8 వ తరగతి చదివినవాడు హాస్పిటల్లో వైద్యం చేస్తుంటే, వైద్య ఆరోగ్య శాఖ గాడుదులు కాస్తుందట!
ఆ కమ్మ్యునిటి ఆరోగ్య కేంద్రం లో ప్రిస్క్రిప్షన్ లు రాస్తూ, ఇంజెక్షన్ లు చేస్తూ , ప్రజలకు వైద్యం చేస్తున్న డాక్టర్ , నిజానికి దాక్టర్ కాదు అంట. ప్రజలంతా ఇన్నాళ్ళు తమకు వైద్యం చేస్తున్న వ్యక్తీ అసలు సిసలు అయిన డాక్టరు అన్ని నమ్మడం వైద్య ఆరోగ్య శాఖ మీద వారికున్న నమ్మక్కం. ఇంతకీ అతగాడు ఎవరయ్యా అంటే 8 వ తరగతి చదుకుని, ఆ హాస్పిటల్లో నే పని చేసే క్లాస్ iv ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగం కూడా అతనికి , అతని తరపు వారు ఎవరో చనిపోతే , కారుణ్య నియామకాల పద్దతిలో వచ్చిందట. ఆ హస్పిటలికి ఎలాట్ అయిన దాక్టర్ ఎక్కడుంతాడో , ఎలా ఉంటాడో , వైద్యం కోసం వచ్చే వారికి తెలియదు. దానితో ఇతడే డాక్టర్ అవతారం ఎత్తి ప్రిస్క్రిప్షన్ లు రాస్తూ వైద్యం చేస్తుంటే , అక్కడి మందుల కొట్టు సూపర్ వైసర్ అతడికి ఇంజెక్షన్ లు చేయడం ఎలాగో నేర్పాడు అట. అదిగో అలా ఇంజెక్షన్ లు చేయడం మొదలు పెట్టిన వారం రోజులకు ఆస్పత్రి మీద ఇన్స్పెక్షన్ జరగడం ఇతడు పట్టు బడడం జరిగాయి. అతడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే సరికి , అప్పటి దాక అతని తో వైద్యం చేయించుకున వారు తెల్ల బోయారు అట. అదీ కద! దీని బట్టి ఉత్తరప్రదేస్ పాలనా నిర్వాకం ఎలా ఉందో తెలుస్తుంది అంటున్నారు అక్కడి ప్రతి పక్షం వారు.
ఎవరి పని వారు చేయకుండ , అనర్హులకు పని అప్ప చెప్పి బలాదూర్ తిరిగే వారిని " ఏమిరా పని పాతరేసి గాడుడులు కాయటానికి పోయావా"? అని మన పెద్దలు తిడుతుంటారు. మరి 8 తరగతి చదివిన వాడు దాక్టర్ పని చేస్తుంటే , ఉత్తరప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదే పని చేస్తున్నారని అనుకోవచ్చా?
Comments
Post a Comment