అమ్మయ్యా! "3000లక్షలు" పోయిన "లా" ని కాపాడాం!,
అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం యెంత ఇచ్చారో ప్రభుత్వం వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని మనం ప్రపంచం ద్రుష్టిలో "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం" కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!
కసబ్ కి ఏమాత్రం పశ్చాతాపం ఉన్నట్టు కనిపించలేదు .ఈతతంగమంతా చూసి వాడికి నవ్వు వచ్చింది.కోర్ట్లో నవ్వాడు కూడా! అసలు వాడికి ఒకదశలో తనని క్షమించి వదలి పెదతారని ఆశ కూడా కలిగినట్ట్లుంది.కాని మనం మరీ "అంత" కాదులే అని నిరూపించాం.మొత్తానికి "కసబాసురిడిని" "ఊరించి,ఊరించి, ఉరి తీసిన మన సర్కార్ వారికి అభినందనలతో......
Comments
Post a Comment