భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?
అవుననే అనిపిస్తుంది, ఈ రోజు వార్తలు చూస్తే. మన అంద్రా దంపతులు,చంద్రశేఖర్ అనుపమ "నార్వే" దేశంలో స్వంత పిల్లల్ను మందలించిన పాపానికి జైల్ శిక్ష అనుభవిస్తున్నారు. దేశం మొత్తం ఇది అన్యాయమె అని అంది. మన ప్రభుత్వాని కలగచేసుకుని వారికి న్యాయం చేయమంటే, ఇది వారి అంతర్గత న్యాయ సమస్య, మనం జ్యోక్యం చేసుకోరాదు అని సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక వేళ ఓపెన్ గా చెప్పకపోయినా, మన ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించి అయినా వారికి ఉపశమనం ఇప్పించలేక పోయింది. అదే అమెరికా అయితే అలాగే చేసేదా? అని మనం అడగలేక పోయాం. వారి గొప్పచట్టాల్ని ఉల్లంఘించారు అని, ఈ శాస్తి వారికి జరగాల్శిందే అని, మన వాళ్లే కొంతమంది సుద్దులు చెప్పారు.
అంతా చట్ట ప్రకారమే జరిగింది అనుకుందాం. మరి ఈరోజు సాక్షాతు నార్వే ప్రదానిని మన రాష్ట్రానికి చెందిన ఒక మతపెద్ద(నార్వే మతం కి సంబందించిన వ్యక్తి), ఈ విషయం లో ఎలా జ్యోక్యం చెసుకుని మాట్లాడుతున్నాడు? నూటపది కోట్ల బారత రాష్ట్రపతి చెయలేని పని ఒక వ్యక్తి ఎలా చెయ్యగలుగుతున్నాడు.అంటే మతానికి ఉన్న ప్రాదాన్యత సార్వబౌమత్వానికి లెదనె అర్థం చేసుకోవాలా?. చూద్దాం ఏమి జరుగుతుందో?
దీని గురించి ఇంతకు ముందు మేము పెట్టిన టపా కొరకు లింక్
ఆపదలో సహాయం చేయదలచుకున్న వాడు యెవడైనా ఉత్తముడే.
ReplyDeleteఆపదలో సహాయం చేసిన వాడు యెవడైనా దేవుడే.