అన్నదమ్ములుగా విడి పోదాం! బావా బామ్మార్దులు లా కలసి ఉందాం!

                                                            
                                                                  
                                                                 
     
                                                                    
   "అన్నదమ్ములు చావు కోరు, బావ బామ్మార్దులు బ్రతుకు కోరు" అని జన ఉవాచ. అలాగే ఉంది మన తెలంగాణా సీమాంద్ర రాజకీయ,ఉద్యోగుల, విద్యార్దుల పరిస్తితి. ఎందుకంటే అన్న దమ్ములు మద్య రక్త సంబందం తో పాటు ఆస్తులు మీద హక్కులు లాంటివి ఉంటాయి. వారిలో అర్దిక పరమయిన విబేదాలు లేనంత కాలం ఎటువంటి సమస్యను అయినా వారు సునాయాసంగానే పరిష్కరించుకోగలుగుతారు.వారిలో ఉండే సహజ రక్త సంబందం అందుకు దోహదం చేస్తుంది. కానీ ఒక్క సారి ఆర్దిక పరమయిన ఆసక్తులు వారి మద్య బేదాలుకు కారణాలు అయితే బేదాభిప్రాయాలు సమసిపోవడం అంత సుళువు కాదు.రాజ్యాల కోసం అన్న దమ్ములు  కుత్తుకలు కత్తిరించిన చరిత్ర మనిషిది. ఆస్తులు కోసం శాశ్వత శత్రువులుగా మారీ ఆ శత్రుత్వ వారసత్వాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కుటుంబాలు మన గ్రామీణ భారతంలో కో కొల్లలు.వీటన్నిటికి మూల కారణం, సమస్య ఎర్పడినప్పుడు తొందరగా ఆ సమస్యకు చిత్త శుద్దితో  పరిష్కారం చూప గల పెద్ద మనుషులు వారి మద్య లేక పోవడం కావచ్చు. ఒక వేలా ఉన్నా ఆ అన్న దమ్ములు వారి మాటలు వినక పోవడం కావచ్చు. ఏది ఏమైనా అంతిమంగా నష్టపోయేది ఇరువైపులా కుటుంబాలలోని సబ్యులందరూ అనేది సత్యం.

   ఇక పోతే బావా బామ్మర్దులు విషయానికి వస్తే, ఆడబిద్ద పసుపు కుంకాలతో పదికాలాలు చల్లగా ఉండాలనే సోదర బావం,బావ కి ఇచ్చేదేదో ఒక్కసారే కట్న కానుకల రూపంలో ఇచ్చేస్తారు కాబట్టి, అర్దిక పరమయిన సమస్యలు ఏమి వారి మద్య ఉండవు కాబట్టి బామ్మర్దులు ఎప్పుడూ అక్కా బావలు చల్లగా బ్రతకాలని కోరుకుంటు ఉంటారు . అయితే ఈ మద్య భారతీయ వారసత్వ  చట్టాలలో  సవరణలు వచ్చి, ఆడపిల్లలకు కూడా పూర్వికుల ఆస్తుల్లో వాటా హక్కులు వచ్చాక,వారి మద్య కూడా కీచులాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏతా వాతా మనం అర్దం చేసుకోవలసింది ఏమిటంటే మానవ సంబదాలను ప్రబావ పరచే విషయాలలో ఆర్దిక పరమైనవి ప్రదాన పాత్ర పోషిస్తాయి కాబట్టి, అటువంటి సమస్యలను ఎంత తొందర్గా తేలిస్తే అంత మంచిది.

   ఆంద్రా తెలంగాణా ప్రజలు, బలమైన రాజులు పరిపాలనా కాలంలో కలిసి ఉన్నారు. రాజు బలహీనుడు అయి నప్పుడు విడిపోయారు. ఆ క్రమంలో వారి బాషా, సంస్క్రుతులు మద్య కొంత వైరుద్యం ఏర్పడి ఉండవచ్చు. భారత దేశం లోని ప్రజలను బాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించి పరిపాలించాదానికి కారణం, ఒకే బాషా మాట్లాదే ప్రజలు మూలాలు ఒకటే కావడం వలన వారు కలిసి మెలిసి జీవించడం సాద్య పడుతుంది అని పెద్దలు ఆలోచించడమే. అది నిజంకూడా. కాలాంతరాన వచ్చిన యాసలు లాంటి వైర్యుద్దాలు సక్యతకు పెద్ద అవరోదం కాదని బావించి అలా చేసి ఉండొచ్చు.అది నిజమే అయినప్పటికి, స్వార్ద పర రాజకీయాలు ఉన్న సమాజంలో చిన్న  సమస్య కూడా బూతద్దంలో చూపబడి పెద్ద సమస్య అవుతుందని పెద్దలు ఆలోచించక పోవడమే వారు చేసిన తప్పు. ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక ముందుగా చెయ్యల్సింది ఇరు ప్రాంతాల ప్రజలు మద్య వైవాహిక సంబందాలు అభిరుద్ది పరచడం. ఎంతో మంది ప్రజలు ఆంద్రా నుంచి తెలంగాణాకు వలస వచ్చినా , వివాహా సంబందాలు కలుపుకోవడం లో తమ ప్రాంతం వారికే ప్రాదాన్యత ఇచ్చారు. కారణం తెలంగాణా వారు సాంస్క్రుతికంగా తమకంటే తక్కువ వారనే బావన. అదే విదంగా తెలంగాణా వారు కూడా అదే పాలసీని అనుసరించారు. కారణం తమ కంటే తెలివిగల వారైన ఆంద్రా వారు కపట మనస్తత్వం కలిగి ఉంటారు అనే అపోహ కావచ్చు. లేక వారితో తాము సరితూగం అనే ఇన్ఫియార్టీ బావనలు కావచ్చు. వీటన్నింటికి ముఖ్య కారణం చదువు సంద్యలలో తెలంగాణా వారి వెనుక బాటు తనం.

   పిల్లలు చదువుకుని, విద్యాదికులు అయి ఉద్యోగా అవకాశాలు కోసం హైదరాదుకి వెళ్ళడం మొదలయ్యకే కొంచం ఆంద్రా తెలంగాణా ప్రజలు మద్య అవగాహాన పెరగడం మొదలైంది. అసలు N.T.R .. రాక ముందు హైదరాబాద్  నిజాముల రాజధానిగానే అనిపించేది తప్పా, తెలుగు వాళ్ళ రాజ దానిగా అనిపించేది కాదు. అలా మారడానికి బలమైన నాయకత్వం అవసరం . ఆ నాయకత్వానికి ఇరు ప్రాంత ప్రజల జీవణ ప్రమానాలను అభివ్రుద్ది చెయ్యడమే కాక, రెందు ప్రాంతాల ప్రజల మద్య ఉన్న సాంస్క్రుతిక వైరుద్యాలను రూపు మాపాలన్నా ఆలోచన కూడ అవసరం. కానీ తెలుగు ప్రజల దురద్రుష్టం అటు వంటి ఆలోచనలు ఉన్న నాయకులు తక్కువ. ఉన్న వారికి ప్రజలను శాసీంచగల చరిష్మా లేదు. అందుకే రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే స్వార్ద రాజకీయ వాదులదే పై చేయి అయింది.ఆలోచనా రహితంగా ఆర్దిక అభివ్రుద్ది జిల్లాల వారీగా కాక కేవలం రాజదాని నగరంలొనే కేంద్రిక్రుతం చెయ్యడం వల్ల, చివరకు విడి పోయే స్తితికి తెలుగు వారు నెట్టబడ్డారు. ఇప్పుడు అటు ఆంద్రా వారికి రాజధాని నగరం గుండే కాయ అయితే తెలంగాణా వారికి మెడకాయ. ఒక వేళా హైద్రా బాద్ ఆంద్రా వారు అంటున్నట్లు కేంద్ర పాలిత్ ప్రాంతం చేస్తే తెలంగాణా వారు మరో వంద సంవత్సరాల వెనక్కి నెట్టి వేయబడిన వారు అవుతారు.కానీ కేంద్రం వారు మాత్రం ఎదో రకంగా హైద్రబాద్ ని U.T.  చెయ్యాలనే  ఉద్దేస్యం తోనే ఇంత తొందరగా రాజకియ డ్రామాలకు తెరదీసింది అనిపిస్తుంది కాబట్టి దీనికి పరిష్కారం ఎలా ఉండాలో మరొక టపాలో చూద్దాం.        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!