కాబోయే హైద్రాబాద్ గవర్నర్ శ్రీ శ్రీ శ్రీ చిరంజీవి!!!?

                                                               


  ఆంద్ర ప్రదేశ్లో ,సీమాంద్ర  ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.వారి లక్ష్యం సమైఖ్య ఆంద్రప్రదేశ్. హైద్రాబాద్ సెటిలర్స్, కొంతమంది రాజకీయ నాయకులు తప్పా, హైద్రాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగ చెయ్యమని సీమాంద్ర ప్రాంతం వారు అడగటం లేదు. ఇక హైద్రాబాద్ లేని తెలంగాణా తల లేని మొండెంతో సమానం కాబట్టి తెలంగాణా వారు  అట్టి   ప్రతిపాదనను కలలో కూడా అనుకోరు. కాని నిన్నటి దాక సూర్యుడిలా మండి  పోయి, పరిస్తితుల ప్రబావానికి బిక్కచచ్చి, సోనియమ్మ దయతో టూరిజం మంత్రి అయిన చిరంజీవి గారు మాత్రం హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నూటికి ఎనబైమంది  శాంతిస్తారని ఎలా సోనీయమ్మకు చెప్పారో అర్దం కావడం లేదు. నిన్న నలబై అయిదు నిముషాలు ప్రత్యేకంగ సోనియా గాంది గారితో సమావేశమై బయటకు వచ్చిన చిరజీవి గారు పలికిన చిలక పలుకుల్లోని సారాంశం అదే!

 తాను మేడం సోనియాకు సవినయంగా సీమాంద్ర ప్రజల ఆందోళనలు గురించి చెప్పానని, అది విన్న మేడం ఆల్రడి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయిపోయింది కాబట్టి, అది తప్పా సీమాంద్ర వారికి కావలసినది ఏమిటో చెపితే దానిని అనుగ్రహిస్తానని అన్నారని, దానికి సమాదానంగ "అమ్మా, సీమాంద్రులకు హైద్రాబాద్ మీద ఆశ తో సమైఖ్యత ఆందోళనలు చేస్తున్నారు కాబట్టి కనీసం హైద్రాబాద్ ని U.T  చేస్తే నూటికి ఎనబై శాతం శాంతించవచ్చు అని తాను చెప్పాను అని, ఇక జరగబోయేది కూడా అదేనని శ్రీ,శ్రి,శ్రీ, చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంతకి చిరంజీవి గారు సోనీయ గారికి ఈ ప్రతిపాదన చేసారా,లేక సోనియాగారే తన మనసులోని మాటను చిరంజీవికి చెప్పి, దీనికి సీమాంద్ర ప్రజలను నాయకులు ఒప్పిస్తే, తెలంగాణ నాయకులను కేంద్ర నాయకులు ఒప్పిస్తారని చెప్పిందా ,అనేది చిదంబర రహస్యం. మొత్తానికి చిరంజీవి గారికి నలబై అయిదు నిముషాలు సమయం కేటాయించడం, చిరంజీవి గారి గ్రేట్నెస్సో, మేడం గారి కైండ్నెస్సో ఆ పెరుమాళ్ళ కెరుక.

 "లాభం లేనిదే శెట్టి వరదకు బోడు" అని సామెత. ఇంత తొందరగా ఏక వ్యాఖ్య తీర్మానంతో తెలంగాణా ఏర్పాటు ప్రకటించినపుడే ఎవరికైనా అనుమానం రావాలి. అదికేవలం  సోనియా గాంది కుమారుడిని ప్రదానిగా చేసేందుకు మాత్రమే జరిగిన కుట్రలో బాగం కాదు. అంతకు మించిన మతలబ్ ఉంది. అదే హైద్రాబాద్ని U.T.   గా చెయ్యడం గురించి కావచ్చు. దీని వెనుక ఎన్ని కోట్ల డబ్బులు చేతులు మారాయో!. సెటిలర్స్ లోని సంపన్న వర్గాలే కాక, తెలంగానా నాయకులు పాత్ర కూడా ఇందులో ఉండి ఉండవచ్చు అనే అనుమానం కలుగుతుంది .లేకుంటే తెలంగాణా ప్రకటీంచిన రెండవ నాడే "సీమాంద్ర ఉద్యోగులు హైద్రాబాద్ లో ఉండటానికి వీలు లేదనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాసిన అవసరం కాని, సీమాంద్ర ఉద్యోగుల ఆందోళనలకు పోటిగా ఉద్యమాలు చెయ్యాల్సిన అవసరం గాని తెలంగాణా నాయకులు కు ఎందుకు వచ్చింది? అటు వై.సి.పి. పార్టి వారి "సమ న్యాయం" డిమాండ్లలో అర్దమ్ ఏమిటీ? నిన్న చిరంజీవి గారి మాటల్లో దొర్లిన "సమన్యాయం" పదమ్ యాదలాపం అనుకోవాలా?ఇవ్వన్నీ ఆలోచన చెయ్యగల్గిన వారికి కలిగే సందేహాలు .
   ఏదో తెలుగువారిని ఉద్దరిస్తాడని అభిమానులే కాదు,యావత్ ఆంద్రప్రదేశ్ ఆశ పడినందుకు వారికి మంచి శాస్తి చేస్తున్నాడు చిరంజీవి గారు. స్టాలిన్ లాగా మండిపోతాడు అనుకుంటే దైన్యం నిండిన ముఖంతో , అమ్మ పాదాల చెంత ఒదిగిపోయి, "అమ్మా, మేము తెలుగువాళ్ళం,మమ్మల్ని మేము పరిపలించుకునే   తెలివి లేని వాళ్ళం. ఆరంభ్హ శూరులం.అందుకు నేనే ఉదాహరణ.ఒకరంటె ఒకరికి గిట్టదు. మా జాతిని ఏక తాటి మీద నడపగలిగిని మగతనం ఉన్న వారు ఎవ్వరూ లేరు. పోనిలే ఎవరో ఒకరూ మా తమ్ముల్లే గా, తింటే  తిన్నారులే అనే త్యాగ గుణం కూడా మాలో లేదు. కాబట్టి మా లాంటి వారికి "నిర్బయ" ని కాపాడలేని మీ లాంటి కేంద్ర పెత్తనమే కావాలి. మీ కనుసన్నలలొ ఎలాగో మా బ్రతుకులు వెల్ళదీస్తాం తల్లీ," అని దీనం గా ప్రార్దిస్తుంటే అమ్మలో కరుణ ఉప్పొంగి హైద్రాబాద్ ని  U.T చేసి దానికి చిరంజివి  గారిని  దానికి గవర్నర్ గా చేస్తుందేమో!
    ప్రజలను రెచ్చగొట్టి  వీదుల్లోకి వచ్చేలా చేసి,దాన్ని బూచిలా చూపి సంపన్న వర్గాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకునే ఈ కుహనా రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టగలిగిన వారి కోసం యావత్ తెలుగుజాతి ఎదురు చూస్తుంది.            

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన