క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

                                                                                   

                                        అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ  ఈ పేరు కి  తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే   లేకపోతే  "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి  పరోక్షంగా హిందూ మతమే ఉపయోగపడింది అన్న మాట. హిందూ అనేది అన్ని మతాలూ వలనే ఒక మతం కాదని , అది ఒక ప్రత్యేక జీవన విదానం అని సుప్రీం కోర్టువారే చెప్పినప్పటికీ ,జ్ఞానం ఉండి సత్యం తెలుసుకోవడానికి  ఇష్టపడని  కంచ ఐలయ్య లాంటి లారు ఉద్దేశ్య పూర్వకంగానే హిందూ అంటె ఒక మతం అని చెప్పడం కోర్టు దిక్కారం క్రిందకే వస్తుంది.

  '[In our childhood] all of us, the Dalitbahujans of India, never heard the word "Hindu'-not as a word, nor as the name of a culture, nor as the name of the religion. We heard about Turukoollu (Muslims), we heard about Kirastaanapoollu (Christians), we heard about Baapanoollu (Brahmins) and Koomatoollu (Baniyas) spoken of as people who were different from us.' - Kancha Ilaiah

                         పై వ్యాక్యాలు  కంచ ఐలయ్య గారి పుస్తకం లోనివి. అయన చెప్పింది నిజమే కావచ్చు. ఆయన చిన్నప్పుడు  వ్యక్తులు కులాలు వారిగా గుర్తించబడ్డారు ఇప్పటికీ పల్లేటూల్లో కొన్ని చోట్ల అదే విదానం ఉంది. ఇక్కడ గుర్తించదగిన అంశం ఏమిటంటె స్తానిక ముస్లిం మతస్తులను  లను తెలుగు ప్రాంతాల్లో తురకోల్లు  అని, క్రిస్టియన్ మతం వారిని కిరస్తానీలు అని , స్తానిక మతాలను ఆచరించే వారిని సాంప్రదాయ కులాలు పేరుతో పిలిచే వారు. అందులో కంచ ఐలయ్య గారి కులం "కురుమ గొల్ల " కూడా ఒకటి. స్తానికంగా కూడా ఒక మతం అనేదే లేదు. శైవుO , వైష్ణవం , శక్తి , సాయిబాబా , అమ్మ తల్లులు ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తమ మత  విదానాలను ఆచరిస్తున్నారు.  ఎవరి మతాలూ వారికున్నా, వాటి ఆచరణ పద్దతులు వేరైనా వీరందరి జీవన విదానం యొక్క మౌలిక స్వరూపం ఒకటే . దాని పేరే "హిందూ ". కాబట్టే వారిది హిందూ జీవన   విదానం .  మరి ఈ జీవన విదానం లో బ్రతుకుతూ , నేనెట్ల హిందువు నైత అనే మాట ఎలా ఉంది అంటె  తండ్రి మీద అలిగి "నేనెట్ట ఆయన  కొడుకు నైత" అని తల్లిని అవమాన పరచినట్లు ఉంది. ఆయన హిందువే కాదనుకుంటె ఆయన కులం కురుమ గొల్ల వారినందరిని అవమాన పరచినట్లే . ఆయన పేరును ఏ జాన్ సన్ , మైకేలో పెట్టుకుని చూస్తే తెలుస్తుంది, హిందువు కాకపోతే ఆయన పేరుకు ఉన్న ఇమేజ్ ఏమిటో?

   ఇదే పెద్ద మనిషి మొన్న ఒక కార్యక్రమానికి వెళ్లి , వేదాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ఆ తెలివి B.C లకు లేదని , క్రిస్టియన్ లే ఆ పని చేయాలని సెలవిచ్చాడు. ఇది ఆయనను అయన అనుమానించుకుని అవమానించుకోవడమే. తను బోక B.C అయి ఉండి వేదాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని ప్రకటించుకుంటు , B.C  ల చేత కాదు అని అన్నాడంటే , తన జాతి మీదే తనకెంత అనుమానమో తెలియ చేసుకున్నాడు. ఈ  దేశం పుట్టిన వేదాలను వ్యతిరేకించాల్సిన దౌర్బాగ్య పరిస్తితి హిందూ జీవన విదానం లో జీవించే వారికి లేదు. ఒక సాంప్రాదాయం ప్రస్తుత పరిస్తితులకు  అనుగుణంగా  మార్పులు చేసుకోవడం లో మేదావి తనం ఉంటుంది కాని, పాత సాంప్రదాయం పాటించిన మీ తాతలు వెదవలు అంటే జాతి ఒప్పుకుంటుందా? ఈ  చిన్ని సూత్రం తెలియకనే కంచ ఐలయ్య లాంటి వారు చెప్పే కదలు కంచికి వెళుతుంటే , ప్రజలు తమ పూర్వికుల ను స్మరిస్తూ , వారు చెప్పిన దాంట్లో మంచిని గ్రహిస్తూ, అవసరం లేని దానిని త్యజిస్తూ ముదుకు సాగుతున్నారు. కనీసం తను చెప్పే దానిని తన కులస్తులే ఎందుకు పాటించలేదో ఒక్కసారి ఆలోచిస్తే తెలియక పోదు. కాని దానివలన అయన కేదో ఆర్దిక నష్టాలు వచ్చే అవకాశం ఉందనుకుంటా . అందుకే తనకు లాభం చేకూర్చే సంస్తలు , వ్యక్తులు దగ్గర, పడికట్టు పదాలు , పనికి రాని మాటలు చెపుతూ ఉంటారు.

     కంచ ఇలయ గారు ఇటివల జరిగిన ఒక సభలో దళితులను  క్రిస్టియన్ లను, తమ వారిని  గోదావరి మహా పుష్కరాలుకు వెళ్ళకుండా చూడాలని ఒక గొప్ప సలహా ఇచ్చాడు. దానిని లోకల్ క్రిస్టియన్ లు పట్టించుకోరు అనేది సత్యం. ఎందుకంటే వారిది హిందు జీవన విదానమే కాబట్టి. ఏసుక్రీస్తుకు అయినా కొబ్బరి కాయ కొట్టి , భక్తితో పూలు పళ్ళు సమర్పించే వారు ఇండియన్ క్రిస్టియన్ . వారు  హిందూ జీవన విదానం లో బాగమే. అటువంటి వారు పుష్కరాలకు వెళ్ళవద్దు అన్నా ఆగరు. వారి సంగతి అటు ఉంచి మన తెలుగు రాష్ట్రాల్లో మహా క్రిస్టియన్ గా బావిస్తున్న జగన్ గారే కంచ ఇలయ్య గారి మాటను ఆప్ట్రాల్ గా బావించి , గోదావరిలో మహా పుష్కర స్త్నానం చేసి , తన తండ్రి గారికి పిండ తర్పణలు వదలి తను అచ్చమైన ఇండియన్ క్రిస్టియన్ అని,తను హిందు జీవన విదానం లో బాగమే అని నిరూపించాడు. ఈ విదంగా కంచ ఐలయ్య గారి మాటలు ఈ సమాజానికి పనికొచ్చేవి కావని చెప్పకనే చెప్పాడు.

      తాతల మీద కోపంతో తన పుట్టకనే అవమానించుకునే కంచ ఐలయ్య గారి లాంటి వారిని ప్రజలు ఏ నాటికి పట్టించుకోరు అనేది సత్యం. సత్యం.
                      ( Republished post.)

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!