29 యేండ్ల తల్లిని కాల్చి చంపిన 2 యేండ్ల కొడుకు !
ఈ రోజు నన్ను ఆకర్షించిన ఒక వార్తను ప్రస్తావిస్తాను .దానిని చూచిన తర్వాత "విది లిఖితం " అనేది ఉందో లేదో మీరే ఆలోచించుకోండి . ఇది పుక్కిటి పురాణం కాదు .పక్కా వాస్తవ సంఘటన .
అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని హైదన్ అనే చిన్న పాటి పట్టణం లో ని వాల్ మార్ట్ షాపింగ్ మాల్ లో జరిగిన సంఘటణ ఇది . ఆమె వయస్సు 29 సంవత్సరాలు . ఆమె 4 పిల్లలతో కలసి షాపింగ్ చెయ్యడానికి వచ్చింది . అందులో చిన్న పిల్లవాడి వయసు కేవలం 2 యేండ్లు . అందుకే ఆ పిల్లాడిని షాపింగ్ కార్ట్ లో కూర్చో బెట్టి ఆమె తన షాపింగ్ చేసుకుంటుంది . మిగతా 3పిల్లలు ఆమె తోనే షాపింగ్ లో పాల్గొన్నారు . అప్పుడు జరిగింది ఆ సంఘటణ !
షాపింగ్ కార్ట్ (బండి) లో కూర్చున్న అ 2యేండ్ల కొడుకు హట్టాతుగా బండి లో నుంచి దిగి ఆమె వద్దకు వెళ్ళాడు ఆమె గమనించే లోపే ఆమె పర్స్ లోని చిన్న కాలిబర్ హాండ్ గన్ తీయడం ఆమెను కాల్చి వేయడం జరిగింది .దానితో ఆ తల్లి అక్కడె కుప్ప కూలి పోయి ప్రాణాలు విడిచింది .ఆ సమయంలో ఆమె భర్త అక్కడ లేడు .విషయం తెలిసిన ఆతను షాపింగ్ మాల్ కు వచ్చి బార్యని చూసి ఖిన్నుడయ్యాడు .పిల్లలను బందువుల ఇంటికి చేర్చాడు .. దర్యాప్తు కొనసాగింది .
దర్యాప్తు జరుపుతున్న Kootenai County షరీప్ అధికార ప్రతినిది స్టువర్ట్ మిల్లర్ గారి ప్రకారం ఇదొక "ఆసక్తి కర విషాద సంఘటణ ". దట్సాల్ ! ఈ సంఘటణ నిన్ననే జరిగింది కాబట్టి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ విషయమ్ లో తల్లి నిర్లక్యంగా వ్యవహరించింది అనుకోవటానికి వీలు లేదు .ఎందుకంటె ఆమె కొడుకుని తన రక్షిత అయుదానికి దూరంగా కూర్చో బెట్టింది . అదీ షాపింగ్ చెసే బండి లో గన్ ఆమె దగ్గర పర్స్ లో బద్రంగా ఉంది . కాని కుర్రాడు ఆ పర్స్ దగ్గరకు వచ్చి ,అందులోనుంచి గన్ తీసి కాల్చడం ,అది పొరపాటున తన తల్లికే తగలడం ,దానితో ఆమె చనిపోవడం , ఇదంతా చూస్తుంటె , కొడుకు చేతిలోనే ఆ తల్లి చావు రాసి పెట్టి ఉందనే 'విది సమర్దనా వాదం ' ఇచ్చినంత సంతృప్తి కర సమాదానం ,శాస్త్రీయ వాదం ఇవ్వగలుగుతుందా ? చెప్పండి .తన రక్షణ కోసం దాచుకున్న ఆయుధం వలననే తను చంపబడటం కూడా విది ఆడిన నాటకం లో బాగమేనా ?ఏమో మరి !
Source :-
Woman accidentally shot and killed by 2-year-old in Walmart
(31/12/2014 post Republished).
Comments
Post a Comment