జన అజ్ఞానమే వేదికగా ఖమ్మం జిల్లాలో కంప్యూటర్ రోగ నిర్దారణ నివేదికలంట!

                       


                     మోసాలు చేసే వారికి కులం ,మతం, వర్గం, బాష, బావం అనేవి ఏవి ప్రత్యేకంగా ఉండవు. వారి మోసాలకు అనువైన దానిని ఎంచుకుని లబ్ది పొందడమే వారికి తెలిసిన ఏకైక విద్య . . అలా మోసాలు చేసే వారికి ఆదునిక విజ్ఞానం కూడా బాగా ఉపయోగ పడుతుందనడం లో ఏ మాత్రం అబద్దం లేదు.
                           మనిషికి కనిపించే దేవుడు వైద్యుడు. ఆ వైద్యుడు ని తయారు చేసిన వైద్య శాస్త్రం అన్నీ శాస్త్రాలలో కెల్లా ముఖ్యమైనది. ఎందుకంటే రోగాలతో చావుకు దగ్గరవుతున్న మనిషిని బ్రతికించగల శక్తి ఆ  శాస్త్రం అబ్యసించిన వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి. కానీ ఆ శాస్త్రం లో నిష్ణాతులు అనిపించుకున్న వారే , వారి ఆద్వర్యంలో నిర్వహించబడే వైద్య శాలలే శవాలకు సైతం నటనా వైద్యం చేస్తూ అమాయకులు అయిన వారి నుండి లక్షలు గుంజుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఆదునిక విజ్ఞానం పేరు మీద జరుగుతున్న దోపిడియే. ఒక మంత్రగాడి వలన మోసపోయిన దాని కంటే కొన్ని వేల రెట్లు ఈ  ఆదునిక మంత్ర గాళ్ళ చేతిలో ప్రజలు మోస పోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

  ప్రజలకు శాస్త్రాల మీద అవగాహన ఉండదు. వారికి వైద్యుడు మీద , వారు చేసే వైద్య విదానం మీద ఉన్న నమ్మకమే వారిని వైద్యుల దగ్గరకు వచ్చేలా చేస్తుంది. శాస్త్రీయ బావనలు అభివృద్ధి చెందని కాలం లో కొంత మంది బూతవైద్యులు ప్రజలకు పట్టిన దెయ్యాలు వదిలిస్తామని చెప్పి, కోళ్ళు ,నిమ్మకాయలు ఖర్చు క్రింద కొంత వసూలు చేసి , ఒక పెద్ద సెటప్ తో ఒక తంతు లాంటిది నిర్వహించి రోగులకు వారిలోనుండి ఎదో బూతం బయటకు పోయిందన్న నమ్మకం కలిగించే వారు. ఇది కేవలం మైండ్ గేమ్ లాంటిది. తమకు ఎదో ఆవహించిందన్న బ్రమలో ఉన్న వారిని , అది బయటకు పోయిందన్న పాజిటివ్ దృక్పదం కలిగించడమే ఇందులోని రహస్యం. దానితో రోగి తిరిగి మామూలు గా మారి పోవడం జరుగుతుంది. కానీ  కేవలం మానసిక పరమైనవి  కాక శారీరక పరమైన సమస్యలు ఉంటే బూత వైద్యుడు వైద్యం పని చేయదు. ఏది ఏమైనా మనిషిలో ఉన్న అజ్ఞాన బూతాన్ని అతి తక్కువ ఖర్చుతో బయటకు వెళ్ళగొట్టే కిటుకే "బూత వైద్యం".

                                                                     


                           కానీ ఈ  మద్య ప్రజలలో పాక్షిక శాస్త్రీయ బావనలు కలుగుతున్నాయి. అందుకే వారు బూత వైద్యాలు వైపు కాకుండా కార్పోరేట్ వైద్యాల వైపు వెళుతున్నారు. కొంతమంది చేసే   కార్పోరేట్ వైద్యాలు కూడా  బూత వైద్యాల  మాదిరివే . , పెద్ద పెద్ద యంత్రాల మద్య రోగులను పరీక్ష చేసి లేని జబ్బులును ఉన్నట్లుగా చూపిస్తూ, లక్షలు గుంజుంతుంటే  ఆ దెబ్బతో రోగికి కలిగే , డబ్బు బెంగ కి ఉన్న జబ్బు బెంగ పారి పోతుంది. అలా తనకు వచ్చినది ఏదో గొప్ప జబ్బు అని , దానిని పలాని కార్పోరేట్ వైద్యశాల తప్పా వేరెవరూ బాగు చేయలేరని తన గ్రామాలలో చెపితే అదే నిజమనుకుంటారు పాక్షిక శాస్త్రీయ బావనలు ఉన్న జనం. అలా ఈ  ఆదునిక బూత వైద్యులు పబ్లిసిటి పొందుతున్నారు. .

  అయితే ఖమ్మం జిల్లాలో ఈ మద్య కొంత మంది ఈ ఆదునిక బూత వైద్యులుకి ఒక కొత్త ఆలోచన వచ్చినట్లుంది . ప్రజలలో రోగం కంటే రోగ బయం కలిగితేనే తమకు గిరాకీ ఉంటుందని బావించి , కొంత మంది ప్రచారకులను , ప్రజలలో రోగ బయాలు కల్పించడానికి పంపించారు. సదరు ప్రచారకులు కంప్యూటర్ లాంటివి ఏవో  పరికరాలను తీసుకుని వెళ్లి ,గ్రామాలలో శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ఆ పరికరలాను అమర్చారు. ఆ చుట్టు ప్రక్క ల ప్రాంతాలలో పేరున్న వ్యక్తుల చేత వీరి ప్రచార శిబిరాలను  ప్రాంభించారు . మరీ ఉచితం అంటే ప్రజలు డబ్బు లేని నిరు పేదలు వస్తారు కాబట్టి కొంత పిజ్ నిర్ణయించారు . అది కేవలం 40 రూపాయలు మాత్రమే. ఆ 40 రూపాయలతో సదరు రోగుల దేహం మొత్తం తాము తీసుకు వెళ్ళిన పరికరాలతో పరిక్షలు చేసి , రోగ నిర్దారణ నివేదికలు ఇచ్చారట. అందులో ప్రంపంచంలో ఇంత వరకూ వైద్య శాస్త్రానికి కూడా తెలియని రోగాల పేర్లు ఉన్నాయట. దానితో బెంబేలెత్తిన ప్రజలు ఈ  జబ్బులని నయం చేసే వారెవ్వరూ అంటే , ఆ ప్రచారకులను పంపించిన వైద్యుల  పేర్లు చెపితే , అప్పుడు ప్రజలు వారి వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుని , వారు ఆడిగినంతా దారపోసి , తమకు లేని జబ్బును నయం చేయించుకుని వస్తున్నరంట !. .

                                                                     


                           ఖమ్మం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలలో ఈ  తరహా మోసపు తంతు కొన్నాళ్ళుగా జరుగుతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరైనా మంత్రగాళ్ళు కనపడితే చాలు , పూనకం వచ్చి ఊగిపోయే విజ్ఞాన వాదులకు ఇలాంటివి అస్సలు కనపడవు. ఎందుకంటే ఇది ఆదునిక వైద్యులకు ఆదాయం చేకూర్చే విదానం కాబట్టి. అందుకే ఈ  ఆదునిక బూత వైద్యులు ఆడింది ఆటా , పాడింది పాటగా ఉంది. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరచి ఎవరు ఏది చెపితే అది నమ్మకుండా , ప్రతి కుటుంబం ,తమ  కుటుంబ సబ్యుల ఆరోగ్యాన్ని కాంక్షించే ఒక నమ్మకమైన  డాక్టర్ని ఎంచుకుని వారి సలహాతో ఆరోగ్యాలను కాపాడుకుంటే మంచిది. ప్రతి ఇంటికి ఒక పామిలీ  డాక్టర్ ఉండాల్సిన ఆవశ్యకతను ఈ  ఉదంతం తెలియచేస్తుంది.

                                             (Republished post. OPD : 9/1/14).

Comments

  1. డొనేషన్ల మీద వైద్యులు ఐనవారు,రోగులను మోం సెయదమే లఖ్యం ఆగుతున్న ప్రపంచ ఆరోగ్య అంతర్జాతీయ సమాఖ,ప్రపంచ అవుషధ అమాఖ్య,ప్రపంచ వైద్యాల మండలి వంటి వాటి వల్ల ఆధునిక వైద్య విధానాలలోనూ త్రీవ్రమైన తప్పులు జరుగుతున్నవి.వొకప్పుడు బైపాస్ చేతే 7 సంవత్సరాలు డోఖా లేదు.కానే నేడు అదే సర్జరీ కి డొనేషన్ వైద్యులే గ్యారంటీ ఇవ్వకపోగా,ఈ 7 ఏళ్ళ వ్యవధిలో రోగి బాల్చీ తన్నదమో లేక మరో సారి బ్య్పస్స్కి వెళ్లడమో జరుగుతున్నది.భారత్లో వాడే అన్ని రకాల వైద్య యంత్రాలూ సరికోత్హవి కానే కాదు,వీటిని అమెరికా,జర్మనీలో లోని దవాఖనాలనుంచి సెకండ్ హ్యాండ్ రాటు కి కొని మనం వాడుతున్నాము.రోగిని చూడగానే వైద్యులకు వొక నడచి వచ్చే ఆఉపత్రి బిల్లు పేపర్ కనిపితోంది తప్ప,రోగ నిర్ధారణ మీదకు మనసు పెట్టడంలేదు.వైద్యులు నడిపే లాబ్స్,మెడికల్ షాప్స్,పెరుగుతున్నాయి కానీ రోగ నిదానం జరగడంలేదు.రోగానికి యే మందు పనిచేస్తుందో నేటి సబ్-స్టాండర్డ్ వైద్యులకు తెలియక వారికి గుర్తున్న ప్రతి మందును ప్రిస్క్రిప్షన్ మీద కేలికేసి రోగి దేహాన్ని మరింత విషపూరితం చేస్తున్నారు...

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!