"నాది నాకిస్తే" చాలు!నీకూ, నాకూ పంచాయతే లేదు.
4 దశాబ్దాల నాటి రాజకీయాలకు, ఇప్పట్టి రాజకీయాలకు బోల్డంత తేడా ఉంది.ఆ నాడు అదికార పక్షం వారికి ప్రతిపక్షం వారు సింహ స్వప్నం గా ఉండే వారు.అన్ని పార్టీలలో కూడా ఒక నిబద్దత ఉండెది.ఎవరైనా అవినీతికి పాల్పడాలంటె కొంచం బెరుకుగా ఉండెది.ఇతర పార్టీల వారి నిఘా ఉంటుందన్న భయం,పట్టుబడితే అవమానాల పాలు కావాల్శి వస్తుందన్న బావన వారిని చాల వరకు నియంత్రణ లో ఉండేటట్టు చేసేది.
కాలం మారింది. ఇప్పుడు కూడ అదికార పక్షం అవినీతి మీద, అన్ని పక్షాల వారి నిఘా వెనుకటి కంటే ఇప్పుడే ఎక్కువ. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడేమో ప్రజా దనాన్ని కాపాడాలన్న కాంక్ష, ఇప్పుడేమో ఆ అవినీతిలో తమ వాటా ఎంత రావాలో లెక్కలు కట్టడానికి పడే తహ !తహ!. నిజం! ఇప్పుడు రాజకీయ పార్టిలు, మీడీయాలలో,పత్రికా ముఖంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నాయి తప్ప, గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి నాయకుల వరకు, అవినీతి విషయమ్ లో ఎంత అన్యోన్యత!ఎంత సహకారం!చూడ ముచ్చట్ట వేస్తుంది వీరి రహస్య అవినీతి ప్రేమను చూస్తుంటే.
ప్రజల తరపున పోరాడి, పోరాడి పాపం అందరు అలసి పోయారు.పోరాడితే వచ్చేది ఏమి లేదు,చేతికి చిప్ప తప్పా, అని గ్రహించేసి అందరు ఒక అండర్స్టాండిన్గ్ కి వచ్చినట్టుంది. అదేమిటంటె ఎన్నిక్కలప్పుడే కయ్యం,మిగతాదంతా అవినీతి నెయ్యం,అనుకుని ఆ విదంగా "రంకు రాజకీయాలకు" అలవాటు పడి తెగ దోచేస్తున్నారు.
ఏతా వాతా చెప్పేది ఏమిటంతే "నీ పార్టీ,నా పార్టీ అని కాదు,అన్ని పార్టీలది ఒకటే సిద్దాంతం ఎవరి పర్సెంటేజ్ ల ప్రకారం వారు దోచు కోవడం’.అసలు ఇవి రాజకీయ పక్షాలు అనడం కంటే చిన్నా, పెద్దా దొంగల ముటాలు అనడం సబబు. మీకు వారితో పని పడితే వారికిచ్చేది వారికిచ్చి మీకు కావాల్సింది మీరు తీసుకోండి.లేదంటే ఆ ముటాలో సబ్యుడుగా చేరితే మీకు వాటా దక్కొచ్చు.
నోట్: ఇంకా అన్ని పార్టీలలో నీతి మంతులు అక్కడక్కడా ఉన్నారు.కాని పాపం తమ వాళ్లని ఏమి అనలేని వీరి నిస్సహయతను గమనించి, ఎదుటి పార్టీలలోని వారిని విమర్శించడానికి వీరిని పార్టీ పెద్దలు వినియోగించుకుంటుటారు.
Comments
Post a Comment