రమణమ్మ కుమారుడు కుక్కల దాడిలో చనిపోవడానికి , అక్కినేని అమల గారికి ఏమిటి సంబందం !?.

                                                                       



                                                   ఫేస్ బుక్ లో లైక్ ల కోసం , షేర్ ల కోసం కొంత మంది యువత పడే తాపత్రయం చూస్తుంటె , ఒకవేళ ఫేస్ బుక్ కనుక మూతబడితే పరిస్తితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచిస్తుంటే బయం వేస్తుంది. ముక్యంగా యువత చాలా మంది , "కల్తీ కల్లు " దొరకని వారి లాగా ఉన్మాదానికి గురి అవుతారేమో అని పిస్తుంది. అసలు ఫేస్ బుక్ షేర్ ల వల న ఏమైనా ఆర్దిక లాబం ఉందా? ఫేస్ బుక్ షేర్ లు ఏమైనా వ్యాపార  కంపెనీల షేర్ లు లాంటివా? ఎన్ని ఎక్కువ షేర్ లు పొందినా ఆర్దిక పరంగా కాని, అవార్డుల పరంగా కాని ఏమి ఉపయోగం లేనప్పుడు వాటి కోసం అంత తహ తహ ఎందుకు? వాటి కోసం  పోస్టులను ను షేర్ చెయ్యండి అని మరి వీక్షకులను అడగడం ఎందుకు?  అసలు వీరు అడిగే విదానం చూస్తుంటే నవ్వు వస్తుంది.

        ఉదాహరణకు , కొంతమంది  అమ్మ గోప్పతనం గురించి రెండు మాటలు తో కూడిన "అమ్మ" పొటో ఒకటి పెట్టి, అమ్మ అంటే ప్రేమ ఉన్న వారు షేర్ చెయ్యండి అంటారు. మరి అలా చేయని వారికి అమ్మ మీద ప్రేమ లేదని అర్ధమా? అలగే నాన్న గురించి , స్త్రీ ఔన్నత్యం గురించి, దేవుళ్ళు గురించి  బొమ్మ్మలు పెట్టి , షేర్ లు చేయాలి అంటారు. ఇది ఒక రకంగా ఎమోషనల్ లేక సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ అవుతుందేమో ఆలోచించండి. 

                               మొన్న ఒకరు ఒక పోటో పెట్టారు.పై చిత్రం అదే .  అందులో ఈ మద్య పిచ్చి కుక్కల దాడిలో చని పోయిన ఒక రెండేళ్ళ బాలుడి తల్లి శోకానికి , బ్లూ క్రాస్ సొసైటి నిర్వాహకురాలు అక్కినేని అమల గారి ఆడంబర జీవితానికి లంకె పెట్టి ప్రస్నించడమే కాక, ఆ పోటో లో సందేశం అమల గారికి చేరే దాక "షేర్ " లు చేస్తూనే ఉండాలని కోరారు. మర ఎన్ని వందల లేక వేల షేర్ లు చేస్తే అమలగారికి ఆ ప్రశ్న  చేరుతుంది? ఒక వేళ  చేరినా పలితం ఏమిటి? ఎక్కడో విశాక పట్నం లో తల్లి తండ్రుల నిర్లక్ష్యం, కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి బలి అయి పోయిన బాలుడికి , హైదరాబాద్ లో జంతువులను సంరక్షించే  సంస్థను నడుపుతున్న అమల గారికి ఏమిటి సంబందం? బాలుడి మృతికి ఆమె ఎలా బాద్యురాలు? జనాలకు తెలియక పోయినా పర్వాలేదు. కనీసం ప్రశ్నించే వారికైనా క్లారితీ ఉందా? వివరాలు లోకి వెలితే 

                           రెండేళ్ళ శివ కేశవ్, రమణమ్మ దంపతుల కొడుకు . రమణమ్మ భర్త విశాఖ లోని ఒక అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. వాచ్ మెన్ గా అతని డ్యుటిల్లొ , అపార్ట్ మెంట్ లోకి వీది కుక్కలను రాకుండా చూడడం కూడా ఒకటి అయి ఉందాలి. ఆతను వీది కుక్కలను అపార్ట్మెంట్ లోకి రాకుండా చూడగలిగాడు కాని, తన కొడుకు వీదుల్లోకి పోకుండా మాత్రం చూడలేక పోయాడు. అందుకే తెరచిన అపార్త్మెంట్ గేటు లో నుండి పిల్ల వాడు బయటకు వెళ్లి ఆడుకుంటూ , వీది కుక్కల కలల్లో పడ్డాడు. అంతే ! అవి ఒక్క సారిగా ఆ పిల్లవాడు మీద దడి చేసి 200 వందల కాట్లు పెట్టాయి అంటే ఆ బిడ్డ ఎంతగా విల విలవిల లాడాడో  అర్దం చేసుకోవచ్చు. చివరకు పిల్లవాడి పేగులు బయటకు వచ్చి, హాస్పిటల్ కు తీసుకు వెళ్ళె మార్గం లోనే మరణించాడు . నిజంగా ఇది హృదయాన్ని ద్రవింబచేసే ఉదంతం. కాని ఈ ఉదంతం లో అసలు దోషులు ఎవరు? 

          అయితే , పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోకుండా వీదుల్లోకి వదిలేసిన తల్లి తండ్రులది కావాలి లేదా విచ్చలవీడిగా రెచ్చి పోయి వీదుల్లో తిరుగుతున్న వీది కుక్కలను కట్టడి చేయలేని కార్పోరేషన్ అధికారులది కావాలి . అంతే కాని జంతువులను సంరక్షించే అమల గారిదే లా అవుతుంది? ఇందులో విలన్ లు కుక్కలు కాబట్టి , వాటిని చేర దీసి సంరక్షించే అమల గారి మీద అక్కసు తీర్చుకుంటాం అంటె ఎలా? ". ఇది ఎలా ఉందంటె "ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఉంది. షేర్ లు, లైక్ లు కావాలంటే  వైవిద్యం వున్న పోస్టులు పెట్టాలి , పై కేసులో విశాఖ కార్పోరేషన్ అధికారుల బాద్యతా రాహిత్యాన్ని ప్రశ్నిస్తూ పోస్టు పెడితే కనీసం కొంత మంది అయినా లైక్ చేసే వారే . కాని ఇలా పొంతన లేని లాజిక్ తో , ప్రశ్నలు  సందిస్తే ఎవరు లైక్ చేస్తారు? 

     లైక్ లు షేర్ ల కోసం ఫేస్ బుక్ ను "పిచ్చి బుక్ " గా మార్చకండి. 

   


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన