మనo నడవ వలసింది "గ్రామ స్వరాజ్యం" వైపు కాదు, నగర రాజ్య స్తాపన వైపు !

                                                         



                                                        

మంచో ,చెడో మన రాష్ట్ర విబజన ప్రక్రియ మొదలయింది . దానిని ఉద్యమాల ద్వారానో , కోర్టు ప్రక్రియల ద్వారానో , మరే రాజకీయ ప్రక్రియల ద్వారానో నిలువరించే చర్యలను మాని , మన తెలుగు జాతి అబ్యున్నతికి ఏమీ చేస్తే బాగుంటుందో ఆలోచిస్తే మంచిదనుకుంటా.

   మనం రెండు రాష్ట్రాల ప్రజలుగా విడగొట్ట బడినంత  మాత్రాన మన మద్య ఉన్న కుల, మత , బాషా , సంబందాలు మనల్ని విడి పోనియవు . తెలంగాణా ,అంద్రా అనే బావం ఆప్ట్రాల్ నిన్న మొన్నటిది . కాని మన సామాజిక సంబందం వేల సంవత్సరాల నుండి మన మద్య పెన వేసుకుని అది మన అణువు అణువు  లో నిక్షిప్తం అయి పోయింది . ఆ అణువుల స్పందనే నేడు ఆంద్రా వారు చేస్తున్న ఉద్యమ ప్రక్రియలు. మరి నిన్నటి వరకు తెలంగాణా వారు చేసిన ఉద్యమం దేనికి సంకేతం అని అడగవచ్చు . అది కూడా  అన్నదమ్ములు , అక్క చెల్లెళ్ళ మద్య  సహజ బావోద్వేగాల చర్యలుగానే గుర్తించాలి .ఒక   ఇంటిలో పెద్ద కొడుకు అన్నింటిలో పెత్తనం చెలాయిస్తూ ,చిన్న వారిని నిర్లక్ష్యం చేస్తే గొడవలు కావడం ఖాయం . అదే సమర్దుడైన తండ్రి లేక తల్లి ఉంటే ఆ బేదాభిప్రాయలు రూపు  మాపడానికి తగిన చర్యలు తీసుకుని కుటుంబాన్ని కాపాడతాడు . చేత గాని వారు కుటుంబ పెద్దలుగా ఉంటే "ఒరే మీ గోల  నేను పడలేను . ఉన్నది పంచుకుని ఎవరి దారిన వారు పొండి " అని సమస్య వదిలించేసుకుంటారు . అయితే ఒక స్తాయి వరకు ఉమ్మడి కుటుంబం ఆమోద యోగ్యమైన, కొన్ని తరాల తర్వాత కుటుంభ పాలన నిర్వహణ బారం కష్టం అవటం వలన, ఎదో ఒక దశలో విడగొట్టక తప్పదు . అది ఆ మొత్తం కుటుంభ సబ్యుల సంక్షేమం కోసమే తప్పా , కొంతమందికి మేలు చెయ్యడానికి మిగతా వారిని బలి చెయ్యటానికి మాత్రం కాదు .

     ఒకప్పుడు కలసి ఉన్న ఉమ్మడి కుటుంబాలే మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉండేవి . ముఖ్యంగా వ్యవసాయాదారిత కుటుంబాలకు ఉమ్మడి కుటుంబమే శ్రేష్టమైనది . కాని సాంకేతిక విజ్ఞానం పెరిగి , ప్రజలలో విద్యా విజ్ఞానం , కోసం వలస పోవడం తప్పని సరి అయినప్పుడు ఉమ్మడి  కుటుంబ జీవనం  అసాద్యం . కానీ మానవుని సాంకేతిక విజ్ణాన అభివృద్ధి వలన బౌతికంగా కలసి ఉండలేకపోయినా నిరంతర సమాచార సంబడం కలిగి ఉండి ,  మానసిక సంబందం పీంపొందించుకుంటున్నారు . కాబట్టి ఉమ్మడి బౌతిక కుటుంభ వ్యవస్థ స్తానంలో ఉమ్మడి మానసిక కుటుంబ వ్యవస్థ వచ్చింది .అందుకే మన పిల్లలు దూర దేశాలలో ఉన్నా మనమెవ్వరం బాదపడటం లేదు . కారణం మన మద్య ఉన్న మానసిక బందమే కాక రోజూ  అంతర్జాల విదానం వలన వారితో ప్రత్యక్షంగా
 సమాచార సంబందం కలిగి ఉండటమే !

   దేనికైనా మార్పు సహజమే కాక అనివార్యం కూడా . మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా , మానవీయ విలువలకు బంగం కలగని రీతిలో మనం మన నడక  మార్చుకోవాలి . అలా చెయ్యడమే మన లోని విజ్ఞతకు నిదర్శనం .పూర్వం మనవి వ్యవసాయాదారిత కుటుంబాలు కాబట్టి మన రాజ్య వ్యవస్థ కూడా  దానికి అనుగుణంగా
"గ్రామ స్వారాజ్య వ్యవస్థ " ఉండాలని కోరుకున్నాం . కాని ప్రస్తుతం మరియు బవిష్యత్తులో కూడా  వ్యవస్సాయం  అనేది "హరిత విప్లవం " వలన ఇరవై శాతం మంది ప్రజల బాగస్వామ్యంతో , ఆదునిక యంత్ర సహయంతో నిర్వహించడం సాద్యపడుతుంది . కాబట్టి గ్రామ వ్యవస్థ వలన కొన్ని లక్షల ఎకరాల సాగు భూమి గ్రామ కంఠ భూమిగా ఉండి పంట ఉత్పత్తికి పనికి రాకుండా ఉంది . మరి పెరుగుతున్న జనాబాకి అనుగుణంగా పంటల దిగుబడి పెంచటం మాత్రమే కాక , సాద్యమైనంత వరకు యోగ్యమైన భూమిని సేద్యం లోకి తేవాలి . దానికి అనుగుణమయిందే "నగర రాజ్యాల వ్యవస్థ ". దీనిని గురించి వివరంగా వేరొక టపాలో చెపుతాను .

    ప్రస్తుతం మనం తెలిసికోవలసింది ఏమిటంటే  మన నగర వలస విదానం ఒక క్రమ పద్దతిలో పద్దతిలో కాకుండా వేలం వెర్రిగా "హైదరాబాద్ " వైపు సాగ బట్టి , ఇప్పుడు రాష్త్ర విబజన అంటే అందోళన  పడుతున్నారు . కాని అదే రాష్త్రం లోని అన్ని జిల్లా పట్టణాలు సమాన స్తాయిలో అభివృద్ధి చెంది ఉంటే ఈ  ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండేది కాక పోవచ్చు . ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు . ప్రస్తుతం తెలంగాణా పేరుతో రెండు రాష్ట్రాలుగా విడిపోయినా , మనం 23 నగర రాజ్యాలుగా మన "తెలుగు సీమ " ను మార్చుకుందాం . ఒక్కొక్క నగర రాజ్యం "సింగపూర్ " కంటే గొప్ప  అభిరుద్ది చెందాలి . ఇది సాదించడానికి  సంకల్ప దీక్షా పరులు జిల్లాకు ఒకరుంటే చాలు . అటువంటి నాయకత్వం మనకు లేదా ? ఆలోచించండి .ఎందుకంటే  మనలో ఒకప్పుడు "నగర రాజ్యాలు "  సమర్దవంతం గా ఏలిన  మన పూర్వీకుల రక్తం (D.N.A) ప్రవహిస్తుంది  మరి !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన