విజయవాడలో ఉంది ,సిద్దార్థ డెంటల్ కాలేజా ? మెంటలోళ్ళ కాలేజా ?!!!

                                                                     

                               
                            కొంతమంది పెద్దమనుషులు ఉంటారు.  పెద్దమనుషులు కదా , తమకేమన్నా న్యాయం చేస్తారేమో అని  సమస్యలు చెప్పుకుంటే చెవినెక్కించుకోరు . తీరా బాదితులు ఏదైనా పొలిసు కేసులు పెట్టి నేరస్తుల మీద చర్యలు తీసుకుంటే మాత్రం , అప్పుడు  తప్పును తప్పు అని ఖండించగల కలేజా లేని పెద్దమనిషి తనం వీరిలో వళ్ళు విరచుకుని బయటపడుతుంది. " నీవు అనవసరంగా కేసు పెట్టి మన పరువు ప్రతిష్టలు మంట కలిపావు. మాకు చెపితే చిటికెలో నీకు న్యాయం చేసే వాళ్ళం కదా " అని లేని దీరత్వాన్ని  ప్రదర్శిస్తూ, తప్పంతా బాదితులదే అని అన్నట్లు, నేరస్తులకు ఊతమిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మంచి చెడు గురించి చెప్పలేని ఇటువంటి పెద్దమనుషుల వలన సమాజానికి ఏ మాత్రం ఉపయోగం లేక పోగా , మరింత కీడు మాత్రం జరిగే అవకాశం ఉంది అని తెలిపే ఉదంతం ఇటివల విజయవాడలో ఉన్న సిదార్ద డెంటల్ కాలేజిలో జరిగిందట. అదేమిటో క్రింది చిత్రం లో ఉన్న సమాచారం చదివి తెలుసుకోవచ్చు
           

                                                              


                     ఆ అమ్మాయి డెంటల్ కాలేజి విద్యార్దిని. ఆమెను వేదిస్తున్న వాడు కూడా విద్యార్దే . కాకపోతే అతనికి చదువు మీద కంటె సన్నాసి పనులు మీదే ఎక్కువ ఇంట్రస్ట్ అని అతను విద్యార్దినుల హాస్టల్లో జొరబడి గొడవ చేసిన తీరు మరియు    మొదటి సంవత్సరం లో పెయిల్ అయిన విదానమే చెపుతుంది. మరి ఇంతగా ఇతడు బాదితురాలిని ఎందుకు వేదిస్తున్నడు అంటే ఇతని మీద పిర్యాదు చేసినా , క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్మున్న వాళ్ళు ఎవరూ ఆ కాలేజిలో లేకపోవడమే కావచ్చు. కారణం అతగాడు ఆ కాలేజి పాలక వర్గ సబ్యుడికి దగ్గరవాడు కావటమే అని తెలుస్తుంది. అందుకే అతడిలో  మృగత్వం పరాకాష్టకు  చేరి , చివరకు  రాత్రుళ్ళు అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ కి  గదికి వెళితే అమాయి ఊరుకుంటుందా ? కేసు పెట్టి అతడిని జైలులో తోయించింది. దానితో కాలేజీలోని కలేజా లేని ఆచార్యులు అంతా , పాలక వర్గ సభ్యుడి మెప్పు కోసం అమ్మాయిని నానా మాటలు అనటం మొదలు పెట్టారట. "కాలేజి పరువు తీసావు కదా " అని వాపోతున్నారట. అమ్మాయిలను వేదిస్తున్నపుడు పోని కాలేజి పరువు , బాదితులు కేసులు పెడితే పోతుందా? ఒక వేళ పోతే గీతే , మొరపెట్టుకున్న విద్యార్దినికి న్యాయం చేయని పాలక వర్గ సబ్యులు ఉన్నందుకు పోవాలి, నేరస్తుడైన విద్యార్ది చర్యలను బాహాటంగా ఖండించ లేక , నీతి మాలి అతగాడి చర్యలను, కాలేజి పరువు పేరుతో సమర్దిస్తున్న ఆచార్యులు ఉన్నందుకు పోవాలి. అంటే కాని లేట్ గా అయినా సరే డేర్ గా నిందితుడి మీద కేసు పెట్టిన ఆ అమ్మాయిని అందరూ అభినందించవలసిందే . 

       నిందితుడు  ఏ తప్పు చేయలేదని కితాబివ్వడమే కాక , ఆతను బయటకు వచ్చాక మల్లీ    కాలేజిలో చేర్చుకుంటాం అని పాలకవర్గ సబ్యుడు ప్రకటించటం  అతనికి నిందితుడికి మద్య ఉన్న సన్నిహిత సంబందాన్ని తెలియ చేస్తుంది. ఆదారాలు ఉంటే వెంటనే ఆ పాలక వర్గ స్బ్యుడిని కూడా తొలగించి , అతనిని  కూడా ప్రాసిక్యుషన్ చేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తన కుటుంబం ఉంటున్న హైదరాబాద్ దగ్గర్లో ఉంటున్న కాలేజిక్ మారాలి అని అనుకుంతుందంటె  అది విజయవాడలో ఉన్న విద్యార్ది సంఘాలకు   సవాల్. ప్రాంతం ఏదైనా విద్యార్దులు అందరూ ఒకటే . మొన్న నాగార్జున రిషితేస్వరి కేసులో కాలేజి ప్రిన్సిపాల్  నిందితుల పట్ల చూపిన ఉదాసీనత ఒక విద్యార్దిని  చావుకు కారణ మైతే , ఇక్కడ సిదార్ద లో పాలకవర్గ సబ్యుడి ప్రవర్తన, ఆచార్యుల అ సమర్ధత వలన ఒక విద్యార్దిని వేదింపులకు గురి అయి ఊరు వదలి  వెళ్ళాల్సిన పరిస్తితి. కాబట్టి కాలేజీలలో జరుగుతున్న తప్పులకు పిల్లల ప్రవర్తన కంటె పెద్దల ఉదాసీనతే ఎక్కువ బాద్యత అని చెప్పక తప్పదు. 

                                       సిదార్ద డెంటల్ కాలేజి పెద్దల ప్రవర్తన  గమనిస్తే  అది డెంటల్ కాలేజా లేక మెంటల్ వాళ్ళు ఉన్న  కాలేజా అని అనుమానం రాక మానదు. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!