'డ్రైవర్ రాముడు' లు కంటే "డ్రైవర్ కీచక"లే ఎక్కువుగా ఉన్నారా?

                                                          
                                                                             
                                                                    

                                  అవుననే అనిపిస్తుంది ఈ  మద్య  మన రాష్ట్రం లో ఆడవాళ్ళపై జరుగుతున్నా అత్యాచార సంఘటనలు చూస్తుంటే.ఆంద్రుల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినిమానలో, లారీ డ్రైవర్ పాత్రలో నటించి డ్రైవర్ అనే వాడికి ఒక హీరో ఇమేజ్ ఇచ్చి సినిమాను సూపర్ డూపర్ చేసాడు. అదే "డ్రైవర్ రాముడు". అలాగే బాషా అనే సినిమాలో హీరో రజనీ కాంత్ కూడా  ఆటో డ్రైవర్ పాత్ర పోషించి, ఆటొ డ్రైవర్ లకు ఒక హీరో ఇమేజ్ ఇచ్చారు.కానీ వాస్తవ జీవితంలోకి వస్తే మనకు కనిపిస్తున్న వారు "డ్రైవర్ కీచక" లే! . డిల్లీ నిర్భయ కేసు లో , ఆంద్రా అభయ కేసు లో కూడా  దోషులు ,నిందితులు డ్రైవర్లే కావడం గమనార్హం.

    హైద్రాబాద్లో అభయ కేసు జరిగిన తర్వాత ఖమ్మంలో కూడా  ఒక వివాహితపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసారట !ఖమ్మం పట్టణం ప్రక్కనే ఉన్న రఘునాద పాలెంలో ఒక వివాహిత తన అమ్మమ దగ్గర ఉంటుంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమె తన భర్తతో గొడవపడి వచ్చి తన అమ్మమ దగ్గర ఉంటుందట. ఆమె కుమార్తె దసరా సెలవులకు ఆమె చెల్లెలు వద్దకు వెలితే , సెలవులు అనంతరం అమ్మాయిని తీసుకురావడానికి అమ్మమ్మ  వెళ్లిoదట. ఆ రోజు రాత్రి ఒంటరిగా ఆ వివాహిత ఉన్న పరిస్తితి చూసి ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మీద అత్యాచారం చేసారట. పాపం ఆమె తన అమ్మమ్మ వచ్చాక విషయం చెప్పి ఊరి పెద్దల సహకారంతో ఆ ఇద్దరు ఆటోడ్రైవర్ ల మీద కేసు పెడితే, పోలిసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదీ ఖమ్మంలో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆటో డ్రైవర్ల కద.

     ఇలాంటిదే కరీంనగర్లోను జరిగింది. తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి దసరా సెలవులకు ఇంటికి వచ్చి, తిరిగి వెళుతూంటే ,ఆమె బాబాయి ఒక ఆటోలో ఆమెను హాస్టల్కి పంపిం చాడట. ఆ ఆటో వాడు ఆ అమ్మాయిని హాస్టల్కి తీసుకు వెళ్ళకుండా దారి మళ్ళించి , ఒక నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచార యత్నం చేయబోతే ఆ పిల్ల ఎలాగో తప్పించుకుని ఏడ్చుకుంటూ దగ్గరి ఊర్లోకి వస్తే వారు పోలిస్ లకు సమాచారం అందిస్తే కేసు పెట్టి విచారణ  చేస్తున్నారట. ఇది కరీం నగర్ లో ఒక ఆటో డ్రైవర్ దుష్క్రుత్యం .

  ఇలా కేసులు వివరాలు తీస్తే ఎక్కువ శాతం డ్రైవర్ లే ఈ  ఘోరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? డ్రైవర్ లకి ఆడవాళ్ళు అంటే అంత చిన్న చూపు ఎందుకు? వారి వ్రుత్తి ప్రకారం ఎక్కువ సమయం బయట గడుపుతారు. చిల్లర మల్లర గా తిరిగే బేవార్స్ గాళ్ళ స్నేహితాలు ఎక్కువ. మీరు గమనించండి. కొంత మంది ఆటో డ్రైవర్ ల ప్రక్కనే పని పాట లేని జులాయి గాడు ఒకడు కూర్చుని ఉంటాడు. ఆటొ పోతున్నంత సేపు వారు ఏవో కహానీలు చెప్పుకుంటూనే వుంటారు. వారు తిరిగే ప్రాంతంలోని వ్యభిచారం చేసి పొట్ట పోసుకునే ఆడవాళ్ళ గురించి వారికి బాగా తెలిసి ఉంటుంది. అటువంటి వారిని చూసి, చూసి ఆడవాళ్ళు అంటే ఒక నీచమైన అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఒంటరిib kv JN గా ఆడవాళ్ళు రాత్రి పూట కనపడినా వారు వేరే బావనతోనే ఆలోచిస్తారు. అలాగే మగ తోడు లేని వారు అన్నా అదే బావం కావచ్చు. ఏదేమైనా" కూసే గాడిద వచ్చి మేసే గాడిద ను చెడగొట్టినట్లు" ఏ  పనీ పాట లేని నీచ మిత్ర సాంగత్యం వలననే మంచి డ్రైవర్లకు కోడా పాడు బుద్దులు పుడుతున్నాయి.  అనుకుంటా .

     మొత్తానికి హిందీ లో" కీచ్" అంటే గుంజటO ,లాగటం అని అర్దం ఉంది. ఒంటరిగా ఆడపిల్లలు కనపడితే చాలు వారిని ఏదో విదంగా తమ వాహనాలలోకి  లాగి వారి మీద అత్యాచారాలు చేసే వారిని కీచకులు అనటం లో తప్పు లేదు. అందుకే వారు "డ్రైవర్ కీచక". లు. ఇటువంటి కీచకుల భరతం పట్టడానికి "నిర్భయ" యే ప్రస్తుతం ఉన్న అవకాశం.దానిని కూడా  మరికొంత సవరణ చేసి  అత్యాచార నేరానికి "ఉరి" ని శిక్షగా ఖరారు చెయ్యాలి . అప్పుడు కాని కొంత బయం నేరస్తులలో కలుగుద్దేమో చూడాలి .  నేను ఇంతకు ముందు ఒక టపా ప్రచురించినపుడు ఇదే విషయమై ఒకరు వ్యాఖ్యానించారు . ఆ టపాను క్రింద లింక్ గా ఇవ్వడం జరింగింది . చూడగలరు.

     http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_26.html  

                                                            (24/10/2013 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం