నలుగురు ని రేప్ చేసారు ! పాపం పండి అయిదో రేప్ కి అరెస్ట్ అయ్యారు !

                                                                 
  
                                                                 
మొన్న ముంబాయి శక్తి మిల్ ప్రాంతం లో మహిళా పోటో జర్నలిస్ట్ మీద లైంగిక  దాడీ జరిపిన అయిదుగురు పట్టుబడ్డారు. అందులో మొదటి నిందితుడు అయిన గాంగ్ లీడర్ మహమద్ ఖాసీమ్ హఫీజ్ షేఖ్ చెప్పిన దాని ప్రకారం అదే శక్తి మిల్ ప్రాంతం లో గత ఏడాది  కాలం లోపు వారు నలుగురు అమ్మాయిలను సామూహిక మాన భంగం చేసారట! కానీ వారెవరూ కేసులు పెట్ట లేదు. కారణాలు ఏవైన కావచ్చు. ఇందులో జనాలు తెలిసికోవల్సిన అంశం ఒకటే, ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు, ఒంటి మీద బంగారం ఉన్న వారు వాటి రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, అన్ని జాగ్రత్తలు ప్రతి స్త్రీ వారి కుటుంబ సబ్యులు  తీసుకోవలసిన అవసరం ఉంది.

వివిద సమయాల్లో నలుగురు అమ్మాయిల్ని రేప్ చేస్తే, ఒక్కరైన కేసు పెట్టలేదు సరి కదా , కనీసం వారి తాలుకు బందువులు ఆ మదాందుల్ని ఏమి అనకుండా నోరు మూసుకున్నారు అంటే ఖచ్చితంగా వారు సమస్యలకు బయపడే మనస్తత్వం కలవారైన అయి ఉండాలి ,లేకుంటే అటువంటి  నిర్జన ప్రాంతానికి వెళ్ళడం లో వారి తప్పు కూడ ఉండి ఉండాలి. అందుకే రేపిస్ట్ ల దుశ్చర్యలు  వెలుగులోకి రాలేదు. కానీ మొన్న పోటో జర్నలిస్ట్ దైర్యవంతురాలే కాక వివేక వంతురాలు అనిపిస్తుంది. నిర్భయ కేసులో మాదిరి కాకుండా అనువు కాని వేళ ఒదిగి ఉండి, తర్వాత కేసు పెట్టడం ద్వారా  ఆ పాపాత్ముల ఆగడాలకు అరికట్ట వేయించ గలుగుతుంది. ఈ  కేసులో ఇంకా కొన్ని నిజాలు వెలుగు లోకి రావాల్సిన అవసరం ఉందనిపిస్తుంది .

 రేప్ జరిగిన తర్వాత,నిందితులు సాక్ష్యాలు లేకుండా చేసి, ఆ తర్వాత బాదితులతో తాము బాదితుల సొమ్ములను ఏమి తీసుకోలేదు అని, చెక్ చేసుకోండని చెప్పి అమ్మాయి మొబైల్ అమ్మయికి ఇచ్చి, కొంత దూరం అంతా కలిసే నడచి ఆ తర్వాత  నిందితులు పారి పోయారట! అమ్మాయి కూడా హాస్పిటల్ లో జాయిన అయ్యాక తన తల్లిని బట్టలు అవి తీసుకుని హాస్పిటల్ కి రమ్మని చెప్పిందట!ఈ కేసులో దోషులకు త్వరగా శిక్షీమ్చాలని, తాను త్వరగా కోలుకుని తన ఉద్యోగానికి వెళ్ళాలని ఉన్నట్లు బదితురాలు చెప్పింది .శబాష్! అదే దైర్యం ప్రతి బాదితురాలలో ఉండలి. రేప్ అనేది సమాజానికి మాత్రమే కాక జాతి అభిమానానికి వ్యతిరేకంగా జరిగే నేరం .ఇందులో బాదితులు తలవంచుకోవలసిన పని లేదు. ఒక ప్రాంతం లో రేప్ జరిగితే ఆ ప్రాంత రక్షణాదికారి నుంచి రాష్ట్రపతి వరకు సిగ్గుతో తల వంచుకోవాలే తప్పా, బాదితులు మాత్రమ్ కాదు.  మానసికంగా చెడిపోనంత వరకు శారీరక గాయాలు మనిషిని ఏమి చెయ్య లేవు. కానీ నిర్బయ కేసులలో మాదిరి ఒక్కో సారి మానబంగం ప్రాణ హాని కి దారి తీస్తుంది కాబట్టి,పైన చెప్పినట్లు స్తిలు వారి కుటుంబ సబ్యులు రక్షణ విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం  మంచిది.               

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

వారిది"కులబద్దం",వీరిది"రాజ్యాంగబద్దం".

స్త్రీ స్వేచ్చ