మనిషి తనలో లేని ’గుణాన్ని"అరాదిస్తాడా?
అవుననే అనిపిస్తుంది చాల మందిని చూస్తే. మనం హిందువులం. సాద్యమైనంతవరకు "అహింసే" మన దర్మం అని చెపుతాం. అలాగే ఆచరిస్తాం.కాని మనం కొలిచే దేవుళ్లు అహింసా వాదులు కారు. ఖచ్చితంగా "దుష్ట శిక్షణ" కోసమే వారు జన్మిస్తారు కాబట్టి,’హింస" అనేది వారికి తప్పదు. మన దేవుడు ఎలాగు "దుష్ట శిక్షణ" కు వస్తాడు కాబట్టి, మనకెందుకులే ఆయన డ్యూటి మన నెత్తినేసుకోవడమని,మన చుట్టు పాపాత్ములు పెరిగిపోతున్న కిమ్మనకుండా"ఉన్నావా! అసలున్నావా" అని ఆయన్ని వేడుకుంటు ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటాం.
కాని విచిత్రంగా "కరుణా మయుల్ని" పూజించే వారు ఉన్నారు. వారి ఆరాదన పురుషుడు ’శత్రువులు" చంపుతున్నా వారిని ఏమన కుండా వారిని క్షమించమని వాళ్ల గాడ్ ని వేదుకుంటాడు. మరి అటువంటి కరుణామూర్తి కొలిచే దేశాలవారు మాత్రం ’రాత్రికి రాత్రే" ఇతర దేశాల పౌరులి మీద "బోల్డన్ని బాంబులు’ కురిపించి తమ క్రూర రసాన్ని చాటుకుంటారు.
అలాగే బుద్దున్ని పూజించే వారు కూడ,తుపాకులతోనే మాట్లాడుకుంటారట.ఇవ్వన్ని చూస్తుంటే నాకొక డౌట్ ఏమిటంటే, మనిషి తనలో లేని గుణాన్ని అరాదించడానికే ఎక్కువ ఇష్ట పడతాడా?
Comments
Post a Comment