లైంగిక వేదింపులు లేకుండా ఆడవాళ్ళు ఆపీసుల్లో పనిచెయ్యాలంటే 66%శాతం మంది మగాళ్ళని జైలులో పెట్టాల్సి వస్తుందా?
అవుననే అనిపిస్తుంది ఈ ఆన్లైన్ సర్వే లు చూస్తుంటే .ప్రపంచ వ్యాప్తంగా మహిళా జర్నలిస్ట్లు తమ వ్రుత్తి రీత్యా ఎదుర్కొంటున్న "లైంగిక వేదింపులు" మీద 'ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా పౌండేషన్',మరియు 'ఇంటర్నేషనల్ న్యూస్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ' అనే సంస్తలు ఇటివల జరపిన ఆన్లైన్ సర్వే పలితాలు అనుసరించి నూటికి మూడింట రెండువంతుల మంది స్త్రీలు తమ బాసులు మరియు సహౌద్యోగుల చేతిలో లైంగిక వేదింపులకు గురి అవుతున్న వారెనట. వీరి సర్వే పలితాలు చూసిన తర్వాత ఇన్నాళ్ళు "మనువు" పుట్టిన మన దేశం లోని మగవాళ్ళు మాత్రమె స్త్రీల పట్ల తమ "మగబుద్ది" ని ప్రదర్శిస్తున్నారు తప్పా, తక్కిన దేశాల్లోని స్త్రీలు పురుషులతో పాటు సమానంగా చూడబడుతున్నారు అని నమ్మిన వారికి కను విప్పు కలగక మానదు. "మగబుద్ది " ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే అని ఈ ఆన్లైన్ సర్వే లు వెల్లడిస్తున్నాయి.
విచిత్రమైన విషయం ఏమిటంటే , ప్రాశ్చ్యత్య వస్త్ర దారణ వలనే మన దేశం లో లైంగిక వేదింపులు కానీ, దాడులు కానీ ఎక్కువ అయాయి అని కొంత మంది సాంప్రదాయవాదులు బావన. కానీ విదేశాలలోనూ స్త్రీల వస్త్రదారణ మీద అసహ్యకరమైన కామెంట్లు తప్పటం లేదని 46% మంది లేడి జర్నలిస్టులు వాపోయారట! కాబట్టి కనపడేలా ఉంటే కామెంట్ అనేది ఎక్కడైనా ఒకటే అన మాట! పాపం 23% మంది అయితే తాము బౌతికంగా లైంగిక వేదింపులకు గురి అయ్యామని చెప్పారట! ఇవ్వన్నీ "స్లేట్" అనే డైలీ వెబ్ పత్రిక లో ప్రచురించారు. పూర్తీ ఆర్టికిల్ కోసం క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే నూటికి 75% మంది స్త్రీలు తమ పట్ల మగ ఉద్యోగులు ప్రవర్తించిన లైంగిక వేదింపులు గురించి కేసులు పెట్టడం లేదట! ఇది కేవలం లేడి జర్నలిస్టులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు అందరూ ఎదురుకొంటున్న సమస్య . అయినప్పటికి 75% మంది," మగబుద్దే" అంత అని సరిపెట్టుకుంటున్నారు. మరీ వారి ప్రవర్తన విపరీతమైనప్పుడే విషయం కేసులు దాక వెళుతుంది. ఇది లైంగిక వేదింపులు కే కాదు ఇతర నేరాలుకు సంబందించి ప్రజలు ఇదే దోరణి అవలంబిస్తారు. ఉదాహరణకు మన చట్టాల ప్రకారం తిట్టడం, బెదిరించడం కూడా నేరమే . అలా అని బెదిరించిన ప్రతి వారి మీద కేసు పెడితే ఈ దేశం లో జైళ్ళు వందల రెట్లు పెంచాల్సి ఉంటుంది. కాబట్టి చట్టాలు ఉన్నా కూడా ప్రజలు లో ఉన్న సంయమనం , ఓర్పు అనే గుణాలు వారిని కొంతవరకు కేసులు వరకు వెళ్ళకుండా చేస్తున్నాయి. మొన్నీ మద్య అరెస్ట్ అయిన తెహెల్కా తేజ్ పాల్ ఉదంతం లో కూడా బాదితురాలి తల్లి ఇదే మాట చెప్పి కూతురుని కేసు పెట్టకుండా చేసిందట! నిజంగా దేశ వ్యాప్తం గా ఈ విషయం రచ్చ అవ్వడం వాళ్ళ, గోవా ప్రభుత్వం తక్షణ స్పందన వలన తేజ్ పాల్ కట కటాల్లోకి వేళ్ళాడు తప్పా, బాదితురాలి పోర్స్ వలన కాదు. అలా అని చెప్పి , తేజ్ పాల్ చేసింది క్షమించదగిన చర్య అని అనటం లేదు. అతను ఎంత నీచంగా ప్రవతిర్తించాడు అనేది మాటల్లో చెప్పేది కాదు. అందుకే దేవుడు తప్పించుకోలేని విదంగా కేసులో తనకు తానై ఇరుకున్నేలా చేసాడు. ఈ విషయం లో అతని ఆడ స్నేహితులు ఏమి చెయ్యలేక పోయినా ,అతని కుటుంబమే అతన్ని కాపాడుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఇంట్లో బార్యలను నిర్లక్ష్యపరచి, ఇతర స్త్రీల కోసం వెంపర్లాడే మగవాళ్ళకు తేజ్ పాల్ ను చూసి బుద్ది తెచ్చుకుంటే మంచిది.
కాబట్టి "మగబుద్ది" వలన పరువు గల స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా మానసికంగా బాదపడుతున్నారు. ఆ పరువును ద్రుష్టిలో పెట్టుకునేకావచ్చు, ఓర్పు వలన కాని 75% మంది కేసులు పెట్టడం లేదు. ఒక వేళా స్త్రీలుకు ఓపిక నశించినా , తమ పరువు పరదాను తొలగిఇంచినా నూ టికి మూడింట రెండు వంతుల మంది మగవాళ్ళు జైలులో మగ్గవలసిందే! కాబట్టి స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు ఉండాలంటే క్రమశిక్షణ తో కూడిన కుటుంబ వ్యవస్తే కరెక్టు. మగబుద్దిని మార్చ గలిగేది కుటుంబం ఒక్కటే . చిన్నప్పటి నుంచి స్త్రీలను ఎలా సమానంగా ,గౌరవం గా చూడాలో తల్లితండ్రులు నిరంతరం బోదతో ఎంతటి మగబుద్దిని అయినా మార్చవచ్చు. కానీ కుటుంబం అనేది స్త్రీల పాలిట శాపం లాంటిది అని ఊదరగొట్టే వాదాలు,కుటుంబ వ్యవస్థ విచ్చిన్నానికి తోడ్పడే చట్టాలు కుటుంభ వ్యవస్తను కూలదోస్తున్నాయి. మరి మగబుద్దిని మార్చేది ఏమిటి? కఠిన శిక్షలు యేనా ? అదే నిజమయితే అరబ్ దేశాలలో మగవాళ్ళు బద్ది కలిగి ఉండేవారే! కాబట్టి బలమైన, క్రమశిక్షణా యత మైన కుటుంబ వ్యవస్తే స్త్రీ, పురుషులకు శ్రీ రామ రక్షనిస్తుంది.
http://www.slate.com/blogs/xx_factor/2013/12/03/sexual_harassment_in_journalism_a_new_study_shows_that_the_majority_of_female.html
(5/12/2013 Post Republished).
Comments
Post a Comment