ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

                                                                     


                                                    కలి యుగం అంతానికి వచ్చినట్లే అనిపిస్తుంది ఈ  ఉదంతం వింటుంటే !చీకటి సామ్రాజ్యాల ఏలుబడి కోసం మాఫియా డాన్ లు తుపాకులు పట్టడం చూస్తున్నాం . సిద్దాంతాల అమలు కోసం తీవ్రవాదులుగా మారిన వారు తుపాకులు పేల్చడం గురించి వింటున్నాం . మతం పేరిట ఉగ్రవాదులుగా మారి మారణ హోమం సృష్టించడం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట నిత్య కృత్యం గా నడుస్తున్నదే . కాని దైవ సేవలో నిత్యం రామ నామార్చన చేసే పూజారి , తను ప్రేమించిన -అది కూడా వన్ సైడ్ లవ్ అట- ప్రియురాలికి పెండ్లి చేసుకుంటే తట్టుకోలేక , ఆమె భర్తను హత మార్చడం కోసం పిస్టల్ కొని మరీ చంపాలనుకోవడం ఎంత దారుణమైన ఆలోచన!? వివరాలు లోకి వెళితే .....

   విజయవాడ దగ్గరలోని ఇబ్రహీం పట్టణం లో గల రామాలయం లో సుదర్శన రవి దత్త శాస్త్రి పూజారి . ఆయనకు వివాహం కాలేదు . ఈ  మద్య కొన్ని సామాజిక వర్గాల వారికి పెండ్లి చేసుకుందా మన్నా ఆడపిల్లలు దొరకని పరిస్తితి . అందులో రవి దత్తా సామాజిక వర్గం కూడా బాదిత వర్గం కావచ్చు . అందుకే కామోలు అయన ఏమో ఎదురింటి అమ్మాయిని ప్రేమించాడు కాని ఆ  విషయం ఆ అమ్మాయికి చెప్పలేక వన్ సైడ్ లవ్ గానే ఆమెను అరాదిoచడం మొదలెట్టాడు . ఒక పక్కా రామాలయంలో రామ ఆరాధనా , ఇంకొక ప్రేమాలయంలో తన ప్రేమికురాలి అరాదాన తో తన రోజువారి కార్యక్రమం గా పెట్టుకుని బ్రతుకు గడుపుతున్నాడు . కాని రాములు వారు అంటే దేవుడు కాబట్టి ఎంత అరాదిoచుకున్న అబ్యంతరం చెప్పక ఉన్న చోటునే ఉంటాడు కాని ఒక ఆడపిల్ల ఎల్లపుడ్డు పుట్టింట్లో ఉండదు కదా!

  అతని ఏకపక్ష ప్రియురాలికి అమె తల్లి తండ్రులు ఒంగోలు  కు చెందిన వ్యక్తీ తో వివాహం చేయగా ఆమె అత్తారింటికి వెళ్లి పోయింది . దానితో మన పూజారి గారికి రామ అరాదనె తప్పా ప్రేమ ఆరాధన లేకుండా పోయింది . దానితో అతడు దేవదాసులా "మందు బుడ్డి " ని ఆశ్రయించలేదు కాని ఒక మతిమాలిన పనికి సంకల్పించాడు . అ అమ్మాయికి భర్తను లేకుండా చేస్తే ఆమె ఎలాగూ పుట్టింటికి రాక తప్పదు . అప్పుడు తన మూగ ఆరాధనా కంటిన్యూ చెసుకొవచ్చని తలచి , తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా బిహార్ నుంచి 45,000 రూపాయలు పెట్టి ఒక [పిస్తోలు తెప్పించాడు . దానితో సదరు ప్రేమికురాలి భర్తను చంపడానికి ప్లాన్ రచించి దాని అమలు కోసం విజయవాడ బస్ స్టాండ్ కి తన స్నేహితునితో సహా వచ్చాడు .

  తను ఒకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది . లేకుంటే దైవ ఉనికికే అర్ధం లేదు . ఎంత తన సేవ చేసుకునే పూజారి అయినా ఇలాంటి అమానుష ఆలోచన చేయడం ఆ రాముల వారికి నచ్చ లేదు కామోలు . ఆదిలోనే హంస పాడు కల్పించి సదరు ప్రేమ పూజారిని పోలీసులకు చిక్కేలా చేసాడు . విజయవాడ బస్ స్టాండ్ లో గల మరుగు దొడ్లలో పిస్తోలు లోడ్ చేస్తున్నప్పుడు అది మిస్ పైర్ అయి ప్రక్కనున్న ప్రయాణికుడి తొడలోకి బులెట్ దూసుకెళ్లింది. అంతే ! అక్కడే డ్యూటిలో ఉన్న పోలీసులు , ఆ ప్రేమ పూజారిని , అతని స్నేహితుడిని పట్టుకుని వారి వద్దనుంచి పిస్తోలు , బుల్లెట్లు సిజ్ చేసి వారిని కట కటాల  వెనుకకు పంపారు . ఇది నిన్న తెల్లవారు ఝామున విజయవాడ బస్ స్టాండ్లో ని మరుగు దొడ్ల సాక్షిగా జరిగిన సంగటన .

  సమాజంలోనే కాదు , సామాజిక వర్గాలలో సైతం స్త్రీ పురుషుల నిష్పత్తిలో సమతుల్యత దెబ్బ తినడం వలననే పూజారి గారు పెండ్లి చేసుకోవడానికి అడ పిల్ల దొరకక ఇలాంటి తప్పుడు పనికి పాల్పాడాడా అనేది అతని నుంచి సమగ్ర విచారణ ద్వారా తెలియాల్సి ఉంది .
                                               (12/3/2014 post Republished).
             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం