మానవ వాదమంటే మహా భారత "యాదవులను" కించపరచడమేనా?
మహా భారతం అనేది ప్రపంచంలో ఉన్న హిందువులందరికి పరమ పవిత్రమైన ఇతీహాసం.ఇందులోని ఒక ఘట్టమైన గీతా సారాంశం పవిత్ర గ్రందం. అసలు ప్రపంచంలో ఏ మత గ్రందమైన కొన్ని అబూత కల్పనలతో కూడి ఉంటాయి. వీటిని విమర్శనాత్మక ద్రుష్టితో చూస్తే, మిగిలేది బూడిదే. ఇవి మానవుని అద్యాత్మిక ఆనందం కోసం ఉద్దేశీంప బడినవి. ప్రతిదీ ప్రశ్నించే వ్యక్తి సుఖ శాంతులతో జీవించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మనిషి జీవనానికి తార్కిక జ్ణానం డెబ్బై పాళ్ళు ఉంటే, అలౌకిక ఆనందం ముప్పై పాళ్ళన్న ఉండి తీరాల్సిందే. అంటే బండికి ఇందనం లాగ తార్కిక జ్ణానం పనిచేస్తే, కందెన లాగ అలౌకిక ఆనందం పని చేస్తుంది. అలాంటి అలౌకిక ఆనందం కోసం ఉద్ద్యిశించ బడినవే రామాయణ, మహా భారతాలు. ఇవన్నీ అలౌకిక ఆనందం కోసం మత పరంగా చెప్పబడినవి కాబట్టి అదే ద్రుష్టితో చూడాలి కాని కొంతమంది కి కున్న తార్కిక శక్తి చూపడానికి వీటిని వాడుకోవడం ఏ మాత్రం క్షమించరానిది. ఉదాహరణకు కర్ణుడు సూర్యుడు, కుంతిల పుత్రుడు అని ఉంటుంది. మనకు సూర్యుడు మండే వాడని ఎప్పటినుండో తెలుసు. భారతం రాసే సమయానికి కూడా తెలుసు. మరి మండే గోళం కి మనిషికి మద్య సంయోగం ఎలా సంభవం? అలాంటి ప్రశ్నలతో భారతం చదవలేడు. చదివినా ఆనందం పొందలేడు. మహా భారతమంతా అలౌకిక బావనలు,తో ఆ నాటి రాజుల చరిత్రను భారతీయులకు ఆవిష్కరించిన గ్రందాలు అవి.
చారిత్రక ద్రుక్పదంతో చూస్తే రామాయణ, మహా భారతాలు చరిత్రలో చోటు లేనటువంటివి. మరి అటువంటి చారిత్రక అదారం లేనటువంటి గ్రంద అంశాలను చరిత్రకారులు విమర్శింశించడానికి వారికి ఉన్న అధికారమేంటి? భారతీయుల అలౌకిక ఆనందాన్ని భంగ పరచే హక్కు వారికెవరు ఇచ్చారు?.మతవిశ్వాసాలతో కూడిన అంశాలను తార్కిక జ్ణానంతో చూసే వాడు ఎంతటి పిచ్చి వాడు అంటే వారి తార్కికానికి కూడ అందనంత!.
ఇంతకి ఈ ఉపోద్గాతం ఎందుకంటే "మానవవాదం " పేరుతో కొందరి వ్యసాలను అనువదిస్తున్న వ్యక్తి ఒకరు పోస్ట్ చేసిన గీతా రహస్యం చదివాను. ఆయన పక్కా మత వ్యతిరేకి. భారత రాజ్యాంగం ప్రకారం ఒకరి మత విశ్వాసాలను కించపరచడం నేరం. పైన చెప్పినట్లు మహా భారతం చారిత్రక గ్రందం కాదు. పక్కా మత విశ్వాసాలతో కూడుకున్నది. అందులోని శ్రి క్రిష్ణుడు దశవతారాలలో ఒకరు. ఆయన యాదవులకు రాజు కూడ. మహా భారత కాలంనుండి "యాదవులకు" ఒక ప్రత్యేకమైన గౌరవ స్తానం ఉంది. ఆధునిక కాలంలో పుట్టిన మహానీయులను ఆదర్శం గా తీసుకుని కొన్ని కులాల వారు ఎంతో గొప్పగా తమ సామజిక వర్గాన్ని బావిస్తున్నారు. మరి సాక్షాత్తు భగవంతుడు అని భారతీయుల చేత కొలవబడిన "శ్రీ క్రిష్ణుడు" పుట్టిన లేక పెంచబడిన యాదవకులంలో తాము పుట్టినందుకు సమాజంలో ఒక గౌరవ స్తానాన్ని కోరుతున్న యాదవుల పూర్వీకులను కించపరచేలా కొన్ని వ్యాక్యలు చేస్తే అవి విమర్శకుల ద్రుష్టి అని సరి పెట్టుకోవాలా? ఆ విమర్శను చూడండి.
కృష్ణుడు ఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారం ద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ స్త్రీలను తమ కుటుంబాలతో పాటు సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి జలకాలాడుతూ, తాగుతూ తింటూ అనుభవించేరన్నాడు.కృష్ణుడి సంతానం, ఇతర కుటుంబీకులూ, బట్టలూ, నగలూ ఒడ్డున పెట్టి జలక్రీడలలో నిమగ్నులయ్యేవారు. యాదవ స్ర్తీ పురుషులంతా తాగుడుకు అలవాటు పడ్డవారే.
ఇంత నీచంగా విమర్శించడానికి ముఖ్య కారణం హిందువుల చేతకాని తనమా?. అదే విమర్సలు ఇతర మత గ్రందాలలోని అంశాల గురించి చెయ్యగలరా? లేదు. కాని హిందువుల గురించి చేస్తున్నారు అంటే కారణం మాలో ఉన్న పరమత సహనమే కాదు. పిచ్చి వాళ్ళ పట్ల కూడ సహనం కలిగి ఉండడడమే.అదే హిందువుల గొప్పతనం!
( Republshed post.9/7/2013)
Comments
Post a Comment