కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!

                                                                  
                                                               
చేసిన పాపం ఊరికే పోదు అనేవారు పెద్దలు. పాపం చేసిన వారిని అదుపు చెయ్యడానికి "నరకలోకం" స్రుష్టీంచి  పలాన పాపం చేస్తే పలాన శిక్ష అని క్లియర్ గా చెప్పినా పాపాలు ఆగలేదు  సరి కదా యదేచ్చగా, జంకు లేకుండా పాపాలు చేసేసి ఆ దేవుడికి ముడుపు కట్టేసి హుండీ లో వేసేస్తే సరిపోతుంది అన్న నమ్మక్కం వల్ల నేమో కాని పాపాలు ఎక్కువగానే చేసాం. అటువంటి పాపాల్లో "కుటుంబ పాపం" అన దగ్గది , "వరకట్నం" పుచ్చుకొని" ’కన్యా దానం’ స్వీకరించడం.అసలు మన ఆచారం ప్రకారం అత్త మామలు అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. సాదర్ణంగా దానం చేసే వాడిని "దాత" అని పుచ్చుకునే వాడిని "గ్రహీత" అని అంటారు. దాత పట్ల  గ్రహీత ఎల్లప్పుడు  క్రుతజ్ణత బావంతో ఉండాలి.కాని ఆ దానం స్వీకరించడానికి గ్రహీత దాతను బాదపెట్టేంత కట్నం కోరడం అంటే కచ్చితంగా ఆ స్వీకరించేది ఏదో "పాప పలం" అయి ఉండాలి. అవును మనం అలాగే ఆడపిల్లల్ను పరిగణించాం "అబద్దం ఆడితే ఆడ పిల్లలు పుడతారు" అనే సామెతలు అటువంటి బావం వల్లనే పుట్టాయి.

 సరే వరకట్నాలు పుచ్చుకున్నాక అంతటితో అగారా? లేదు. ఇంకా అది తే ఇది తే అని ఆడ పిల్లల్ని రాచి రంపాన పెట్టి, "ఒరీ భగవంతుడా మమ్మల్ని పుట్టించి ఈ నరరూప రాక్షసులకు అప్ప చేప్పావేమిటి’ అని ఆడ పిల్లల్లు రోదించేలా చేసారు. వారి ఏడ్పులుకు ఆ భగవంతుడికి కోపం వచ్చి, సంస్కరణ వాదుల రూపంలో ఉద్యమాలు చేయించి "వరకట్న నిరోదక చట్టం", "గ్రుహ హింసనివారణ" లాంటి చట్టాలు ద్వారా రాజ్య యంత్రాంగం "మన కుటుంబాలలోకి" ప్రవేశింపచేసాడు.

 ఆ చట్టాల వల్ల కొంత పలితం కన్పడ్డప్పటికి " వరకట్న బూతం" పూర్తీగా పోలేదు. ఎందుకంటే అదంటే ఎందుకో మనలో చాలా మందికి ఇష్టం. "ఆడపిల్లల్ని కనే వారు"" మగ పిల్లల్ని కనే వారు" వేరు వేరుగా ఉండరు కాబట్టి ప్రతివారు "డబల్ ఏక్షన్" చెయ్యడం మొదలు పెట్టారు. ఆడపిల్లలకి ఇచ్చేటప్పుడు "పుణ్యమూర్తులు" అవతారం ఎత్తే వీరే మగపిల్లల్కి పుచ్చుకునేటప్పుడు "పాప మూర్తులవుతున్నారు". అందుకే ఈ సమస్య పోలేదు. కాని దాని బదులు మన చక్కని కుటుంబ వ్యవస్త పాడైపోయింది.

 ఈ మాయదారి బూతంవలన కుటుంభ సభ్యుల్లో అన్యోన్యత పోయి, అత్తింటి వారి మీద ఆడ పిల్లలకు సహజంగానే ద్వేష బావాలు ఏర్పాడి,కలహాలకు దారి తీసి చివరకు పోలిస్ కేస్లు పెట్టడం మొదలయింది. కేస్లు అంటే మనకు కావాల్సింది రాజకీయ నాయకుల సహకారం కాబట్టి వారూ "కుటుంబంలోకి" ప్రవేశించారు. ఇంకేముంది కుటుంబ వ్యవహారాలోకి ఎవరు ప్రవేసించ కూడదో వారు ప్రవేసించాక ఇక మిగిలేదేమిటి బూడిద. వారి సలహాల పుణ్యమాని "తప్పుచేసిన వారిని చెయ్యని వారిని "ఇంటిల్లిపాదిని" జైల్లో పెట్టడం, ఇక ఇటు తరపున కూడ రాజకీయ "రాబందువులు" దిగడం, "వొల్లు గుల్ల,ఇల్లు గుల్ల" అనే చందాన కుటుంబ బందాలు  కూలి పోతున్నాయి.

  ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం వర కట్నమనే భూతాన్ని మనం మన ఇంట్లొకి రానివ్వబట్టి. దాని వలనే ఈ బూత గణాలు(పోలిస్, రాజకీయాలు) మన ఇండ్లలోకి ప్రవేశీంచింది. దీని వలనే కాదా కుటుంబ సభ్యులు మద్య కొట్లటలు ఎక్కువై,ఉమ్మడి కుటుంబాలు "వేరు కాపురాలుకు" దారి తీసింది? మరి ఇటువంటి పాపాన్ని మనం ఇంకా మన కుటుంబ వ్యవస్తలో ఉంచుకోవడం అవసరమా? ఆలోచించండి.(సశేషం)

Comments

  1. తప్పుడు కేసుల వ్యవహారం మీరనుకుంటున్నంత సింపుల్ మేటర్ కాదు. చాలా పితలాటకం ఉంది అందులో ! కట్నం పోయినా అవి పోవు. కట్నం వల్ల వచ్చినవి కావవి.

    ReplyDelete
  2. katnam lekunda pelli chesukovalanukone varu e site chudandi

    http://www.idontwantdowry.com/

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.