ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

                                                                 


                 భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .

                     పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్షణ విదానం స్త్రీలను అణచి వేసిందని ,అసలు స్త్రీకి గృహ వ్యవస్తే పెద్ద బందిఖానా అని బావిస్తున్న నేటి మోడ్రన్  స్త్రీ స్వేచ్చ వాదం స్త్రీలను ఇండ్ల తలుపు లు బద్దలు కొట్టుకుని  బయటి ప్రపంచం లోకి వచ్చేయాలని ప్రబోదిస్తుంది . అలా బయటకు రావడమే కాదు ,తనకు ఇష్టం వచ్చినట్లు విదంగా ఉండే స్వేచ్చ కూడా కావాలని కోరుతుంది . అలాగే స్త్రీ రక్షణ అనేది ఇంటి పురుషుల బాధ్యత గా కాకుండా ప్రబుత్వ బాధ్యతగా ఉండాలని బావిస్తుంది . స్త్రీ పురుషులు వేరు వేరు జాతులు అనే బావన అభివృద్ధి చెందేలా ,స్త్రీ జాతి రక్షణకు కుటుంబ రక్షణ కాదు , ప్రబుత్వ రక్షణె దిక్కు  అనే వితండ వాదం చెస్తుంది . మొత్తానికి ఇంటిలో ఉన్న స్త్రీని వీదుల్లోకి తెచ్చి, వారిని తమ వ్యాపార అవసరలాకు వినియోగించుకునేలా నయా వ్యాపార వాదులకు  ఉపయోగ పడుతుంది . ఈ రోజు ఇండియాలో లక్షలాది సెక్స్ వర్కర్లు ఉండటానికి మోడ్రన్ స్త్రీ స్వేచ్చా వాదమే కారణం అని నా బావన.


           నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచారం అనేది కోట్లాది రూపాయల  టర్నోవర్ బిసినెస్ గా మారి పోయింది . ఈ బిసినెస్ కి కావాల్సిన ముడి సరుకు ఇంటి రక్షణ కరువైన స్త్రీలు  .నిర్వహణ చేసేది కూడా స్వేచ్చా పరులైన స్త్రీలే . పైలా పచ్చీసుగా  మన్మద  సామ్రాజ్యం ఏలాలి అని ఉవ్విలూరే కొంతమంది  మగవాళ్ళకి, స్త్రీల మీద కంటే అప్పుడే వికసిస్తున్న బాలికలు మిద మోజు ఎక్కువ. ఎంత డబ్బు అయినా వెచ్చించి వారి బాల్యాన్ని కొనుగోలు చేసి చిదిమేస్తుంటారు . అలాంటి వారికి మోడ్రన్  స్త్రీ స్వేచ్చ ఎలా ఉపయోగ పడుతుందో క్రింది విడియోలో చూడండి . 15 యేండ్లు నిండని అమ్మాయిలూ రోజూ వందల మంది బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించబడుతున్నారు అంటె వారికి సాంప్రదాయ కుటుంబ రక్షణ కరువు కావడమే అని నేను బలంగా నమ్ముతున్నాను .స్త్రీలకు పురుషులతో పాటు సమాన స్వేచ్చా హక్కులు ఉండాలి. కాని స్త్రీలకు అదనంగా రక్షణా ఏర్పాట్లు కూడా ఉండాలి. అందుకు కొన్ని నిబందనలు తో కూడినా స్వేచ్చా స్వాతంత్ర్యం ఇవ్వాలి. స్వేచ్చ అనేది స్త్రీల వికాసానికి పనికొచ్చేదిలా ఉండాలి తప్పా నయా వ్యాపార వాదులకు పనికొచ్చేదిలా ఉండకూడదు.

             కాబట్టి   కుటుంబ వ్యవస్తను కుల్చేయాలనె మోడ్రన్ స్త్రీవాదం మగువలకు ఎంత ఉపయోగ పడుతుందో తెలియదు కాని మన్మద(వ్యభిచార ) సామ్రాజ్యానికి మాత్రం బహు చక్కగా ఉపయోగ పడుతుంది . బచ్పన్ కో బచావో అనే అందోళన కేవలం నినాదం కోసం కాకుండా స్త్రీ రక్షణలో బాగంగా అమలు చేయాలి . దాని అమలు కోసం పటిష్ట మైన కుటుంబ వ్యవస్థ అవసరం . పిల్లల బాల్య హక్కులు హరించే వారితో పాటు , రక్షించ లేని కుటుంబ సబ్యులను కూడా  శిక్షించే చట్టాలు అవసరం .

                
                     

                                (Republished Post. OPD :28/1/15)

             ఈ పోస్ట్ కి వచ్చిన కందుకూరి నారాయణ  గారి స్పందనకు సమాదానంగా క్రింది అదనపు సమాచారమును చేర్చడం జరిగింది.


   Narayana Kandukoori
Dear Sir iam not able to understand the link between the your write up and the video .Sir your article says prostitution increased because of the liberal thinking of the modem women and their freedom has to be restricted and they should be under supervision of father, husband and son which I beg to differ with you and regarding the video the girl looks like a minor so she is already in the supervision of her parents or guardians as per as Indian Constitution and she is not independent .So what the video shows is the ugly side of our society which is dominated by males who wants to enjoy with minor girls which is an offence under IPC .So you have to restrict the freedom of such males not women who were suppressed for thousands of years on one pretext or the other .                                              












Comments

  1. Dear Sir iam not able to understand the link between the your write up and the video .Sir your article says prostitution increased because of the liberal thinking of the modem women and their freedom has to be restricted and they should be under supervision of father, husband and son which I beg to differ with you and regarding the video the girl looks like a minor so she is already in the supervision of her parents or guardians as per as Indian Constitution and she is not independent .So what the video shows is the ugly side of our society which is dominated by males who wants to enjoy with minor girls which is an offence under IPC .So you have to restrict the freedom of such males not women who were suppressed for thousands of years on one pretext or the other .

    ReplyDelete
    Replies
    1. నారాయణ గారు, ముందుకు మీ స్పందనకు దన్యవాదాలు. ఇక పొతే ఇండియాలో బలవంతపు ప్రాస్టిటుషన్ కి అయినా, స్వచ్చందపు ప్రాస్టిటుషన్ కి అయినా , బ్రోథల్ హౌస్ యజమానులు నూటికి తొంభై తొమ్మిది మంది స్త్రీలే ఉన్నారు. వారి గురించి జరిపిన ఒక సర్వే లో తెలిసినది ఏమీటంటె అప్పటికే ప్రాస్టిటుషన్ లో ఉన్న వారితో స్నేహాలు ఉన్న వారే ఏదో రకంగా కుటుంబాలకు దూరమై ఈ వ్రుత్తిని ఎంచుకుని, ఓనర్లుగా మారి బ్రోకెర్ లకు డబ్బులు ఇచ్చి , బలవంతంగా తీసుకురాబడిన మైనర్ అమ్మాయిలను బెదిరించి వ్రుత్తిలోకి దింపుతూ తమ స్త్రీ జాతికే అన్యాయం చేస్తున్నారు. సాటి స్త్రీల పట్ల జాలి కరుణ లేకుండా వారి శరీరాలతో బలవంతపు వ్యాపారాలు చేస్తూ నెలకు లక్షలు, లక్షలు సంపాదించే స్త్రీల వలన వ్యభిచారం ఎక్కువ అవితుందా? లేక అమ్మడానికి రెడీ గా ఉన్న దానిని కొనుక్కోవడానికి ఎగబడే కొంత మంది దారి తప్పిన మగవారి వలన వ్యాపారం అభివ్రుద్ది అవుతుందా? అయినా నేను మైనర్ అమ్మాయిలను వ్యభిచార వ్రుత్తిలోకి దింపే తల్లి తండ్రులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు ఉండాలనే కోరాను. సాంప్రాదాయ కుటుంబాల వారు ఎప్పుడూ తమ పిల్లలను వ్యభిచార వ్రుత్తిలోకి దించాలని చూడరు. అలా అనుకుంటే వారు తల్లి తండ్రులే కారు,వారిది ఒక బ్రతుకే కాదు. పద్దతి గల కుటుంబం అనేది స్త్రీ రక్షణకు, వికాసానికి దోహదపడెదె తప్పా , ఎవరూ తమ ఆడపిల్లలను పరాయి మగవాళ్ళ దాష్టికానికి గురి చెయాలని కోరుకొరు. మగాళ్ళంతా ఒక జాతి, ఆడావరు అంతా వేరే జాతి అనే తప్పుడు బావాజలం నుంచి పుట్టిందే "కుటుంబ వ్యవస్త" వ్యతిరేక దోరణి. వ్యభిచార బాదితులు, గ్రుహాల ఓనర్లు జీవనశైలిని గమనిస్తే వారంతా కుటుంబ సాంప్రాదాయలు ఉల్లంఘించె కుటుంబ నేపద్యం గలవారు అని అర్దం అవుతుంది.

      బ్రోథల్ ఒనర్స్ గురించి సమగ్ర అద్యయన సమాచారం ని పొస్ట్ లొనె సమాచారం తో కూడిన ఫొటొలు చేర్చడం జరిగింది. చూడగలరు.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం