"విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?

                                                                         

No other than thou, PRAJAPATI, hast given existence to all these beings ; may that object of our desires for which we sacrifice to thee be ours, may we be the possessors of riches.(Rig Veda 10.121)


మొన్న నేను ఒక మిత్రుని బ్లాగులో ప్రచురించిన విగ్రహారాధన కంటె విగ్రహాలు లేని ఎకేశ్వరోపాసనే ప్రాచీనమైనది అని , పూర్వకాలం లో విగ్రహాలు లేకుండానే ప్రజలు దేవతలను ఆరాదించే వారని , విగ్రహాలు ఉన్నా వాటిని పూజించే వారని కాదని , మహా అయితే ఏ 400 సంవత్సారాల క్రితమో విగ్రహారాధన మొదలు అయిందని , ఆకుకు అందని పోకకు పొందని ,అయన గారి  స్వపరిశోధనా పలితాంశాలను చూసి కొంత ఆశ్చర్యం వేసింది. విగ్రహారాధన మొదలు అయి 400 యేండ్లా అని నివ్వెరపోవలసి వచ్చింది. నాకు ఉన్న జ్ఞానం మేరకు మన నాగరికత అని చెప్పుకుంటున్న వేళ యేండ్ల నాటి హరప్పా మొహంజొదారో నాగరికతలోనే విగ్రహారాధన ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.అందులో ముక్యమైనది పశుపతి నాధుని మూర్తి . 

                                                     




       చరిత్రకారుల ప్రకారం  హరప్పా త్రవ్వకాలలో లబించిన పై న చిత్రం లో కనపడే దేవుడు పశుపతి నాడుదు అని, హరప్ప అంటె 3500 సంవత్సారాల క్రితమే ప్రజలలో విగ్రహారాధన తో కూడిన దైవ ఆరాధన ఉండేది అని అభి ప్రాయపడ్డారు. అలాగే అ తర్వాతి కాలాల చారిత్రిక ఆధారాల ప్రకారం చూసినా విగ్రహారాధన ప్రాచీనమైనద్ అని చెప్పవచ్చు. వేద కాలం లో విగ్రహారాధన అనే ఇప్పటి విదానం  ప్రత్యేకంగా లేకపోవటానికి కారణం వారు ప్రక్రుతి శ క్తులును ముక్యంగా సూర్యుడు ఇతర ప్రక్రుతి దేవతలను పూజించడమే. విగ్రాహం అంటె మట్టితోనో , రాయితోనో చేస్తేనే విగ్రహం కాదు. ఏ రూపం  లేక ఆకార  పూజ అయినా విగ్రహారాధన క్రిందకే వస్తుంది. అది తెలియక 400 ఏండ్ల నాడు విగ్రహారాదన మొదలు అయింది అని కధలు చెపితే ఎలా? 

 ఇదే విషయం మీద ఇంతకు ముందు వేరే బ్లాగులో ఒక ఆర్టికిల్ రాయడం జరిగింది. దానిని క్రింద ఇస్తున్నాను చూడండి.  


"ఈ  మద్య నేను ఒక మిత్రుని బ్లాగులో విగ్రహారాదనను హిందూ మహా పండితులు వ్యతిరేకించారు కాబట్టి దానిని పాటించక పోవడమే మంచిది అన్న ఉచిత సలహా చూసే సరికి , నాకు నవ్వు ఆగలేదు . అసలు హిందూ అంటె అర్దం తెలియని వారు , తాము అనుసరించే మతవిదానాలు మాత్రమె మహా గొప్పవని విశ్వసించే వారు రాసిన బ్లాగ్ రాతలు అవి. హిందూ ఆరాధనా పద్దతులు లో రెండు రకాలు ఉన్నవి . ఆకార, నిరాకార పద్దతుల్లో ఆ భగవంతుణ్ణి ఆరాదించవచ్చని మన పెద్దలు చెప్పారు. వ్యక్తుల యొక్క మనస్సును  నిగ్రహించే  స్తాయి ని పట్టి అతనికి లేక ఆమెకు ఆకార లేక నిరాకార ఆరాధనా పద్దతిని ఎంచుకోవడం జరుగుతుంది .


        ప్రతి మతంలో కొన్ని శాఖలు ఉన్నాయి . వారికి వేరెవేరు ఆరాధనా పద్దతులూ ఉన్నయి. ఎవరి పద్దతిలో వారు పూజలు చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కాని నీది తక్కువ  నాది ఎక్కువ  అన్నప్పుడే , ఆ ఎక్కువ తన్నాన్ని పరీక్షించడానికి మొత్తం కెలక వలసి వస్తుంది. ఇది దేవుదు ఒక్కడే అని నమ్మే వారికి సరి అయిన పద్దతి కాదు. అసలు విగ్రహారాదన పద్దతి ఎవరికీ  అవసరం , నిరాకార ఆరాధన పద్దతి ఎవరికీ అవసరం అనేది చూదాం .

  మనకు  " హిప్నాటిజం " అనే దానిలో సాధకుడు అవలంభించే విదానాలు ఎలాగుంటాయి చూడండి . బాగా ప్రాక్టిస్ ఉన్నవారు " సెల్ప్ సజె షన్ " ల ద్వారా సబ్కాన్షియస్ స్తితికి వెళ్లి , ఆ స్తితిలో మైండ్ కి పాజిటివ్ సజెషన్ ల ద్వారా తమలోని నెగటివ్ బావాలను మాయమయ్యేలా చేస్తారు . తద్వారా వారు నిజ జీవితంలో విజయాలను సాదిస్తారు  అని అంటారు. అలాగే కొత్తగా ప్రాక్టిస్ చేసే సాధకుల ఎదుట , హిప్నాటిశ్ట్ ఒక లైట్ నో , లేక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచి దానినే తదేకంగా చూస్తూ ఉండమని చెప్పి, వారికి సజెషన్ లు ఇస్తూ సబ్ కాన్షియస్ స్తితిలోకి తీసుకువెలటాడు . ఆ తర్వాత పాజిటివ్ సజెషన్ లతో మైండ్ లోని నెగటివ్ నెస్ ని లేకుండా చేస్తారు. బాగా ప్రాక్టీస్ ఉన్న వారికి ఏ అబ్బ్జెక్టు ఉండవలసిన అవసరంలేదు.

   హిందూ ఆరాధనా పద్దతిలో విగ్రహారాదన కూడా మానసిక స్తిరత్వానికి ఉద్దేసించిందే . విగ్రహం ని ఒక ఆబ్జెక్టు గా చేసి, సంకల్పం ద్వారా భగవంతుని అరాదనకు మనసును సిద్ధంచేసి, తదేక ద్యానంతో భక్తులు తమ మనసును ఆ భగవంతుని మీద లగ్నం చేసి ఆరాదిస్తారు. దానికి ఆచార్యులు  ఆరోహ , అవరోహణ క్రమంలో పాటించే మంత్రోచ్చారణ , భక్తులను త్వరగా సబ్కాన్షియస్ స్తితిలోకి తీసుకు వెలుతుంది. ఆ స్తితిలో వారి మనసు కోరుకునేదే నిజ జీవితంలో సిద్దిస్తుంది. ఒక వేళ విగ్రహం , మంత్రోచ్చారణ లేకుండా మనసుని సబ్కాన్షియస్ స్తితికి తీసుకువెళ్ళే సమర్దత  ఉన్న వారికి విగ్రహం అవసరం లేదు. అటో సజెషన్ చాలు. అంటె ఒక రకంగా ఈ నాడు హిప్నాటిజం లో మనసు ని నియంత్రించుకుని , పాజిటివ్ సజెషన్ ల ద్వారా మైండ్ ని శక్తివంతం చేసుకుని నిగ్రహ పరులుగా మారడానికి ఏ పద్దతులు అవలంబిస్తున్నారో , అవే పద్దతులు విగ్రహ ఆరాధన పద్దతిలో , వేల సంవత్సరాల క్రితమే మన పూర్వికులు ప్రవేశ పెట్టారు. అసలు హిప్నాటిజం సైన్సు కాదు అనే వారు ఉన్నారు. వారికి పెద్ద నమస్కారం పెట్టి వదిలెయ్యడం మంచిది.

   యితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటె,సోషలిజం కి, కమ్యునిజం కి తేడా తెలియని బోల్డంత మంది , కమ్మ్యునిస్ట్ పార్టిలో  ఉన్నట్లు, నిరాకారా పద్దతిలో ద్యానం  చేసి మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవటం ఎలాగో తెలియని వారు , నిరాకార ఆరాధనా పద్దతి గురించి తెగ లెక్చర్ లు ఇస్తున్నారు . అదే అసలు బాద. మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవడమనేది చాలా కష్ట తరమైన ప్రక్రియ. అది సామాన్యునికి సాద్యం కాదు. రోజుకు 3 సార్లు వంగుని లెగిస్తేనొ, 30 సార్లు బోర్లా పడుకుంటేనో అది సాధ్య పడుతుందని నేను అనుకోవడం లేదు. అందుకే సామాన్యులైన మానవులు " విగ్రహారాదన " పద్దతిలో అయినా ఆ దేవున్ని పూజిస్తే కొంతలో కొంత మానసిక  తృప్తి పొందవచ్చు . అందుకే జ్ఞానులకు నిరాకార మార్గం, సామాన్యులకు ఆకార మార్గం. అన్నీ తెలిసిన వారికి ఆకారం అయినా నిరాకారం అయినా ఒకటే . తెలిసి , తెలియని వారికి ఏ "కారం " అయితే బెస్టో  వాళ్ళ దేవుడే చెప్పాలి.

      చివరగా ఒక మాట. సైన్స్ ప్రకారం ఈ సృష్టి అంతా ఎలక్టాన్ , ప్రోట్రాన్ , న్యూట్రాన్ లే ఉన్నప్పుడు ,కనిపించే  విగ్రహం లో నైనా , కనిపించని నిగ్రహం లోనైనా ఉన్నవి అవే కదా? మరి ఏ పద్దతిలో పూజిస్తేనేమ్ . అంతా ఎలెక్ట్రాన్ ,ప్రోటాన్ , న్యూట్రాన్ ల మాయే తప్పా , అనుకోవడానికి ఏముంది ? !!!!


సోర్స్:- కల్కిఖడ్గం: "విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరే...:                                                                             

Comments

  1. >>>విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?

    ఏముందో తెలీదు గాని 'సెన్సు' మాత్రం లేదనుకుంటా :) జేకే !

    జిలేబి

    ReplyDelete
  2. Narasimha Rao Garu, The Pasupati seal is dated around 5000 years old. Dates Of The Sarasvati Sindhu (INDUS) Civilization (CA. 3100 - 1400 B.C.). Source: http://www.hindunet.org/hindu_history/sarasvati/html/civilizationdates.htm

    ReplyDelete
  3. very good analysis.

    Deepika
    http://deepika-neerajanam.blogspot.in/

    ReplyDelete
  4. Replies
    1. అవును దుర్గేశ్వర గారు! వారి బుర్రలు శూన్యం! అందుకే విగ్రహారాదన లో ఉన్న పరమార్ధం ఎరుగక ఏవో రాస్తున్నారు. వారిని వారి దేముడే క్షమించుగాక!

      Delete
  5. Please check this
    http://www.sakshyammagazine.com/2016/02/small-brain.html
    He became silent after my stroke:-)

    ReplyDelete
    Replies
    1. మంచి పని చేసారు హరిబాబు గారు!పనికట్టుకుని పదే పదే విగ్రహారాధనను వ్యతిరేకించడమే కాకుండా, విగ్రహారాధకులను అవమానిస్తున్న వ్యక్తికి సరి అయిన విదంగా బుద్ది చెప్పారు. ఇందుకోసమ్ మీరు చేసిన క్రుషికి ప్రత్యేక దన్యవాదాలు తెల్పుతున్నాను.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!