ఈ దేశంలో దేవుడు,సైతాన్ లే హీరో,విలన్లు.ప్రజలెప్పుడూ ప్రేక్షకులే!
మనం పాత సినిమాలు చూస్తే,అందులో మౌలికంగా కథ ఒకే పద్దతిలో ఉంటుంది.సినీమా మొదట్నుంచి విలన్ దే పై చెయిగా ఉంటుంది.అన్ని తప్పుడు పనులు చేసే విలన్ చాల రిచ్ గా ఉంటాడు.హీరో బాగ కష్ట పడి విలన్ అవినీతి పనుల్ని ఎండ గడుతూ,చాలా బాదలు పడుతుంటాదు. ప్రజలకు పట్టని వారి సమస్యలను(పాపం వారికి విలన్ అంటే భయం కాబట్టి)తనే నెట్టి మీద వేసుకుని తెగ ఇబ్బందులు పడుతుంటాదు. అన్నిటి కంటె విచిత్రమైన సీన్ ఏమిటంటే, అవినీతి పరుడైన విలన్ గాంగ్ ని హీరో ఒక్కడే పబ్లిక్ గా ఎదుర్కొని ఫైట్ చేస్తూ ఉంటే చ్ట్టూ చేరిన జనం చోద్యం చూస్తూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కడంటే ఒక్కడు వచ్చి, హీరోకి సహాయంగా నిలవరు. ఈ విదంగా అన్ని బాదలు పడ్డ హీరో అంతా కోల్పొయి, చివరకు ఎలాగోలా విలన్ తో లాస్ట్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు పోలిసులు వచ్చి విలన్ని పట్టుకెళతారు.అందరు హేరో ని అబినందిస్తుండగా శుభం కార్డు పడుద్ది.
ఈ కథంతా ఎందుకు చెపుతున్నామంటే, ప్రస్తుతం మన దేశంలొ జరుగుతున్న పరిణామాలు పాత సినిమా నే తలపిస్తున్నాయి.పాపం, మన దేశంలో రాజకీయలు వ్యాపార మయమై, అవినీతి సైతాన్ను ఎదిరిస్తే కలిగే నష్టం కన్నా, అనుసరిస్తే వచ్చే లాబాల్ని ఇష్టపడి,అదికార, ప్రతిపక్షాలు ఒకటఈ పోయాక ,నీతిని ప్రబోదించే దేవుడు ఈ మద్య సామాజిక కార్య కర్తలు రూపంలో అవినీటి అంతానికి కష్టపడుతున్నాడు,మన పాత సినిమాలో హీరో గారిలాగ.
మీరు ఈ మద్య జరిగిన పరిణామాలు చూడండి. కొన్ని కొట్ల విలువ చేసే కుంభ కోణాలు బయట పడినా,డబ్బుంటే చాలు ఎటువంటి వారినయినా వంగదీయొచ్చు, అని విర్రవీగిన వారిని కటకటాల వెనుకకు నెట్టి, అవినీతి మీద విచారణ జరుగుతున్నదంటే అది ప్రజా ఉద్యమాల వల్ల రాలేదు. కేవలం కొంత మంది సామాజిక కార్యకర్తల దైర్య సాహాసాలు మరియు భారతీయ న్యాయస్తానాల చొరవ వల్లనే సాద్యపడింది.
నిన్న గాక మొన్న కేజ్రివాల్ అనే దైవ దూత (అదే నండి సామాజిక కార్యకర్తలకు మేము పెట్టిన పేరు లెండి) అంబానీలు తమ స్వార్దం కోసం మంత్రులని ఎలా తొలగించి, తమ అనుకూలమయిన వారిని నియమించుకున్నారో సాక్ష్యాలతో సహా వివరించినా "ఆహా! అట్టనా!" అని భోల్డంతా ఆశ్చర్యపోయారేమో కాని జనాలు, పెద్దగా చలించినట్టు కన పడలేదు.బహూశా మన రాష్ట్రంలో అయితే ప్రజలకు అంత తీరిక లేవు ఎందుకంటే ఈ మద్య పాప ప్రక్షాళన యాత్రలు మొదలయ్యాయి కథా!ఎదటి వారి పాపాలు గురించి చెపుతుంటె జనం అంతా ఈలలు కొత్తే వారు లేరని అటు వెళుతున్నారు.లేకుంటె సదరు అంబానీల దెబ్బకు బలి అయిన వారిలో మన తెలుగువాడు అందులో తెలంగాన వాడు ఉన్నాడని తెలిసినా మనలో కొంచమయినా చలనం లేదంటె అదంతా సైతాన్ మహిమ గాక మరేమిటీ?
కాబట్టి జరిగేది జరుగుతుంటుంది.అవినీతి మిన్ను విరిగి మన మీద పడినా మనం చలించం . ఎందుకంటె దాని సంగతి ఆ దేవుడు సామాజిక కార్య కర్తలకు అప్ప చెప్పాడు. ఈ నీతి, అవినీతి మద్య జరిగే పోరాటం ఆ దేవుడు,సైతాన్ మద్య జరిగేది. ప్రజలం మనం కేవలం ప్రేక్షకులం. ఈలలు కొట్టడం తప్పా మనం ఏమి చెయ్యరాదు! అంతా దైవ లీల!
క్షమించాలి, నాకు పనిచేస్తున్న భార్యలేదు.
ReplyDelete