ప్రతి రోజు 200 రకాల జీవరాసులకు యుగాంతమట! మరి మనిషి కెప్పుడో తెలుసా?

                                                                            
 మొత్తానికి ప్రపంచానికి "యుగాంతం"  బెడద తప్పింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలీపోయింది కాబట్టి ఇక మనం గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిదరపోవచ్చు. పుట్టిన్న వాడు గిట్టక మానడు. ఇది సార్వజనీక సూత్రం. ఇది మనుష్యులకే కాదు, గ్రహాలకు వర్తిస్తుంది. మన బూమి ఒక గ్రహమే కాబట్టి, ఇది కూడ ఏదో ఒక రోజు ఖగోళం లో అంతర్థానం కావచ్చు. దానికి ఎంత సమయం అనేది సైంటిఫిక్ జోతీష్యులు  మాత్రమే అంచన వేయగలరు. ఎవరికైనా ఏదో తెలియనిఅతీత శక్తులు ఉండి చెప్పినా లాభం ఉండదు.

   అటు వంటి సైన్స్ వాదులు చెపుతున్న దాని ప్రకారమే ఈ బూమి మీద రోజుకు ౨౦౦ రకాల జీవులు నశించి పోతున్నాయట. అంటే వాటికి "యుగాంతం" వచ్చేసింది. కాని మనం దానిని యుగాంతం అనం. ఎందుకంటే ఆ "గత్తర" మనకి తగల లేదు కాబట్టి. మన అబిరుద్ది కోసం చిన్న పిచ్చుకలు లాంటి జీవుల "యుగాంతానికి" మనమే కారకులమయ్యాం. అయినా మనం పెద్దగా చలించం. ఈ బూమి మన బాబుల సొత్తు. వీటి మీద తక్కిన జీవరాసికి ఏ హక్కూ లేదు. మన దయా దాక్షిణ్యాల మీద అవి మనుగడ సాగించాలి. పాపం వాటికి "జీవ హక్కుల సంఘం" లాంటివేమి లేవు. ఆ దేవుడు వాటికి జ్ణానం ఇవ్వకుండ మనిషి పట్ల పక్ష పాతం చూపించాడు. అందుకే దేవుని బిడ్డల మని మనకు ఈ భూమి మీద సర్వాదికారా లిచ్చాడు, అందుకే అంతులేని జ్ణానం తో విర్రవీగుతున్నాం.

  ఒక మనిషిని సకారణం గా చంపినా సరె అది చట్ట బద్దం కాక పోతే,  "మానవ హక్కులు" ప్రశ్నిస్తాయి . కాని కొన్ని వందల జీవుల హత్యకు బాద్యుడైన మనిషిని ఏ "జీవ హక్కులు" ప్రశ్నించాలి, ఏ కోర్టులో ప్రశ్నించాలి? ఈ మానవ జాతి నాశనమవుతుంది అంటే తప్పా స్పందించని మనిషిని భయ భక్తుల్లో పెట్ట గలిగేది ఏది?  సాంకేతిక జ్ణానమా? కాదు. అది పెరిగాకే మనం మరింత ప్రక్రుతి నాశకులమయ్యాం. అందుకే భగవంతుడు అనే వాడు వస్తాడు. రావాలి కూడ. ఆ బావనలే కొంతవరకైనా మానవ జాతిని ప్రక్రుతి పట్ల ప్రేమికులుగా మారుస్తున్నాయి. సకల జీవరాసి పట్ల సమాన బావన కలిగి ఉండెలా దోహదం చేస్తున్నాయి.

  ఈ రోజు తప్పినది" ప్రళయం" కావచ్చు. కాని మనిషికి ముప్పు నిరంతరం పొంచే ఉంది. ప్రక్రుతి పట్ల, ఇతర జీవరాశి పట్ల మన బాద్యత మన సక్రమంగా నిర్వర్తించక పోతే, ఈ రోజు అనుకున్నది రేపు లేదా మరొక రోజు రావచ్చు. తప్పదు.

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?