ఈ "దెయ్యం " డైరెక్టర్ కి దేవుళ్ళు గురించి ఏందుకు?
అతనొక సినిమా డైరెక్టర్ .దెయ్యాల మీద , రౌడీలు మీద సినిమా లు తీసి బాగానే సంపాయించుకున్నట్లుంది . దేవుడు అంటే బొత్తిగా నమ్మక్కం లేదని చెపుతుంటాడు . సరే మంచిది. బారతావనిలోబోల్డంత మంది నాస్తికులు ఉన్నారు , అందులో ఇతనూ ఒకడనుకుందాం . కాని దేవుళ్ళు అంటే నమ్మకం లేని వాడు నమ్మకం లేనట్లు ఉండాలి కాని దేవుళ్ళను నమ్మే భక్తులను ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చెయ్యడం , "సైతాన్ " సలహాలు ఇవ్వడం ఎందుకంటా ?
బెజవాడలో చదువుకునే రోజుల్లో బాగా రౌడీ గాంగ్ లతో తిరిగాడంట! వారి చరిత్రలనే సినిమా కెక్కించి జనాల డబ్బు దండుకున్నాడు. అది అతని సినిమా హక్కుల్లో బాగం కాబట్టి O.K . కాని దేవుల్లందరిని సమానం గా పూజించే తెలంగాణా భక్తులను కించ పరచే మాటలు మాట్లాడతాడా? దేవుళ్ళ మద్య ప్రాంతీయ బేదాలు ఉండాలని చెపుతాడా? భక్తులకు సప్తగిరి అయినా యాదగిరి అయినా ఒకటే అయినప్పుడు , తెలంగాణా వారు యాదగిరికి , ఆంద్రా వారు సప్తగిరికి పరిమితమవ్వాలని బోడి సలహా ఇస్తాడా? అవునులే! దెయ్యాలు సినిమాలు తీసి తీసి ఈయన మైండ్ దొబ్బినట్లుంది . లేక పోతే ప్రచారం లేక తెలంగాణా భక్తులు మీద పడ్డట్లుంది. ఇటువంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టినా బుద్ది వస్తుందని అనుకోలేం.
దెయ్యాల మీద సినిమాలు తీసి ప్రజల్ని బయపెట్టే ఈ "దెయ్యాల డైరెక్టర్ " కి దేవుళ్ళు గురించి ఎందుకు?!
అతను ట్విట్టర్లో{పక్షి ) ఏమి కూసాడో చూడండి ..
Isn't it correctly wrong that Telangana people think of their own God Yadagiri Narasimha lesser than Andhra people's God?
Like you love your own country shouldn't you be praying to your own states God instead of praying to another States God?
I am not a believer in God but I feel it's insulting to Yadagiri Narasimha that Telangana people pray to Andhra people's Balaji more
Is it Right that Telangana people pray to Andhra people's Balaji more than their own Yadagiri Narasimha ?
Comments
Post a Comment