కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!




                                             ప్రేమ కి ఒక విశిష్టత  ఉంది.అదేమిటంటే అది ఎవరినైనా ఒకే ద్రుష్టితో చూస్తుంది. అది తల్లితండ్రుల మీద కావచ్చు, బార్యా భర్తల మద్య కావచ్చు, కుటుంభ సబ్యులమీద కావచ్చు. తను ప్రేమించే వారి సుఖ సౌఖ్యాలను కాంక్షించడమే నిజమైన ప్రేమ . అంతే కాని తమ సుఖం కోసం తమను ప్రేమించేవారిని కాలదన్ని వారిని బాదించడం దానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టుకుని తమ సుఖం  తాము చూసుకోవడమ్ ఖచ్చితంగా కుటుంబ ద్రోహమే అవుతుంది.

   నాకు తెలిసిన కథ చెపుతాను.మీరే ఆలోచించండి. ఒక మద్య తరగతి రైతు కుటుంబం నకు చెందిన ఇంటర్ అమ్మాయి, వారి ఇంటికి దగ్గరలో ఉంటున్న కూలి కుటుంబం నకు చెందిన అబ్బాయి లవ్ లో  పడ్డారు.వారి విషయం తెలిసిన పెద్దలు అమ్మాయిని మందలించి అమ్మాయ్ని వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించారు. ఇది తెలిసుకున్న అబ్బాయి తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి ఉంటున్న దగ్గరికి వెళ్ళి, ఆమెను  ప్రొత్సహింహించి అమ్మాయితో జంప్ అయి పోయారు. ఇది తెలిసిన పెద్దలు వారిద్దరి కోసం ఎంత గాలించిన ప్రయోజనం లేకపోయేసరికి పోలిస్ కేస్ పెట్టారు. పోలిసులు చివరకు ఒక చోట ఆ అబ్బాయి ఉన్నాడన్న సమాచారంతో వెళ్లి పట్టుకుంటే వారికి దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది.

  ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోయిన తరువాత కోన్ని రోజులు స్నేహితుల దగ్గర ఆనందించారు. ఆ తర్వాత అభ్భాయికి అమ్మాయికి గొడవలు వస్తే అవి తీర్చడానికి ఆ అబ్బాయి  స్నేహితుడు(పారిపోవడం లో సహాయం చేసినవాడు) వచ్చి వారి తగువు తీర్చాడు. ఏలాగంటె ఆ ఆబ్బాయిది నిజమైన ప్రేమ కాదు కాబట్టి వాడు అమ్మాయికి పనికి రాడు అని, ఈ దశ లో ఇంటికెళ్లినా ఇంట్లోవాళ్ళు  రానివ్వరు కాబట్టి, ఆ అమ్మాయిని తాను పెద్దమనసుతో ఆదరిస్తానని ఆ స్నేహితుడు చెపితే సరేనని ఆ అమ్మాయి ఆ కొత్త ప్రియుడితో కలిసి కొత్త చోటుకి వెళ్లిందంటా. .పోలిసుల భయంతో మొదటి ప్రేమికుడు అక్కడక్కడా తిరుగుతున్నాదు. అదీ కథ .

    చివరకు పోలిసులు ఆ నూతన ప్రేమికుడిని, అమ్మాయిని తీసుకువచ్చి అబ్బాయిల మీద కేస్ పెట్టి అమ్మాయిని  తల్లితంద్రులకు అప్పచెపితే ఆ కుటుంభం ఆ ఊరొదిలి వెళ్లి పోయింది. అభ్బాయిలు బెయిల్ మీద బయటకు వచ్చి, రసిక పురుషులు అన్న బిరుదులు తగిలించుకుని కాలర్లెగరేసుకుని తిరుగుతున్నారు. అదీ కథ

 అయ్యలారా, అమ్మలారా ఈకథలో ప్రేమికులు అని చెప్పుకుంటున్న వీరి మద్య ఉన్నది ప్రేమేనా ? మేజర్లు అన్న కారణంగా వీరి చేష్టలను సమాజం అనుమతించాలా? చివరకు పోలిస్లు ఆ కుటుంభం మీద జాలి పడి,
 పెట్టుడు  సెక్షన్లతో  కేస్ బనాయించారు తప్ప నిజానికి చట్ట ప్రకారం వాళ్లని చెయ్యగలిగింది యేమి లేదు.అంతా వారిష్టమే కాబట్టి.

అదనపు సమాచారం కొరకు   ప్రేమించినోడు హీరో! కని పెంచినోల్లు విలన్లు! ( దీనిమీద క్లిక్ చెయ్యండి)
                                                         (16/10/2012 Post republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!