అవ్వ! అవ్వ! సోనియా గాంధి గారి కుటుంబం ,దొంగిలించబడిన "భారతీయ పురాతన వస్తువుల " ను విదేశాలకు స్మగ్లింగ్ చేసిందా?!!!
అవుననే అంటున్నారు ప్రముఖ న్యాయవాది శ్రీ సుబ్రమణ్య స్వామీ గారు! ఇదేదో కేవలం రాజకీయ ఆరోపణలు లాంటిది అయితే తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. కాని గతం లో ఇదే విషయమై డిల్లి హై కోర్టులో కేసు వేసి , సాఖ్శ్యాదారాలు కొన్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కాని చివరకు అప్పటి సోనియా గాంది గారి ప్రభుత్వం ఒత్తిడి మేరకు , C.B.I వారు విచారణను ముందుకు కొనసాగకుండా మోకాలు అడ్డడం వలన , స్వామీ గారు ఏమిచేయలేక నిస్సహాయ పరిస్తితిలో ఉండి పోయారు అట. సుబ్రహ్మణ్యం గారి మాటల్లో , అసలు జరిగింది ఏమిటంటె:-
భారతదేశంలో ఇందిరా గాంధి , రాజీవ్ గాంధి గార్లు ప్రదాన మంత్రిగా ఉన్న కాలంలో , ఇటలి కి వెళ్ళెఎయిర్ ఇండియా, అల్ ఇటాలియ విమాన సర్వీసుల్లో క్రేట్స్ కు క్రేట్స్ ఎటువంటి తనికిలు లేకుండా తరలించబడెవి అట. వాటిలో భారతదేశం లో వివిధ ప్రాంతాలలో దొంగిలించబడిన పురాతన విగ్రహాలు, నాణేలు, పెయింటింగ్స్ ఉండెవి అట. వాటిని ఇటలిలోని రివోల్ట , ఆర్బస్సనో అనే ప్రాంతాలలో , సోనియా గాంధి గారి చెల్లెలు నిర్వహిస్తున్న "పురాతన వస్తువుల " విక్రయ షాపులకు తరలించి అక్కడ ప్రదర్శనకు పెట్టెవారట.ఆ షాపుల్లో ఉన్నవన్నీ భారతీయ పురాతన వస్తు సంపదే . ఆ తర్వాత అక్కడ ఆ వస్తువులకు దొంగ బిల్లులు స్రుష్టించి , అక్కడనుండి ఆ వస్తువులను లండన్ కి తరలించి , లండన్లో వేలం పాట వేయించి అక్రమ ఆర్జనకు పాల్పడే వారట. వేలం పాటలో వచ్చిన సొమ్మును విదేశాల్లోని వివిధ బ్యాంకుల్లో జమ చేసారు అట.
విచిత్రమైన విషయం ఏమిటంటె , ఈ స్మగ్లింగ్ వ్యవహారం లో LTTE వారే సోనియా గాంధీ కుటుంబ సబ్యులకు సహాయం చేసారు అట. ఈ విషయం ని మొదట్లో ఎవరూ నమ్మక పోయినా, తర్వాతి కాలంలో సుమారు 33 మంది LTTE వారిని ఇటలి గవర్నమెంట్ అరెస్ట్ చేసాక నమ్మక తప్పలేదు. ఇండియాకు చెందిన విలువైన పురాత న వస్తు సంపదను కాపాడమని , సుబ్రమణ్య స్వామీ గారు 2008 లో అప్పటి ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పలితం లేక పోవటం తో డిల్లీ హై కోర్టులో పిల్ వేసారు. ఆ పిల్ లో ఇందిరా గాంది గారి చెల్లెలు షాపులో ఉంచిన పురాతన వస్తువులు కు సంబందించిన పొటోలు కూడా సమర్పించారు. ఆ పొటొలో ఉన్నవన్ని , భారత దేశం లోని వివిధ ప్రాంతాలలో దొంగిలించబడిన పురాతన విగ్రహాలు, వస్తువులే. దీని పై స్పందించిన హై కోర్టు వారు , మొదట గవర్నమెంట్ కి నోటిసులు జారి చేసినా , తగిన స్పందన రాక పోవడం తో కేసును CBI వారికి అప్ప చెప్పి . ఈ విషయం లో ఇంటర్ పోల్, ఇటలి గవర్నమెంట్ సహాయం తీసుకోమని ఆదేసించారు.
ఇంటర్ పోల్ వారు ఈ కేసు కు సంబందింవి రెండు పెద్ద వాలుమ్స్ లో రిపోర్ట్ లు సమర్పించారు అట. సదరు రిపోర్ట్ లను పిటిషనర్ అయిన సుబ్రమణ్య స్వామీ గారికి అంద చేయవలసినదిగా కోర్టు వారు ఆదేశించినప్పటికి , CBI వారు తమకున్న ప్రివేలేజ్ ను అడ్డం పెట్టుకుని , రిపోర్టు లు ఇవ్వడానికి నిరాకరించడం తో సుబ్రమణ్య స్వామీ వారు నిస్సహాయులుగా మిగిలి పోయారు అట. దానితో సోనియా గాంధి గారి కుటుంబ సబ్యులు "సోనియా గాంధి నా పట్టు అయితే , ఎట్ట కొడతావో కొట్టరా స్వామీ " అని సుబ్రమణ్య స్వామీ వైపు గర్వంగా చూసారు అట. అదీ కధ.
ఇదంతా నేను కల్పించి చెప్పింది కాదండోయి. సాక్షాతూ స్వామీ గారే చెప్పారు. కావాలంటే క్రింది వీడియోను చూడండి . అదీ కాదనుకుంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి http://www.insistpost.com/shocking-sonia-gandhi-smuggled-stolen-indian-antiques-to-italy-know-more-in-this-video/
Comments
Post a Comment