గణేశ నిమజ్జనమా? సర్వ దేవతా నిమజ్జనమా?

                     

                             ఈ రోజుతో గణపతి నవ రాత్రులు ముగిసి నిమజ్జనంతో వేడుకలు పూర్తి చేసారు. మన హీందు మతంలో పూజలు చెయ్యటానికి ఒక పద్దతి ఉంది. దేవుళ్లను నమ్మనివారు పూజలు చెయ్యడమనే ప్రసక్తి ఉండదు. కాని నమ్మేవారు ఖచ్చితంగా ఆ పద్దతులు పాటించి తీరాలి. లేదు మా ఇష్టం మాది అంటే దైవాగ్రహానికి గురి కాక తప్పదు.

     అసలు కొంతమంది చేస్తుంది గణేశ నిమ్మజ్జనమా? సర్వదేవతా నిమజ్జనమో అర్థం కావటం లేదు. ఒక సారి మీరు టి.వి.లలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం అవుతున్న ప్రతిమలను పర్సీలించండి. గణేశునితో పాటు, శివ పార్వతులు,కుమారస్వామి,సాయిబాబ,క్రిష్ణుడు, ఇంకా అనేక మంది దేవతలను నిమజ్జనం చెస్తుంటే ఈ మతాచార్యులు,పీటాదిపతులు,పెద్దలు ఏం చేస్తున్నారు? పిల్లలు తప్పులు చేస్తుంటే వారించాల్సిన బాద్యత వీరి మీద లేదా? అసలు గణెశ నవరాత్రులు వీదుల్లో జరిపేటప్పుడు గణపతిని తప్ప ఇతర దేవాత మూర్తులను ఉంచగూడదని చెప్పాల్శిన బాద్యతను వీరు విస్మరించబట్టే ఈ అనర్థం జరుగుతుంది.

                                                                               
అపచారం! అపచారం! గణేశుడి తో పాటు ఎంతమంది దేవతలను నిమజ్జనం చేస్తున్నారో చూడండి . 

      పూర్వపు కాలం లో గణపతి పూజలను ఇలాగె చేసే వారా? ఎవరి ఇండ్లలో వారు చక్కగా చేతితో మట్టి  ప్రతిమలను చేసుకుని , నిష్టగా పూజించి , బక్తి శ్రద్దలతో చెరువులలోకి తీసుకు  వెళ్లి  నిమజ్జనం చేసే వారు. మరి ఇప్పుడో ! ప్రతిమ చేసే వాడెవడో ? పూజలు చేసే వారెవరో ? నిమజ్జనం చేసే వారెవరో ? అంత సినిమా షూటింగ్ మాదిరి తయారు అయింది. భారీ గణపతులను తయారు చేయడమెందుకు? ఘోరంగా క్రేన్ లను ఉపయోగించి చెరువులోకి పడదోయడమెందుకు? ఇదేనా నిమజ్జనం పద్ధతి ? 9 రోజులు పూజలు అందుకున్న భగవంతుని బారి క్రేనులు ఉపయోగించి చెరువులోకి పడదోసే వారికి  పూజా ఫలితం దక్కుతుందా ? లేక చిన్న ప్రతిమను చేసుకుని , నిష్టగా పూజ చేసి ,భక్తితో స్వహస్తాలతో నిమజ్జనం చేసే  వారికి ఫలితం దక్కుతుందా? ఆలోచించండి . ఇలాంటి ఆడంబరం  ఉన్న  తావులలో భగవంతుడు ఉండడు . ఇది మాత్రం నిజం.


  అసలు హిందూ దేవుళ్లన్నా, మతాచారాలు అన్నా రాజకీయ నాయకులకు ఆటలైపోయింది. వీరు జోక్యం చేసుకోబట్టె ఈ గణపతి పూజ అడంబర,అట్టహాస మయమై,చివరకు అటు పర్యవరణానికి, ఇటు మాతాచారాలకు తీవ్ర హాని జరుగుతుంది.నేను స్వయంగా చూశాను.మా దగ్గర ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు గణేశ ఉత్సవాలు ఎవరు నిర్వహించాలి? అన్న విషయంలో మాటా మాతా పెరిగి కొట్టుకుని చివరకు పోలిస్ స్టేషనులో కేస్లు పెట్టుకుంటే అక్కడి భక్తులు నివ్వెరపోయారు.  ప్రతి ప్రాతంంలో ఆ ఏరియాలో ఎన్నిక్కల్లొ పోటి చేద్దామనుకున్నవారు,పొలిటికల్ ఇన్ప్లూయన్స్ పెంచుకుందామనుకున్నవారు, తమ అనుచరులను పురిగొల్పి లక్షలు వసూల్ చేసి,దేవుని పెరు మీద అటు ప్రక్రుతి దేవతలను ఇటు మత సాంప్రదాయలను మంటగలుపుతున్నారు. ఇపట్టికైన దేవున్ని దేవుడు లాగే కొలిచి ఆయన క్రుపను పొందo డి . లేకుంటే ఏదొ ఒక రోజు ఈ అట్టహాస రాజకీయ తత్వాన్ని ఆ దేవుడే నిమజ్జనం  చేస్తాడు. ఇది తద్యం.                         
ఇదేనా దేవుడిని నిమజ్జనం చేసే పద్దతి? ఎంత అపచారం? 
                                                                 
                                             (30/9/2012 Post Republished)

Comments

  1. మఠాధిపతులు పీఠాధిపతులనడిగే మనం ఇవన్నీ చేస్తున్నామా? స్వోత్కర్ష పరనిందమాని. ధర్మం కోసం ఎవరం ఏమిచేయగలిగినా ఆచరణద్వారా చెసి చూపాలి అంతే నమ్మా. మీ ఆవేదన అర్ధమయింది కానీ ఆచరణమాత్రమే నిలబడుతుంది.

    ReplyDelete
  2. మంచి చెడు తెల్సికూడ చెప్పలేని పెద్దలు ఎవరికి ఏమి కారు ఏమి చెయ్యలేరు అని ఒక కవి ఉవాచ. ఒక తప్పు జరుగుతుంది అని తెల్సిన వారు వారి, వారి స్తాయి అనుసారం దానిని సరిదిద్దడానికి ప్రయత్నించడం కూడ దర్మాచరణలో బాగమేనని పెద్దలు గ్రహిస్తారని మనవి. మాకు తెలిసిన దానిని మా బ్లాగు ద్వార, మతపెద్దలను జొక్యం చేసుకోవలసినదిగ కోరడమే మా యొక్క ఉద్దేశ్యం. మా ఆవేదన అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. ధర్మోరక్షతి రక్షితః
    మీధర్మాచరణకు ధన్యవాదములు . జైశ్రీరాం

    ReplyDelete
  4. నిజానికి అంత పెద్ద వినాయక విగ్రహాలు అనవసరం.కానీ అతి పెద్ద విగ్రహం అనే పేరుతో గిన్నిసు బుక్కులోకి ఎక్కాలనే పిచ్చి పట్టుకుంది జనానికి.మన దేవుళ్ళ పట్ల మనం చూపించుకోవాల్సిన భక్తిని కూడా వాడెవడో మెచ్చుకుంటే తప్ప తుత్తి ఉందటం లేదు.లడ్డూలనీ ప్రసాదాలనీ వేల్మపాటలో కొనుక్కోవడం ఒక ఫ్యాషన్ - లక్షల్లో కోట్లల్లో పోటీలు పడి.న్యాయార్జితాన్ని ఎవడయినా అట్లా దుబారా చెయ్యగలడా?అది ఖచ్చితంగా అన్యాయార్జితమే!గురువులు కలగజేసుకుని చెప్పినా వినే రకాలు కాదు వీళ్ళు,తోలుమందం బాపతు!

    ReplyDelete
    Replies
    1. నిజమే హరిబాబు గారు. మీరన్నట్లు తోలు మందం వారికి మతాదిపతులు చెపితే చెవికెక్కపోవచు. కాని చెప్పగా చెప్పగా కొన్నాలు కైనా పలితం ఉండకపోతుందా? మత ప్రక్రియలు విషయం లో కోర్టులు చెప్పేదానికంటె మఠాధిపతులు, పీఠాధిపతులు చెపితేనే ప్రబావంతంగా ఉంటుందని నా ఉద్దేశ్యమ్.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం