పవన్ కళ్యాణ్ గారు అన్నది, పక్కాగా నిజం అనిపిస్తుంది !!

                                                                 


                                                       
                                            పవన్ కళ్యాణ్ ! సిని హీరో ! జనసేన అధినేత! లక్షలాది అభిమానుల అరాద్యుడు కాబట్టి నేటి ప్రజాస్వామ్య వ్యవస్తకు పనికివచ్చేవాడె . కాకపోతే NTR లా దీటైన వాయిస్ లేకపోవడం తో పాటు , పదిమందిని చూసి సిగ్గుపడే మనస్తత్వం చిన్నప్పటనుండి కలిగిఉండడం చేతో , ఏమో కాని , మీడియా తో మాట్లాడేటప్పుడు సగం మాటలు మింగేస్తూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మాటలు మింగినా , తన మనసులో ఉన్నది మాత్రం దైర్యంగా, మొహమాటం లేకుండా  చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి  , అయన గారి ప్రెస్ మీట్ కు కూడా అంతో ఇంతో ప్రాదాన్యత ఇవ్వక తప్పదు. 

    మొన్న కాపు నాడు వారు నిర్వహించిన సభలో , టపాసులు లాంటి మాటలు తూటాలు పేల్చి , కుల ప్రజలను రెచ్చగొట్టగలిగే  ప్రసంగాలు చేయగలిగిన   కాపు సామాజిక నాయకులు  ఎవ్వరూ లేరు. కాని ఆశ్చర్య కరంగా ఒక్క సారిగా కాపులు అంతా రైల్ పట్టాల మీదకు వెళ్లి , అప్పుడె వస్తున్న "రత్నాచల్ ఎక్సప్రేస్ " ని ఆపుచేయడమే కాక సదరు రైలు మొత్తాన్ని తగుల పెట్టారు అంటె , అది మామూలు పని కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు "ఇటు వంటి విద్వంసకర మైన పనిని , ఎంతొ ప్రీ ప్లాన్డ్ గా ప్రొపెషనల్స్ మాత్రమె చేయగలరు " అని అన్నది. ఇది నిజం కావచ్చు. ఎందుకంటె 

      నిజంగా కాపు యువత లో రిజర్వేషన్ ల కోసం ప్రభుత్వం తో తాడో పేడో తేల్చుకోవాలన్న తత్వమే ఉంటె అది కేవలం "రత్నాచల్ దహనం " తో చల్లారదు. రావణ కాష్టం లా మండుతూనే ఉండెది. ఇంకా ఎన్నో ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతునే ఉండెవి. కాని వారి ఉప్పెన ఆవేశం తాటాకు మంటలా చల్లారి పోయింది అంటే , అది కేవలం పోలిస్ వారు  తీసుకున్న చర్యల మూలంగానే అంటె నమ్మడం కష్టమే . ఊరు అంతా కాలిపోయాక పైరింజన్లు  వచ్చినట్లు , జరగాల్సిన నష్టం జగిపోయాక , తెల్లారి ఎప్పటికో కాని రాపిడ్ ఆక్షన్ పోర్స్  రాలేదు. కాబట్టి తమకు అప్ప చెప్పిన అసైన్మెంట్ పూర్తి చేసేసి విద్వంసకులు నింపాదిగా వెళ్ళిపోతే , బిత్తరపోయిన ప్రబుత్వ వర్గాలు  తేరుకోవడానికి  ఒక రోజు పట్టింది. అసలు రైళ్ళు తగలబెట్టడం వలన ఎవరికీ లాభం?  ఇలాంటి ఆకస్మిక ద్వంస రచన వలన రిజర్వేషన్ లూ సిద్దిస్తాయి అని రాజకీయ జ్ఞానం ఉన్న ఏ నాయకుడు అనుకోడు . పైపెచ్చు ఇలాంటి పనులు వలన సమాజం లో కాపుల పట్ల వ్యతిరేకత ప్రబలె అవకాశం ఉంది. కాబట్టి సాంప్రదాయ ప్రజాస్వామ్యా పద్దతిలో డిమాండ్ లు సాదించే వారెవ్వరూ ఇలాంటి వాటిని ప్రొస్తాహించరు . మరి ఎవరి ప్రోత్సాహం తో ఈ  దహనాలు జరిగాయి? 

     భారత దేశం లో ఈ  మద్య "అసహన వాదం " ఎక్కువైంది. అలాగే ఆంద్ర ప్రదేశ్ లో కూడా "అసహన వాదం "
ఉంది . కాకపోతే ఇండియాలో ఉన్నది సాంప్రదాయ విదానాలను వ్యతిరేకించే  అసహనం అయితే , ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నది అధికారం కోసం అర్రులు చాచే అసహనం. రాజ్యాంగం లో , ఎన్నుకోబడిన ప్రభుత్వాల పదవీ కాలం 5 సంవత్సరాలు  కాక, 2 సంవత్సరాలు ఉంటె , పాపం "రత్నాచల్ ఎక్స్ప్రెస్ " కు మంటల్లో మాడి పోయే దురవస్ట  ఉండేది  కాదనుకుంటా . కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు నోటుకు కేసులో అధికార పక్షాన్ని ఇరికించినా , చివరకు ఇద్దరు ముక్యమంత్రులు కలిసిపోయి, కేసు అటక ఎక్కింది. పోన్బి ఎలాగో ఓపిక పడదాం అనుకునే వారికి , ఇంకా 3 యేండ్లు వేచి చూడాలి అంటే , అంత ఓపిక , సహనం ఉండెంత రాజకీయ పరిజ్ఞానం లేదాయే. మరి ఏమి చేయాలి. ? సింపుల్! సినిమాల్లో మాదిరి ఎవరో ఒకరిని ప్రేరేపించి విద్వంసాలు స్రుష్టించడమే. తద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని కులదొయడమె .  దానికి ఒక బలమైన వర్గం సపోర్ట్ అవసరం కాబట్టి , వారికి కాపు రిజర్వేషన్ అంశం మదిలో మెదిలి ఉంటుంది . అందుకే లక్షలాది ప్రజల సమీకరణ. కాపు ఉద్యమం మాటున రైలు, పోలిస్ వాహనాల దహనాలు జరిగి ఉండె అవకాశాలు ఎక్కువ. 
 

     అలాంటి అధికార అసహన వాదుల బ్యాక్ గ్రౌండ్ ను  దృష్టిలో పెట్టుకునే "పవన్ కల్యాణ్ " గారు పై విదంగా వ్యాక్యానించి ఉండవచ్చు. అంద్రా రాజకీయాలు , విద్వంసం జరిగిన తీరు గమనిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది పక్కాగా నిజం అనిపిస్తుంది. ఒక వేల అదే నిజం అయితే అంద్రా లో రాబోయే 3 సంవస్తరాలలో ఇంకెన్ని విద్వంసాలు జరుగుతాయో! 

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!