బ్రతికున్న వారిని "లైఫ్ సర్టిఫికెట్ " తెచ్చుకో అనే వారిని ప్రశ్నించలేని వారికి చాగంటి వారి ప్రవచనాలను తప్పుపట్టే అర్హత ఉందా?

తాను బ్రతికి ఉన్నట్లు గుర్తుగా భార్య మెడలో తాళి కడతాడట.. ఒక వేళ తాళి లేకపోతే భర్త బ్రతికి ఉన్నాడు అనే విషయం ఆమె మరిచి పోతుందేమో..!! ప్రపంచంలోని ఇతర దేశాల, మతాల భార్యలు తమ భర్త ఉన్నాడు అని మర్చిపోతున్నారా?? భార్య బ్రతికి ఉంది అని భర్త కు గుర్తు ఉండొద్దా...?? భర్తకు జ్ఞాపక శక్తి ఎక్కువనా..?? లేక గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదా...??
చాగంటి కోటేశ్వర రావుగారు గ్రుడ్డి నమ్మకాలను భక్తి పేరుతో ప్రచారం చేస్తూ సమాజాన్ని 200 సంవత్సరాలు వెనకకి తీసుకు పోతున్నాడు అన్నదానిలో ఎవరికయినా సందేహం ఉందా...??:- ఎర్ర వాదం 
నిన్న ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూసాను. పై ఫోటో సహిత వ్యాఖ్యానమే సదరు పోస్ట్.  ఆ పోస్ట్ పెట్టినోళ్లు  దశాబ్దాలుగా సమాజాన్ని తమ "ఎర్ర " కళ్ళతో చూసి , చూసి ఎర్రెత్తి పోయినోళ్ళు అనిఅనిపిస్తుంది. ఎందుకంటే హిందూ వివాహాల్లో పెండ్లికూతురుకు పెండ్లి కొడుకు కట్టే తాళి విషయం లో సైతం సమానత్వం అక్కరలేదా? అని ప్రశ్నించే గడుసు తనం  తనం   ఒక్క "ఎర్ర " వారికి తప్పా ఎవరికి ఉండదు అనుకుంటాను . 2014 లో తమిళనాడు లోని తిరువాయూరు లో ఇలా ఎర్ర సాహిత్యం తో వేడెక్కి పోయిన "వాసంతి " అనే అమ్మాయి తన పెండ్లి సందర్భంగా వరుడు తనకు తాళి కట్టగానే వెంటనే తాను సిద్ధంగా ఉంచుకున్న తాళిని అతడి మెడలో కట్టి ,తాను అతనితో సమానం అని చాటుకుంది ఆట. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఇదే బ్లాగులోని ఈ

సమానత్వం కోసం తాళి ని ఎగతాళి చేసిన కమ్యూనిస్ట్ వాసంతి !  పోస్ట్ ని చూడండి .


     ఇక చాగంటి వారి ప్రవచనాలు విషయం కి వస్తే ,అవి మన ఆచార సాంప్రదాయాల ప్రకారం మనం ఏర్పరుచుకున్న బావాలు, పద్ధతులు గురించి వివరించే క్రమంలో చెప్పిన మాటలు. అవేమి ఆయన గారి కపోల  కల్పితాలు కావు , ఎవరి బావాజాలాన్నో కాపీ కొట్టి చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు కావు. తాళి కట్టి ఆలిని చేపట్టడం అనేది  హిందూ జీవానా విధానం లో నివసిస్తున్న చాలామందికి వివాహ తంతులో ఒక భాగం గా ఉంది. కొన్ని గిరిజన సంప్రదాయాల్లో తాళి కట్టడం అనేది లేదు. అంత మాత్రం చేత వారిని మొగుడు పెళ్ళాలు కాదని హిందూ సమాజం అనడం లేదే ! అలాగే  హైందవేతర మతాల్లో తాళి అనేది లేకపోవచ్చు. అది వారి సంప్రదాయం . కానీ దానిని చూపించి హిందువుల తాళి కట్టే పద్దతిని ఎగతాళి చేయడం విజ్ఞానవంతుల  లక్షణం కాదు.హిందూ  వివాహ పద్దతి అనేది పూర్తిగా మతపరమైనది . వాటిని కించపరచడం అంటే మనోభావాలను గాయపరచి నట్లే. అలాగే అది నేరం కూడా .ఎర్ర వాదం

                                                                   

   
     మన ప్రభుత్వ అధికారులు పెన్షన్ లకు అర్హులైన వయో వృద్ధులను ,పోయిన సంవత్సరం బ్రతికి ఉన్నట్లు సర్ది ఫికేట్ తెచ్చుకుంటేనే పెన్షన్ ఇస్తాం అంటే వారూ నానా యాతనలు పడి , "సదరు పెన్షన్ దారు బ్రతికే ఉన్నాడు అని గెజిటెడ్ ఆపీసర్ లతో  సర్టిఫికెట్ లు తీసుకుంటున్నారు. సాక్షాతూ పెన్షనరే ఎదుట సజీవంగా కనపడుతుంటే "నీవు  బ్రతికి ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకో " అని  కబోదుల లా మాట్లాడే వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు "ఎర్ర గుంపు" ఉద్యోగ సంఘాలకు చెందిన వారే. మరి వారికి ఏ నాడు ఇలాంటి నిబంధన మతి మాలినదిగా అనిపించ లేదు. కాబట్టి ఇదేమి మతిమాలిన నిభందన అని ప్రశ్నించలేక పోయారు .  కానీ , చాగంటి వారి ప్రవచనాలు మాత్రం 200 ఏండ్లు వెనక్కి నెట్టేవిగా అనిపిస్తున్నాయట. నిజమే మరి ! 100 ఏండ్ల నాడు కనుక ఇలా  బ్రతికి ఉన్నవాడిని "లైఫ్ సర్టిఫికెట్ " తెచ్చుకోమంటే మంచి బాటా చెప్పుతో మూతి మీద కొట్టేవారు. ఇప్పుడేమో అన్ని మూసుకుని అధికారులు అడిగిన పిచ్చి సర్టిఫికెట్ లు తెచ్చి పని కానిచ్చుకుంటున్నారు. కానీ హిందూ స్త్రీలకు, అలాంటి ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ లు అవసరం లేదు. మెళ్ళో తాళి కనపడితే చాలు ఆమె తో పాటు ఆమె భర్త కూడా బ్రతికే ఉన్నాడని సామాన్యుడు కూడా గుర్తిస్తాడు  . అంటే ఆమె బ్రతికే ఉందనటానికి ఆమెలోని జీవం సర్టిఫై చేస్తుంటే , ఆమె భర్త కూడా బ్రతికే ఉన్నదని ఆమె మెడలో ఉన్న తాళి బొట్టు సర్టీపై చేస్తోంది.

                 వెనుక శత్రు రాజుల  దురాక్రమణలు జరిగినప్పుడు వారు కన్నె పిల్లలనుఎత్తుకు పోవడం ,  చెరచడం . వివాహితుల జోలికి రాకుండా ఉండడం జరిగేది ఆట. దానివలన ఆడపిల్లల మెడలో తాళి కట్టి ఆమెకు కొంత రక్షణ ఏర్పాటు చేశారు అంటారు. మగపిల్లలను  ఎత్తుకుపోయి రేప్ లు చేసే ఆధునిక సంస్కృతి అప్పుడు లేదు కాబట్టి  మగవాళ్లకు తాళి బొట్టు అవసరం లేకుండా పోయింది. అంతే కానీ ఆడోళ్లకి తాళి బొట్టు ఉంటే మగవాల్లకి ఎందుకు లేదు అనే కుతర్కాలు తిస్తె ఎలా?  తాళి బొట్టు పేరుతో ఆమెకు వివాహ సందర్భంగా ఎంతో కొంత బంగారం ఆమె మెడలో వేస్తున్నారు అత్తింటి వారు. అలా అది ఆమెకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చుతుంది. అలా ఒకప్పుడు ఆమె మాన ప్రాణాలను కాపాడిన తాళి బొట్టు , ఇప్పుడు ఒక విలువైన వస్తువుగా ఆమెకు ఉపయోగపడుతుడే తప్ప , ఆమెకు ఏ నష్టం కలుగనీయడం లేదు.


             ఈ ఎర్ర గుంపు కి హిందువులు అన్నా హిందూ సమాజం అన్న తగని ఒళ్ళు మంట . ఎందుకంటే వీరు కోరుకునే ఎర్ర సామ్రాజ్యం రాకపోవడానికి ఇక్కడ ఉన్న పటిష్టమైన హిందూ జీవన విధానం దాని తాలూకు సంస్కృతి సంప్రదాయాలు లోని సుగుణాలు అని వారికి బాగా అర్థం అయింది  . ఒక దేశం ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అంటే అక్కడి సంస్కృతి  సంప్రదాయాలను సర్వ నాశనం చేయాలి అనేది "ఎర్ర సిద్దాంతం " లో బాగమట . అలా అనే రష్యాలో తమ సామ్రాజ్య విస్తృతి కొరకు అక్కడి ఆడవాళ్లకు "ఎర్ర సిదాంతం " నూరి పోస్తే , చివరకు జరిగింది ఏమిటంటే , 20 ఏండ్లకే 3 మొగ్గుళ్లకు విడాకులు ఇచ్చి నాలుగో మొగుడి కోసం ఎదురుచూసే తెంపరితనం అబ్బింది తప్ప ,ఒక్కరితోనే జీవితకాలం సర్దుకు పోగల సహన శీలత్వం నిలబడలేకపోయింది ఆట . దానివలన రష్యన్ సమాజం లో అనేక ఒడిదుడుకులు ఏర్పడ్డాయి ఆట . ఇలా ఇండియాని చేయాలని ఎవరైనా తలపోస్తే వారు మరో 100 జన్మలు  ఎత్తాలసిందే .

     కాబట్టి ఎర్ర సిదాంత వాదులు , మతపరమైన అంశాల జోలికి పోకుండా మరేదైనా మాట్లాడుకుంటే హుందాగా ఉంటుంది. మతపరమైన విషయాల్లో మాట్లాడాలి అనుకుంటే అది కేవలం ఆరోగ్యానికి భంగం కలిగించే ఆచారాల విషయం లోనో , దేశభద్రతకు భంగం కలిగించే ఆచారాల విషయానికో పరిమితమైతే సంతోషమే. ఎందుకంటే ఆ 2 విషయాల్లో తప్ప మరే మతపరమైన విషయం లోను రాజ్యానికి కూడా అధికారం లేదని, రాజ్యాంగం  బల్ల గుద్ధి  చెప్పింది కాబట్టి 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!