"కులాలను" కూల్చగల, మగదీరులెవ్వరురా!

                                                                  

’కుల రహిత’ సమాజాన్ని,నిర్మించాలన్న, మన రాజ్యాంగ నిర్మాతల ఆశలు అడియాశలు అయినవి.  అంచె పద్దతిలో నిర్మాణాత్మకమయిన  కులవ్యవస్తను నిర్మూలించడం ఎవరి వల్లా కాదు అనేది తేలి పోయింది.మన సమాజంలో "మత మార్పిడి" కి అవకాశం ఉంది. కాని "కులం విషయంలో అట్టి అవకాశం లేదు. కారణం తమ కులాలను ఒదులుకోవడానికి ఏ ఒక్క కులం వారు సంసిద్దులుగా లేరు. "అగ్రవర్ణాలవారు" తమ ఆదిక్యతను ప్రదర్శించడానికి ’కులం కార్డు" వాడుతుంటే, నిమ్న వర్గాలవారు, తమకు లభించాల్శిన "రిజర్వేషన్’లు కొరకయినా ’కులం కార్డు’ వాడక తప్పటం లేదు. అందుకే కులం కొందరికి "అహంభావం" అయితే చాలామందికి ’ రిజర్వేషన్ల అవసరం".

  కాబట్టి ఇటువంటి పరిస్తితుల్లో "కుల నిర్మూలన" గురించి ప్రస్తావించే దైర్యం ఏ రాజకీయ పార్టీ చేయదు గాక చేయదు.సర్వ అదికారాలకు మూలం "రాజ్యాదికారం". అన్నివర్ఘాల ప్రజకు దీనిలో బాగస్వామ్యం అనివార్యం. మన సమాజాన్ని, కుల ప్రాతిపదిక తప్ప ఏ ప్రాతి పదికన చూసిన అది ద్రుష్టి లోపమే అవుతుంది. ప్రజలకు సమ న్యాయం చేయటమే కాదు, తాము సమ న్యాయం పొందామన్న బావం వారిలో కలిగించాలి. ఇందుకు "కుల ఆదారిత రాజ్యాదికార పంపకం" ఒక్కటే శరణ్యం.

  బారత రాజ్యాంగం యస్.సి,యస్.టి, వర్గాల వారికి అదికార కల్పించటంలో సఫలీ క్రుతమయినప్పటికి, అత్యదిక జనాబా గల బి.సి.లకు కల్పించక పోవడం ఘోర తప్పిదం.కాని కాల క్రమేనా వారికి కల్పించక తప్పని పరిస్తితులు వచ్చేశాయి. ఆదర్శాల వల్ల "అవినీతి" పెరిగింది కాని ప్రజలకు ఒరిగింది తక్కువే. ఈ  "కుల ఆదారిత రాజ్యాదికార పంపకం" వలన " ప్రతిభా వంతులు" అన్యాయం అవుతున్నారని కొంతమంది ఆవేదన చెందుతుంటారు. కాని అవినీతి మయమయినా రాజ్యంలో "నిజమయిన ప్రతిబ" ఉండటం బహు కష్టం.

  "మానవీయ విలువలు తెలియని ప్రతిబా వంతుడి కన్నా, సగటు జ్ణానం కలిగిన మానవత మూర్తియే సమాజానికి ప్రయోజన కారి". కాబట్టి ప్రతిభను "రుద్దుడు మార్కులు" ఆదారంగా కాకుండా అనేక కోణాలలో విశ్లేషించి నిర్ణయిస్తే నిజమయిన ప్రతిబావంతులు వెలుగులోకి వస్తారు. అటువంటి ప్రతిబావంతుల సేవలు పొంద డానికి వీలుగా చట్టాలు చేయవచ్చు.

  ఎవరి అర్హతక్లు  తగట్టు వారికి తప్పనిసరిగా ఉపాది అవకాశాలు లబిస్తూ ఉంటే "ఉద్యోగ రిజర్వేషన్లు" గురించి ఆరాటం ఉండదు.కాని రాజకీయ రిజర్వేషన్లు మాత్రం పైన చెప్పిన విదాణం లోనే జరిగితే మంచిది అని నా అభిప్రాయం.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం