ఆమే ఒక నిజాయతి గల అధికారిణి. పేరు క్రిష్ణవేణి. వయస్సు 29. అసిస్టెంట్ కమీషనర్ గా హోదా గల ఆమే గుంటూరు నగరంలోని మూడు దేవాలయాలకు కార్య నిర్వహణాదికారిగా పనిచెసేది.సదరు దేవాలాయాల్లో రాజకీయ పక్షానికి చెందిన ధర్మ కర్తలు,వారి కనుసన్నలలో నడిచే ఉద్యోగ గణాలు బాగా అవి నీతికి పాల్పడుతూ దేవాలయాల సొమ్మును దిగమ్రింగేవారు. పాపం క్రిష్ణవేణి గారు వచ్చాక వీరి ఆటలు సాగక, ఆమేను డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసారు.కాని ఆమే లొంగలేదు. నిజాయతీగా వ్యవహరించి సుమారు ఇరవై లక్షలు దాక దేవాలయాల సొమ్ము కాపాడగలిగింది.అంతే! ఆమే మీద సదరు రాజకీయ ధర్మకర్తలు,అవినీతి అధికారుల ఒత్తిడి పెరిగింది.ఆమేను నానా విదాలా హింసించారు అని,అనేక రకాలుగా బెదిరించారు అని ఆమే రాసిన డైరీ ద్వారా తెలిసింది. చివరకు ఆమే మీదా యస్.సి.యస్.టి యాక్ట్ క్రింద కేస్ బనాయిస్తామని బెదిరించే సరికి పాపం ఆ సంఘర్షనను తట్టుకోలేక హైదరాబాద్ తన ఇంటికి వెళ్ళి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.త్వరలో జడ్జి గా వెళ్దామనుకున్న ఒక నిజాయతి అదికారిణి ఆశలు తానే ఆసువులు బాసింది.
ఇదంతా పది రోజుల క్రితం జరిగిన సంఘటన.ఈ అవినీతి రాజకీయాలు హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటె హిందువులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం బావ్యం కాదు.భక్తి అంటే కేవలం గుడికి వెళ్లి పూజలు చేయటమే కాదు.ఆ గుడి ఆస్తులను అన్యాక్రాంతం చేసే వారి భరతం పట్టడం కూడ భక్తిని ప్రదర్శించడమే అవుతుంది.దీనంతకి కారణమయిన రాజకీయ నాయకుల పెత్తనం దేవాలయాలలో ఏ రూపంలో ఉన్నా నిరోదించేలా, అవసరమైన చర్యలు తీసుకోవాలని, హిందూ మేదావులు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి.
జై హిందూ! జై జై హిందూ!
Comments
Post a Comment