"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?

                                                                       


                                                     అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !

  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  మొన్నీ మద్య సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి గారి మీద ఒక న్యాయ విద్యార్దిని లైంగిక ఆరోపణలు చేసింది. ఆమె గారు యేడాది క్రితం తను శిక్షణలో ఉన్న కాలం లో తనకు గురువుగా వ్యవహరించిన అప్పటి సుప్రీం కోర్టు జడ్జ్ అయిన ఒకాయన, తను అయన బస చేసిన హోటల్ రూం  కు వెళ్ళగా   తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేసింది. దానికి స్పందించిన సుప్రీం కోర్టు వారు ముగ్గురు జడ్జ్  లతో   కూడిన ఒక విచారణ కమిటీ వేసారు. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారమే తను చేసే ఆరోపణలకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. మరి ఆ ఆరోపణలు ఎలా రుజువు కావాలి? ఇది ఇలా ఉండగా ఇంకొక  మహిళా న్యాయవాది కూడా , తను శిక్షణలో ఉండగా కూడా  సదరు న్యాయమూర్తి గారు తనతో ఇలాగే ప్రవర్తించాడు అని పేస్ బుక్ లో చెప్పిందట! అది గడచి కూడా  కొన్ని సంవత్సరాలు అయింది అట . దానికీ  సాక్షులు లేరు. మరి ఈ  అమ్మాయిల ఆరోపణలు ఎలా రుజువు కావాలి? ఒకవేళ రుజువు కాలేక పోయినా, ఆ ఆరోపణలు నిజమైనా , కాకపోయినా  సంఘం లో సదరు న్యాయమూర్తి గారి పరువు ఖచ్చితంగా పోతుంది. అదే వారోపించిన వారి ఉద్దేశ్యం అయితే వారు సక్సెస్ అయినట్లే అని చెప్ప వచ్చు. ఆ ఆరోపణ చేసే అమ్మాయిలూ కూడా  కోరుతుంది ఏమిటంటే ఆ చంచల స్వబావుడైన న్యాయమూర్తి వద్దకు న్యాయ విద్యార్దిణులను బవిష్యత్ లో పంపించ వద్దని. అది జరిగినా చాలనే తమ లేట్ పిర్యాదుల ఉద్దేశ్యం అంటున్నారు.

    అసలు ఆ ఒక్క న్యాయ మూర్తే కాదు ఏ పురుష గురువులు , తమ స్త్రీ విద్యార్దినులతో ఏకాంతం గా కలిసే ఉండే విదానమే తప్పు అనే ఒక నిబందన ఉంటే ఇంత అవమానం ఆ గురువు కు కానీ, ఆ విద్యార్దినులకు కానీ జరిగి ఉండేది కాదుగా?   కానీ అలాంటి విదానం ఉండటానికి మనలోని అబ్యుదయ బావనలు ఒప్పుకోవు. ఆరోపణలు రుజువు కాకుండానే ఒక వ్యక్తిని నానా యాగీ చేసి పరువు తీయడానికి  మాత్రం అబ్యుదయం అడ్డు  రాదు.రేటింగ్ ల కోసం వెంపర లాడుతున్న మీడియా ఉన్న ఈ  కాలం లో అది అసాద్యం కూడా   స్త్రీ పురుషులు బహిరంగంగా  ముద్దు పెట్టుకోవడం   కామన్ అనే ప్రాశ్చ్యాత బావనలు మనం అంగీకరించనపుడు ,పరాయి  స్త్రీ పురుషులు ఏకాంతంగా   కలిసి ఉండడాన్ని మాత్రం ఎందుకు వ్యక్తీ  స్వేచ్చలో బాగంగా పరిగణించాలి? పురుషుని లోని "మగబుద్ది " ని కంట్రోల్ చేసే మన సాంప్రదాయ బావాల  లో బాగంగా మన చట్టాలు ఏర్పడి ఉంటే మనకు ఇటువంటి అవస్తలు ఉండేవి కావనుకుంటా? విదేశి బావ ప్రబావితం  తో ఏర్పరుచుకున్న చట్టాలు కాబట్టి , తప్పు చేసినా చేయక పోయనా శిక్ష మాత్రం అనుభవించి తీర వలసిందే.
   
 ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. ఈ  దేశం లో సంచలన రేకెత్తించే మాటలకు ఉన్న విలువ మానాభిమానాలకు  లేవు . తప్పు చేసినా , చేయకున్నా , సాక్ష్యాదారాలు ఉన్నా లేకున్నా పరువు పోవడం కాయం అనే సందర్భం లో ఎవరైనా ఏమి ఆలోచిస్తారు? దొంగా , దొరా ఒకటే గాటన కట్టబడుతుంటే  ఈ  దేశం లోని న్యాయ ప్రక్రియలకు ఉన్న విలువ ఏమిటి?పరువు నష్టం కేసులు పెట్టాలనుకున్న , అది తమ జీవిత కాలంలో తేలతాయన్న గ్యారంటీ లేని దాని గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇప్పటికే 498 A  కేసులు నోటికి 95% తప్పుడు కేసులే అని రుజువైనా , ఆ చట్టం గురించి కానీ , ఆ తప్పుడు ఆరోపణల మీద కానీ చర్యలు తీసుకునే దమ్మూ , దైర్యం ఎవరికీ లేవు. చివరకు పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జాలిపడటం తప్ప ఏమి చేయ లేక పోతున్న్నారు. చివరకు ఇవి ఇలాగే కోన సాగితే ఈ  దేశం లో స్త్రీ పురుష మద్య సంబందాలు అనారోగ్యకరంగా తయారు అవుతాయి. కాబట్టి తప్పుడు పనులు చేసే వారినే కాదు, తప్పుడు ఆరోపణలు చేసే వారిని సైతం కఠినంగా శిక్షించే చట్టాలు  చేస్తే తప్పా , "సత్యమేవ జయతే" అన్న భారత నినాదం కు అర్దం ఉండదు.    

                                                              (16/11/2013 Post Republished).                            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!