రచయితలని "రైటింగ్స్ " తో ఎదుర్కొండి ! ఫైటింగ్స్ తో కాదు !
రెండు సంవత్సరాల క్రితం మన ఉమ్మడి తెలుగు రాజధాని , హైదరాబాద్ నడిబొడ్డున ఒక మహిళా రచయిత్రిని పట్టుకుని , మీడియా సాక్షిగా , ప్రెస్ క్లబ్ లొనే దాడి చేసారు, సెక్యులర్ ముసుగులో ఉన్న మత వాదులు కొందరు. పాపం బంగ్లాదేశ్ కు చెందిన ఆ రచయిత్రి కళ్ళల్లో , ఆ నాడు తొణికిసలాడిన భయబ్రాంతులు చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. అందుకేనేమో ఆమె గారు తన రచనల్లో "ప్రపంచంలో ఆ మతవాదులు అంత హింసావాదులు ఏ మతం లోను ఉండరు" అని డంకా బజాయించి మరీ చెప్పింది . ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే తనకు నచ్చని ఆ మత విదానాలు గురించి తన రచనల్లో బావవ్యక్తికరణ చేయడమే. అప్కోర్స్ అవి వారి మనో బావలను దెబ్బ తీసి ఉండవచ్చు అనుకుంటా. దానికి ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండవచ్చు. లేకపొతే, చేతనైతే ఆమె రచనా తీరును ఎండగడుతూ , తమ బావాలని సమర్దించుకుంటూ కౌంటర్ రచనలు చేయవచ్చు. దీని ద్వారా ఆమెకు దీటైన సమాదానం ఇవ్వవచ్చు. కాని ఇవ్వన్నీ చేయకుండా కేవలం బల ప్రయోగం తో ఆ మహిళా రచయిత్రిని బెదరించి కీచకానందం పొందడం ఎంత అల్ప అలోచన! ఒళ్ళు చూసుకుని మురిసిపోయే వారు చేసె జంతు చేష్టలు ఇవి!
అదే విదంగా నిన్న కాక మొన్న సుదేంద్ర నాద్ కులకర్ణి అనే ఆయన్ని ముంబాయి శివ సేన వారు , ముఖానికి నల్ల రంగు పూసి అయన మీద తమకున్న నిరసనను తెలియ చేసారు అట. ఇంతకి అయన చేసిన నేరమేమిటయ్యా అంటె , ఎవరో పాకిస్తానీ మాజీ మంత్రి రాసిన పుస్తకావిశ్కరణ కు అయన సారద్యం వహించడం అట. సదరు పాకిస్తానీ మంత్రి రాసిన పుస్తకం మన దేశ జాతీయవాదానికి బంగం కల్గించేదిగా ఉందని , కాబట్టి అట్టి పుస్తాకావిష్కరణ కార్యక్రమం మానుకోవాలని "శివ సేన " ఇచ్చిన హెచ్చరికలు బే ఖాతరు చేస్తున్న్నందుకు నిరసనగా , శివ సేన వారు కులకర్ణి గారి ముఖానికి నల్ల రంగు పూసారు అట. అసలు కులకర్ణి గారు ఇదే విషయమై ఒక రోజు ముందే శివ సేన అధ్యక్షులు వారిని కలసి పుస్తాకావిషరణ విషయం లో సహకరించాలని కోరారు అట. అయినా శివ సేన వారు అయన ముఖానికి నల్ల రంగు పూసి నిరసన తెలిపారు అంటె దీని వెనుకాల మతలబ్ వేరే ఉండి ఉందాలి .
పాకిస్తాన్ మాజీ మంత్రి గారు రాసిన పుస్తకం పేరు "Neither a Hawk Nor a Dove". అందులో ఏమి రాసి ఉందో ఎవడికి తెలియదు. తెలియాలంటే దానిని చదవాలి. చదవాలంటే దానికో పెద్ద పబ్లిసిటి కావాలి. పాకిస్తాన్లో ఎంత గొప్ప పబ్లిసిటి ఇచ్చినా జానాభా రిత్యా గిట్టు బాటు కాదు. అందుకే ఇండియాలో ఆవిష్కరణ పెట్టుకు న్నట్లు ఉంది. ఈ మద్య పబ్లిసిటి లో కొత్త ట్రెండ్ వచ్చింది అదే నెగటివ్ పబ్లిసిటి . సినిమాలు విడుదల కాకముందే తమ వ్యతిరేక వర్గాలలోని వారిని ప్రేరేపించి కేసులు వేయించి , సదరు సినిమాలలో ఏముందో అనే పీలింగ్ ప్రేక్షకులలో కలిగించి తద్వారా సినిమాకి పబ్లిసిటి ఇచ్చుకోవడం మనం చూస్తున్న సినిమా వాళ్ళ జిమ్మిక్కులు. అలాంటిదే కావచ్చు పైన చెప్పిన పుస్తకం పబ్లిసిటి కూదా. పుస్తాకవిషకరనకు ముందే , ఆవిష్కర్త ముఖానికి , నల్ల రంగు పూయడం , అయన గారేమో అదే నల్ల రంగు ముఖంతో సాయంత్రం దాక కడుక్కోకుందా ఉండి , పుస్తక ఆవిష్కరణ చేయడం, అది అంతర్జాతీయ స్తాయిలో పుస్తకం గురించి పిచ్చ పబ్లిసిటి రావడం చూస్తుంటె " లోగుట్టు శివసేన -కులకర్ణి "కెరుక అనిపిస్తుంది.
ఏది ఏమైనా రచయితలూ, కవులు కళాకారులు అనే వారు వారి వారి ఆసక్తులకు అనుగుణంగా పని చెసే వారే. పైసలకు కళలు అమ్ముకునే వాఋ, రచనలు చేసే వారి గురించి ఎవరికీ అబ్యంతరం ఉండదు. ఎందుకంటె వారు పొట్ట కూటి కోసం చేసే పని కాబట్టి వారికి పొట్ట ఆసక్తి తప్పా ప్రత్యేక ఆసక్తి ఏమి ఉండదు కాబట్టి. కాని కళ లేక రచన , కళ కోసం కాదు ప్రజల కోసం అనే వారి గురించి కొంచం ఆలోచించాలి. ప్రజలు అందరూ ఒకే బావమ్తో ఉండరు కాబట్టి , ప్రజల కోసం విరగబడుతున్నామ్ అనే వారు కూడా ఒకే ఆసక్తి తో ఉండరు. వ్యక్తివాదులూ, కులవాదులు, మతవాదులు, వర్గావాదులు, పార్టి వాదులు ఇలా రక రకాలుగా రచయితలూ విడిపోయి ఉన్నారు. విరందరిని జాతీయవాదులు అనటం హస్వద్రుష్తే అవుతుంది. కనీసం మెజార్తీ ప్రజల ఆసక్తులకు అనుగుణంగా , మిగతా వర్గాల పట్ల సామసర్స్య బావం తో బాలేన్సైడ్ గా రచనలు చేసే వారిని జాతీయవాద రచయితలూ అనవచ్చు. మరి ఇలాంటి రచయితలూ ఎంతమంది ఉన్నారు? గత 60 ఏండ్లుగా "నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం " అని ఒక పక్క ప్రతిజ్ఞలు చేస్తూ , స్వదేశి మతాలను హినపరుస్తూ, విదేశి మతాలను , విదానాలను తలకెత్తుకునే వారి చేతిలో మీడియా , సాహిత్య , రాజకీయ రంగాల అధిపత్యం ఉండబట్టి మెజార్తీ ప్రజల మనో బావాలకు విలువ లేకుండా పోయింది. ఈ దేశం లోని ఒక ముఖ్య మంత్రికి వీసా ఇవ్వవద్దు అని అమెరికాకి సెక్యులర్ వాదుల ముసుగులో 50 మంది కుహనా మత వాదులు అప్పీల్ చేసారంటే , అదే ఇంకొక దేశం లో అయితే పరిస్తితి ఎలా ఉండేదో ? ఇటువంటి కుహనా సెక్యులరిస్తూలను జాతియావాదులు అనాల్సిన అవసరం లేదు. కాబట్టి రచయితలను కుడా వారి వారి ఆసక్తుల ప్రకారం విభజించాల్సిందే
కాని మనకొక ధర్మం ఉంది . వెనుకటి రాజుల కాలంలో యుద్దాలు ప్రారంభించే ముందు రాయభారాలు నడిపే వారు . దీనికోసం రాయభారులు ఉండె వారు . ఒక రాయభారి తమ రాజు యొక్క అభిప్రాయాన్ని నిస్సకోచకమ్గా , నిర్బీతిగా , శత్రు రాజు సమక్షం లో చెప్పే వారు . వారికి ఆ స్వేచ్చా ఉండెది . శత్రు రాజుకు రాయభారి చెప్పే విషయాలు ఎంత క్రోదం కలిగించ్జినా , రాయభారికి ఏ మాత్రం హాని తలపెట్టకుండా , ఆత ను చెప్పేది ఓపికగా విని , సమాదానంవెంటనె చెప్పడమో , లేక తమ రాయభారిని పంపి సమాదానం చెప్పించడమో జరిగేది. ఇక్కడ ధర్మం ఏమిటంటే శత్రు రాజ రాయభారికి హాని చేయకపోవడం రాజనీతి లో బాగమ్. ఆ ధర్మ రక్షణ ఆచరించబట్టె రాజుల మ నోగతాలు పరస్పరం అవగతమయేయి. లేకుంటే అవసరం కంటె అపోహలతో జరిగే యుద్దాలు వలన ప్రజాక్షయం ఎక్కువయ్యేది . ఇక్కడ రచయితలను, కవులు ,కళాకారులను కూడా ఆయా ఆసక్తి వర్గాల రాయభారులుగానే పరిగణించాలి. వారు వారి వర్గాల కోసం ఎటువంటి రచనలు చేసినా ఓర్మితో చదివి, వారికి తమ కౌంటర్ రచనల ద్వారా తగిన సమాదానం ఇవ్వాలి తప్పా, అక్కసుతో వారిని మట్టు పెట్టె బుద్దిని ప్రదర్శించడం ప్రజాస్వామ్య ధర్మం కాదు. "పెన్ను పట్టిన వాడిని పెన్నుతోను, గ న్ పట్టిన వాడికి గన్ తోను సమాదానం చెప్పడం దీరుల లక్షణం".
లేకుంటే తీవ్ర వాదులకు , ప్రజాస్వామ్యవాదులం అని చెప్పుకునే వారికి తేడా లేకుండా పోతుంది.
.
"ధర్మో రక్షతి రక్షితః " అనేదే మన సిద్దాంతం కావాలి . అందులో బాగంగా నచ్చని రచయితలని "రైటింగ్స్ " తో ఎదుర్కొండి ! పైటింగ్స్ తో కాదు ! తస్లిమా నస్రిన్ గారి మీద , సుదేండ్ర కులకర్ణి మీద దుండుగలు జరపిన దాడి గురించి క్రింది వీదీయొలలో చుడవచ్చు. .
Comments
Post a Comment