ప్రభుత్వ చీప్ లిక్కర్ పధకం ని వ్యతిరేకించటం వల్లనే , "కల్తీ కల్లు " బాగోతం బట్ట బయలు చేసారా ?!!!

                                                                             

                                     
                                                           రాజ్యం లో ఏ ఆర్గనైజ్డ్ నేరాలు జరుగుతున్నా దాని గురించి పూర్తీ సమాచారం , ప్రభుత్వాలకు, అందులో ఉన్న పెద్దలకు అధికారులకు క్షుణంగా తెలిసే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం లో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రబుత్వ పెద్దల అండదండలతో , తెలంగాణా ప్రాంతం లో "కల్లు లాబీలు " యదేచ్చగా  కల్లు డిపో లలో ప్రజల ప్రాణాలను క్రమ క్రమంగా హరించే ప్రాణాంతక మత్తు మందులను కలిపి , ప్రజలకు పోస్తుంటే , తెలిసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. ఇక పెద్దలే ఏమననప్పుడు , మనకేమిటి బాద అని సంబందిత అధికారులు తమ వాటా తాము తీసుకుంటూ పదేళ్ళు హాయిగా నిద్రపోయారు. మైదాన ప్రాంతాలలో కల్తీ కల్లు దందా పని ఈ  విదంగా ఉంటే, గిరిజన ప్రాంతాలలో "గుడుంబా " వ్యాపారం పని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది.  అసలు ఈ దంధా లకు ఎక్సైజ్ అధికారుల అక్రమ సంపాదనే పెట్టుబడిగా ఉందంటే , కాంగ్రెస్ పాలన ఎంత నీచ నికృష్టంగా,  జరిగిందో అర్దం చేసుకోవాలి. ఒక్కసారి తెలంగాణా లోని గిరిజన ప్రాంతాలలో నడుస్తున్న "గుడుంబా " వ్యాపారం  గురించి , దాని పర్యవసానాలు గురించి నిజాలు తెలుసుకుంటే , ప్రభుతం ప్రవేశ పెట్టాలి అనుకున్న "చీప్ లిక్కర్ " పదకాన్ని వద్దు అనే వారు కాదేమో !

                          ఇదేదో నేను ఉహించి రాస్తున్నది కాదు. ఉదాహరణగా మా స్వగ్రామమైన గార్లవొడ్డు పరిస్తితి గురించే చెపుతాను. మా గ్రామం ఖమ్మం జిల్లాల్లో ఒక చిన్న శివారు గ్రామం. గ్రామం లో సగం మంది గిరిజనులు అయితే మిగతావారు ఇతర సామాజిక వర్గాల వారు.మా ఊరు జిల్లా లో  పేరొందిన పుణ్యక్షేత్రం . ఊరికి ఒక వైపు మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహా స్వామీ కొలువు అయి ఉంటె , మరొక వైపు దెయ్యాలు కొలువు అయి ఉన్నాయి . ఆ దెయ్యాలకు గత ప్రభుత్వ అండ దండలు పుష్కలంగా ఉండటం వలన అవి చేసే "గుడుంబా దందా "కు అడ్డు అదుపూ లేకుండా పోయింది. దాని వలన చాలా మంది గిరిజనులు , ఇతరులు దానినే వృత్తిగా స్వీకరించి , ఊరు ని ఒక "గుడుంబా ఇండస్త్రీ" గా మార్చివేసారు.  పర్యవసానం ? ఊల్లో యువకులు 80% దానికి బానిసలై పోయరు. పాతికేళ్ళు రాక ముందే ఒక్కొక్కడు పిట్టల్లా రాలిపోవటం మొదలయింది . అనేక మంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. గ్రామ అరోగ్య పరిస్తితీ హీనంగా తయారు అయింది. అసలు మా గుళ్ళొ పని చేసే " పూజారి " ఒకరు ఐ వ్యసనానికి బానిస అయి మరణించాడు అంటె పరిస్తితి ఎంత దారుణంగా తయారు అయిందో ఉహీంచు కోండి. మరి దశాబ్దల  కాలం పాటు " గ్రామం ఇలా "గుడుంబా క్షేత్రం " గా వర్దిల్లుతుంటె మీడియా కాని, పత్రికలూ కాని, ప్రభుత్వ అధికారులు కాని పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం ప్రభుత్వం లోని పెద్దల అండ దండలు "గుడుంబా దెయ్యాలకు " ఉండటమే. 


     ఊరిలో ఉన్న దెయ్యాల నాయకుడిని ఎదిరించే దమ్ము మండలం లో ఏ మగాడికి లేదు. కారణం సాక్షాత్తు జిల్లా మంత్రి తరచూ అయన ఇంటికి వస్తు పోతుండడం వలన అధికారులు కుక్కిన పేనుల్ల పడి ఉండె వారు. మండలంలో దెయ్యాల నాయకుడు చెప్పిందే జరగాలి. అన్ని దందా లకు మల్లేనే "గుడుంబా దందా " వలన వచ్చే లాబాలలో వాటా కూడా సదరు మంత్రి గారికి ముట్టేది అట.మరి అటువంటి పరిస్తుతుల్లో "గుడుంబా " గురించి రాయడమంటే మంత్రి గారికి వ్యతిరేకంగా రాయడమే . అంత దమ్మున్న జర్నలిస్ట్ లు ఎవరూ ఆ మండలం లో లేరు. ఒక వేల రాసినా తట్టుకునే పరిస్తితి లేదు. అందుకే అందరు గప్  చుప్ . అలా 10 యేండ్ల పాటు సాగిన అరాచక పాలనలో గుడుంబా దెయ్యాలు లక్షలు, కోట్లు ఆర్జిస్తే , గ్రామం లోని యువత చనిపోయిన వారు చని పోగా మిగతా వారు నీరు గారి పోయి, చేవ చచ్చి ,జీవచ్చ్వం లా బ్రతుకుతున్నారు. అయ్యా అదీ మా ఊరి పరిస్తితి ! ఇదే పరిస్తితి తెలంగాణా లోని చాలా గిరిజన  గ్రామాల్లో ఇదే పరిస్తితి  ఉండవచ్చు. గిరిజన అభ్యదయం కోసం తెగ కష్టపడి పోయాం అని గప్పాలు కొట్టుకునే కాంగ్రెస్ వారి ఘనమైన ఏలుబడి తీరిది.

                                                                       


                                                                  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక , తోలి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కలువ కుంట్ల చంద్ర శేఖర్ రావు గార్కి ప్రజల పట్ల ఉన్న సేవా నిరతి బావం ఎన లేనిది. అయన గారి సంవత్సర పాలనా కాలం లో అయన ద్రుషికి వచ్చిన అనేక అంశాల్లో "కల్తీ మద్యం " ఒకటి. దానిని ఎలాగైనా సరే నిరోదించాలని అయన తపన. దాని వలన ప్రజల ఆత్మ హత్యలు తగ్గటమే కాక , ఆరోగ్యాలు బాగుపడి , దాని ప్రబావం వలన సామాజిక అభివృద్ధి  ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అసలు రాష్ట్రం లో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలకు  కారణం కల్తీ కళ్ళు, గుడుంబాలు కూడా . మరి ఒక సారిగా వీటిని నిషేదించాలి అనుకోవడం ఆచరణ కు పనికి రానిది. ఎన్నో ఏండ్లుగా ప్రజలకు  అలవాటు అయిన కల్తీ కల్లును ఒక్క సారిగా నిరోదించి, అసలు కల్లు ని సరపరా చేస్తే , జనాల పరిస్తితి ఎలా ఉందో గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్తితి గుడుంబా త్రాగే వారిలోను ఉంటుంది. అందుకే K.C.R గారు ఇవ్వన్నీ ఆలోచించే, ప్రజలకు ప్రత్యామ్నాయంగా  , ముందు చూపుతో "చీప్ లిక్కర్ " పదకాన్ని ప్రవేశ పెట్టి క్రమంగా గుడుంబా నుండి, కల్తీ కల్లు నుండి  విముక్తులను చేయాలని , ఆ తర్వాత క్రమంగా వారి జీవన పరిస్తితులను మెరుగు పరుస్తు , వారిని  త్రాగు డు వ్యసనాన్నికి దూరం చేయవచ్చు అని అలోచించి ఉంటారు. కాని దీని ప్రతి పక్షాలు ముక్యంగా కాంగ్రెస్ , కమునిస్ట్ పార్టీలు వ్యతిరేకించడం వెనుక వారి స్వలాబాలు తప్పా , ప్రజా సంక్షేమం మీద వారికి ఏ మాత్రం శ్రద్ద లేదు అని యిట్టె అర్దమవుతుంది.


         ఒక్క సారిగా కల్తీ కల్లును ఇవ్వడం ఆపు చేసాక ,జనాలు ఉన్మాడులై  బాదితులు హాస్పిటల్లో చేరితే, అక్కడ వైద్యులు వారికి చేస్తున్న ట్రీట్ మెంట్ ఏమిటి? మల్లీ అంతే డోసు తో మత్తు మందులు ఇచ్చి పడుకోబెడుతున్నారు. అలా క్రమేపి డోసు తగ్గించుకుంటూ వారిని పూర్వ స్తితికి తేవడానికి కొంత కాలం పడుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా త్రాగుడికి బానిసలైన వారికీ వైద్యం చేయాలంటే , మన దగ్గర తగిన వైద్యులు, వైద్య శాలలు ఉన్నాయా?  లేవు కాబట్టే ప్రజలకు గుడుంబా , కల్తీ కల్లు కంటె ఎన్నో రేటులో నయమైన మద్యం ని తక్కువ ధరకి ప్రత్యమ్నాయంగా అందించాలని KCR గారు ఆలోచించడం నూటికి నూరు పాళ్ళు కరెక్టు. ప్రజలకు దశాబ్దాలుగా కల్తీ మద్యం పట్టిస్తుంటె పట్టించుకోని   నాటి అధికార ప్రతి పక్షాలకు , తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకున్న చీప్ లిక్కర్ పదకాన్ని విమర్శించే నైతిక అర్హత ఉంద? ఆత్మ పరిసీలన చేసుకోవాలి . ప్రతిపక్షం అంటే కేవలం గుడ్డ్ఫిగా ప్రబుత్వ పధకాలను వ్యతిరేకించడం  కాదు , ఆచరణాత్మక విదానాలు గురించి కూడా సలహాలు ఇచ్చే స్తాయిలో ఉండాలి. అది ఈ దేశం లోని ప్రతి పక్షాలకు లేక పోవడం మన దౌర్బాగ్యం.

     రాజకీయాలు సంగతి ఎలా ఉన్నా , ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న  కల్తీ కల్లును , గుడుంబాను నిరోదించవలసిందే . అందుకు ప్రత్యామ్నాయ విదానాలు అమలు చేయాల్సిందే . కాని ఇప్పటి దాక కల్తీ వ్యాపారాలతో బలిసిన వారు , ప్రభుత్వ పనులను కోన సాగనీయరు. వారి వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకత గా చూపించగల సమర్ధులు వారు. అందుకే ప్రబుత్వ పడకం అయిన చీప్ లిక్కర్ పదకం ని వాయిదా వేసారు. ప్రజల కళ్ళు తెరిపించడానికే , కళ్ళు దుకాణాలు మీద దాడి చేసి కల్లు  లో కల్తీ జరుగకుండా చేసే సరికి , అసలు కల్లు  తాగిన జనాలు పిచ్చివాళ్ళు గా మారడం , వారి అసలు పరిస్తితిని గమనించిన ప్రజలు , ఇన్నాళ్ళు కల్తీ దందా చేసిన అరాచకం వారి కళ్ళకు కట్టినట్లయింది. చీప్ లిక్కర్ ప్రవేశ పెట్ట కుండా కల్తీ మద్యం ఆపితే ప్రజల పరిస్తితి ఎలా ఉంటుందో ప్రబుత్వం చెప్పకనే చేసి చూపెడుతుంది. ఇప్పుడు ప్రజలు ముందు ఉన్నప్రత్య్మ్నాయాలు రెండే రెండు. ఒకటి తాగుడుకు బానిసలు అయిన వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి క్రమంగా మత్తు నుండి దూరం అయేలా వైద్య సేవలు అందించడం , రెండవది సురక్షిత  చీప్ లిక్కర్ ని ప్రవేశ పెట్టి , కౌన్సెలింగ్ ల ద్వారా వారి ఆలోచనలలో మార్పు వచ్చే చేస్తూ , వారి జీవన స్తితి గతులను మెరుగు పర్చడం ఇందులో మొదటిది ఆదర్శవమ్తమైనది. రెండవది ప్రస్తుత పరిస్తుతులకు ఆచరణ యోగ్య మైనది. మరి ఏది చెయ్యాలో ప్రబుత్వానికి మేదావులు సూచన చేయాల్సిన బాద్యత , అవసరం ఉంది.

   కల్తీ కల్లు, గుడుంబా ల మీద ఉక్కు పాదం మోపి వాటిని అరి కట్టాల్సిన తక్షణ బాద్యత ప్రబుత్వం మీద ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న తెలంగాణా ప్రబుత్వ రధ సారధి KCR గారికి దన్యవాదములు. 
  

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )