రక్షణ విషయంలో, ఆడపిల్ల, కుక్కపిల్ల,ఒకటేనా?

                                                                     

 మొన్న డిల్లీలో ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూసిన తర్వాత,మనసున్న ఎవరికయినా కన్నీల్లు రాక మానవు. చివరకు ఆ అమ్మాయికి మెరుగయిన వైద్య సహాయం అందించే స్తితిలొ కూడ మనం లేము. మనకంటే ఎంతో చిన్నదయిన "సింగపూర్" కి పంపించాల్సీ వచ్చింది. విషయం జరిగి నాలుగు రోజులు అయింది కాబట్టి,అంతా సద్దుమనిగిపోతుందిలే అని ప్రబుత్వాదికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఒక వేళ ఆ తల్లి కేమన్నా అయితే మరొక రోజు విచారిద్దాం.ఈ కేసు తర్వాత దేశం లో ఇంకొన్ని ఇటువంటి దురాగతాలె జరిగాయి.వాటిని పత్రికలు ప్రచురించినా పెద్దగా స్పందన రాలేదు. డిల్లీలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయం మీద విద్యార్థులు గళమెత్త బట్టి సాక్షాత్తు "చిదంబరం" గారే ఆశ్చర్య పొయే అంతగా ఆ నిరసన కొనసాగింది. మరి ఇంతటితో ఆపేస్తే అసలు స్త్రీ రక్షణ అనే సమస్య తీరుతుందా?

 అమానత్(బాదితురాలి మారు పేరు) దురాగతం వినగానే నాకు మా ఇంట్లో మా కుక్క పిల్ల చనిపోయిన విదానం గుర్తుకు వచ్చి, కళ్లు చెమర్చినాయి. మా ఇంట్లో"బిన్ను" అనే కుక్క పిల్ల ఉండేది. అది పామెర్ జాతికి కి చెందిన బొచ్చు కుక్క పిల్ల.అది ఇంట్లో పిల్లలతో పాటు ఒక పిల్లగా బావించే వాళ్లం. దానిని బయటి కుక్కలతో కలవకుండా తగిన జాగర్తలు తీసుకునే వారం. ఒకటి రెండు సార్లు వీది కుక్కలు దాని మీద దాడి చెయ్యబోతే పిల్లలు వాటిని దూరంగా తరిమేసారు. పాపం దీనికి అన్నెం పున్నెం తెలియక పోవటం వలన అవి కనపడ గనే జాతి పక్శపాతమ్తో వాటితో ఆడుకోవాలని పరిగెత్తుకుంటు వెళ్లేది. కాని అవి మాత్రమ్ ఏ మాత్రం చాన్స్ దొరికినా దీనిని, కొరికి చంపాలని చూసేవి. అందుకని ఇంట్లో వాళ్లం దానిని చాల జాగ్రత్తగా కాపాడుకుంటు వచ్చే వాళ్ళం.

  అది చాలా దురద్రుష్టకరమయిన రోజు. మా అమ్మ గారు మరణించిన రోజు.మేము మా స్వంతూరు వెళుతూ, బిన్నూ ని పక్కింటివారికి అప్ప చెప్పి వేళ్లాం. తెల్లారిన తర్వాత మా కుక్క మా ఇంటివైపు వెల్లిందంట. అది పక్కింటివారు చూడలేదట.మా ఇంటిలో ఉన్న బిన్ను మేము కనపదక పోయే సరికి బయటకు వచ్చి, అక్కడ కనపడ్డ వీది కుక్కల దగ్గరకు వెళ్లిందట. అంతే అక్కడ ఉన్న మూడు వీది కుక్కలు మా బిన్నూను కరచి, కరచి, వేటాడుతుంటే దాని గోడు పట్టించుకునే వారు లేకపోయారు.అది చావు బతుకల మద్య మా ఇంటి గేట్ వద్దకు వచ్చి పడిపోతే అప్పుడు చూశిన పక్కింటి వారు ఆ వీది కుక్కల్ని తరిమారట. మా కుక్క మాకు దక్కలేదు. మా తల్లి గారి  దుఖం లో ఉన్న మాకు ఆ సాయంత్రం వరకు విషయమ్ తెలియనివ్వలెదు. నేను ఆ రోజు బాగా ఏడ్చాను.మా పిల్లల సంగతి సరెసరి.(ఇప్పుడు కూడ నా కళ్లు వర్షిస్తున్నాయి)

 మొన్న డిల్లీ కేస్ వినగానె మా బిన్ను యె గుర్తుకు వచ్చింది.  ఆడపిల్లల రక్షణ అనేది నిరంతరం కొనసాగవల్సిన ప్రక్రియ. దానికి కుటుంబ రక్షణ, సమాజ రక్షణ, ప్రబుత్వ రక్షణ ఉండి తీరవలిసిందే. మన ఇంట్లో కుక్కపిల్లనె అంత జాగ్రత్తగా చూసుకునే మనం సమాజమ్ లోని ఆడ పిల్లల్ని, పనికి మాలిన బావాజాలాల పేరుతో పాడు చేసుకుందామా? ఏ ఆడపిల్ల తన జీవితాన్ని కోరి, కోరి పాడు చేసుకోదు.అది అమాయకత్వమో, మూర్కత్వమొ అయితె తప్పా. ఆటువంటి వారిని రక్షించాల్సిన బాద్యత పెద్దలందరి మీద ఉంది. ముఖ్య మంత్రికి, పోలిసులకి పొసగని వ్యవస్తలో ఆడపిల్లకు రక్షణ దొరుకుతుందను కొవటం అత్యాశే అవుతుంది. కాబట్టి ప్రజలే కదలాలి. ఒక సమగ్ర  రక్షణ విదానం గురించి ఆలోచించా ల్సిన తరుణమాసన్న మయింది.           

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!