బాయ్ ప్రెండ్ రమ్మనాడని రూం కెళితే,'బ్రతుకు బ్లూ పిలిం అయిందట ' !!!
"రెండేళ్ళుగా ప్రేమ వంచన " అనే టైటిల్ పేపర్లో చూసి ,ఏమిటీ విషయం అని పేపర్ లోని విషయం ఆసాంతం చదవటం జరిగింది .కధ మామూలే .'బాయ్ ప్రెండ్,గర్ల్ ప్రెండ్ ' సంస్కృతికి బలి అయిన ఒక అబాగిని వాస్తవ జీవితం అది . ఈ డర్టీ బాయ్ ప్రెండ్ సంస్కృతి వద్దమ్మా ,అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోని "నవీన" ఆడపిల్లలకు ఈ ఉదంతం ఒక కను విప్పు కావాలి . బాయ్ ప్రెండ్ లు పిలిచారని ఎక్కడికి పడితే అక్కడికి ఎగేసుకు పోయె ఆడపిల్లల గురించి ,సదరు బాయ్ ప్రెండ్ కు ,ఆ ప్రెండ్ ప్రెండ్ లకు ఎటువంటి అభిప్రాయం ఉంటుందో ,ఈ ఉదంతం చక్కగా తెలియ చెస్తుంది . విదేశాల సంగతి ఏమో కాని ,ఈ దేశం లో మాత్రం ,బాయ్ ప్రెండ్ ఉన్న అమ్మాయిలు "ఆ బాపతే "అని చాలా మంది బాయ్ ప్రెండ్ లకు వీర నమ్మక్కం .ఒక్క సారి బాయిప్రెండ్ కాని ,అతని స్నేహితుల రూం కి కాని వెళితే ,ఇక ఆ పిల్ల బ్రతుకు "వేటగాళ్ళకు చిక్కిన లేడి'" వంటిదే .
అమ్మా నాన్నలకు దూరంగా ఉండి విద్య నబ్యాసిస్తున్న ఆడపిల్లలు ,ఇంటి దగ్గర ఉన్న దాని కంటే కూడా మరింత జాగర్తగా ఉండాల్సిన అవసరం ఉంది .ఆడపిల్లల మీద ఎంతో నమ్మక్కం తో ,వారి కెరీర్ ను ద్రుష్టిలో ఉంచుకుని ,తమకు ఇష్టం లేక పోయినా ,విది లేని పరిస్తుతుల్లో , దూరంగా ఉంచి ఆడపిల్లని చదిస్తున్నప్పుడు ,దిక్కుమాలిన విదేశి సంస్కృతీ మీద వ్యామోహంతో ,అమాయకంగా 'మ్రుగాళ్ళ "చేతిలో ఇరుకున్ని తమ బ్రతుకులు నాశనం చేసుకుంటున్న ఓ నవ నాగరిక యువతులారా ! ఒక్క సారి ఆలోచించండి . ఒక్కసారి బాయ్ ప్రెండ్ కు చిక్కితే ,వంద తోడేళ్ళకు చిక్కినట్లే . మీ బాయ్ ప్రెండ్ చేతిలో సెల్ మిమ్మల్ని "బ్లూ స్టార్ " గా మార్చి వేస్తుంది . మీ బాయ్ ప్రెండ్ స్నేహితులు మీ నీలి చిత్రానికి పిచ్చ పబ్లిసిటి ఇస్తారు . అది ఎంత దూరం వెళుతుందో ఎవరికీ తెలియదు . అది మీ జీవన పర్యంతం మిమ్మల్ని ,మీ కుటుంబ సబ్యులను వెంటాడుతూనే ఉంటుంది . పోలిస్ యాక్షన్ అనేది "కొంపలు తగల బడ్డాక , వచ్చి మంటలు ఆర్పే పైరింజన్ " చర్యలు లాంటివి మాత్రమె అని మరువవద్దు . ముందు మీరు జాగర్తగా ఉండండి .ఆ పై జాగర్తగా ఉండమని మితి మీరె వాళ్ళను హెచ్చరించo డి. బవిష్యత లో ఇలాంటి కేసులు ఎక్కువైతే తల్లి తండ్రులు తమ ఆడపిల్లలను పై చదువులు కోసం దూర ప్రాంతాలకు పంపించక పోవచ్చు .తిరిగి ఆడపిల్లల జీవితం వెనుకటి కాలం లోమాదిరి అవ్వచ్చు .అలా కాకుండా చూడాల్సిన బాద్యత ఈ తరం ఆడపిల్లలు మీద ఉంది .
ఇక ఈ ఉదంతం వివరాలు కావాలంటే పైనా ,పైన ఇచ్చిన చిత్రాలు తాలూకు సమాచారం చూడండి .కధ మొత్తం మీకే అర్ధం అవుతుంది .
(Republished Post. 23/2/2015).
(Republished Post. 23/2/2015).
Comments
Post a Comment