మీకు ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"
సాదారణ(బాహ్య ద్రుష్టి) వేరు జ్ణాన ద్రుష్టి వేరు.అలాగే సాదారణ ప్రజలు వేరు, జ్ణానులు వేరు.జ్ణానులు సాదార్ణంగా ఐహిక సుఖాల మీద అంత ఆసక్తి కలిగి ఉండరు. సామాజిక బాద్యతలలో కూడా ఏది ఎంత వరకు అవసరమో అంత వరకే చేస్తారు. ఇతర సాదారణ ప్రజలు వలే ఆరాట పడరు. కారణం వారికున్న జ్ణాన ద్రుష్టి.మరి ప్రజలందరికి ఇటువంటి జ్ణాన ద్రుష్టి అవసరమా? అలా ఉంటే ఈ సమాజం నిరిప్తత,నిస్తేజమయి పోతుంది. అందుకే గీతాచార్యుడు అంటాడు"వేల కొలది జనులలో,ఏ ఒక్కడో జ్ణాన శక్తి కొరకు ప్రయత్నించును,అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థం గా తెలుసుకో గలుగుతున్నాడు.". ఈ కారణం చేతనే మనకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి.
మనిషి పునరుత్పత్తి,ఆనంద జీవనానికి కామ ద్రుష్టి తప్పని సరి.సెక్స్ పార్ట్నర్ల మీద మోహం కలగడానికి బాహ్య ద్రుష్టి ప్రేరేపణ గా ఉంటుంది. అదే ’జ్ణాన ద్రుష్టితో’ చూస్తే జన్మలో దాని పేరెత్తరు.అంతా "ఎక్స్-రే’ తీసినట్టుగా ఉంటుంది. కాబట్టి మన కోసం జ్ణానులు ఎలాగు పాటు పడతారు.అందరికి "జ్నాన ద్రుష్టి"అనవసరం అనే నా అభ్ప్రాయం. మనకు ఆచరణీయమైనది "ఆశ్రమ జీవన విదానం".అంటే" ఏ వయసులో ఆ ముచ్చట" తో కూడిన క్రమబద్దమయిన జీవన విదానం
దాని గురించి తర్వాతి టపాలలో తెలియచెపుతాను.
మరింత సమాచారం కొరకు క్లిక్ చెయ్యండీ
మా బ్లాగుకు మీ రాక మాకానందం.మీరు కోరినట్ట్లు చెయ్యడమైనది.
ReplyDelete