేద్యంతో సమానమైనది.వారి అశీర్వచనాలు మించిన దైవానుగ్రహం ఈ ఇలలో లేదు గాక లేదు. ఇది స్వానుభవముతో చెపుతున్న మాట. దీనిని నమ్మినవారు ఈ విషయాన్ని మీ తొటివారికి చెప్పడం ఆ భగవత్ప్రాచారం తో సమానం.

    ReplyDelete
  2. tallini నిర్లక్ష్యం చేస్తూ, ఆవిడ ఆరోగ్యాన్ని పట్టించుకోక కనీసం ఫోను చేసి కూడా మాట్లాడని కొడుకులు కలిగి , ఆప్యాయంగా చేరదీసే కూతుళ్ళు వున్నా కొడుకులేలవున్నారోనని తాపత్రయపడే మా అమ్మ ఒక ఉదాహరణ...కొడుకు కోడలు చూడని గుడి లేదు ..కోరని దేవతలేదు..వీల్ల కోరికలకి దేవుడి సమాధానం ఏమిటో!!!

    ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )