ఆస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించిన రాకెట్లు సూపర్ సక్సెస్ అవుతుంటే , నాస్తిక సైంటిస్ట్ లు ప్రయోగించినవి అట్టర్ ప్లాప్ అవుతున్నాయి ! ఎందుకని?


                                                                                   

నేను ఇదే బ్లాగులో "మేమే విజ్ణానులం అనుకునే వారు ఇస్రో చెర్మన్ గారిని ని చూసి నేర్చుకునేది చాలా ఉందనుకుంటా!.

 అనే టపాలో ఒక మాట చెప్పాను . అది PSLVC 22 ఉపగ్రహం ప్రయోగం సందర్బంగా ఇస్రో చైర్మన్ అయిన శ్రీ రాధా క్రిష్ణ గారు రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల కొండకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నప్పుడు వచ్చిన విమర్శల సందర్బంగా వెలిబుచ్చిన నా అభి ప్రాయం . అదేమిటంటే 

 " మనిష్ బౌతికంగా ఎంత విజ్ణాన వంతుడైనప్పటికి, అతను మానసికంగా తనను నడిపించే శక్తి ఈ విశ్వంలో ఏదో ఉందనే బావిస్తుంటాడు. అది మూడ విశ్వాసం కాదు.అనాదిగా అతని నరనరాల్లో జిర్ణించుకుని ఉన్న మత లేక అద్యాత్మిక పరమైన  బావన. సాక్షాత్తు ఐన్ స్టీన్ అంతటి వాడే "సైన్స్, మతమూ అనేవి ఒకే వ్రుక్షానికి ఉన్న రెండు కొమ్మలు లాంటివి " అన్నాడు. కాబట్టి అన్నింటికి సైన్స్ సమాదానం చెప్పలేదు అనేది మనకు అనుభవమే. అలా అంతిమ సత్యమ్ కనుగొనబడే వరకు అటు ఆద్యాత్మికత బావననలు, ఇటు విజ్ణాన బావనలు ఉండి తీరతాయి. 

  కొన్ని కోట్ల ఖర్చు పెట్టి చేస్తున్న రాకెట్ ప్రయోగం విషయం లో ఇస్రో చేర్మన్ గారు సజావుగా సాగాలని ఆ అలౌకిక శక్తిని ప్రార్దించడం ఆయనలోని బాలెన్స్ మైండ్ కి నిదర్శనం. మనిషి మెదడులో ఎడమ వైపు తార్కిక ద్రుక్పడానికి, కుడి బాగం ఎమోషనల్ ఫిలింగు లను కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని చెపుతారు. మరి ఈ రెండింటిని సమతూకంలో ఉంచేవాడే బాలెన్స్ మైండేడ్ పర్సన్ అనిపించుకుంటాడు. అటువంటి బాలెన్స్ మైండ్ ఉన్న వ్యక్తి మన బారత అంతరిక్ష పరిశోధన సంస్తకు అద్యక్షుడిగా ఉండడం మన అద్రుష్టం. ఆయన నేత్రుత్వంలో మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగి మన దేశ ఖ్యాతి ప్రపంచం లో ఇనుమడించాలని, మరియూ ఈ రోజు జరిగే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆ దేవ దేవుని,మరియు ఆ చెంగాలమ్మ తల్లిని  మనాసారా ప్రార్దిస్తున్నాం."

          అప్ కోర్స్  ఆ ప్రయోగం విజయవంతమయింది . ఆ తర్వాత నాసా వారు 4500 కోట్లతో అంగారక గ్రహానికి పరిశోదనా ఉపగ్రహం పంపితే , మన ఆస్తిక సైంటిస్టులు   కేవలం 450 కోట్ల ఖర్చుతో అదే అంగారక గ్రహానికి "మామ్ " ను పంపి విజయవంతంగా అంగారక కక్ష్యలో ప్రదక్షిణలు చేయిస్తూ , పరిశోదన చేస్తున్నారు . అలాగే నిన్న గాక మొన్న అక్టోబర్ 15 వ తారికున IRNSS  1 c అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు . ఇదంతా దేవుణ్ణి విశ్వసించే మన సైంటిస్టులు చేస్తున్న విజ్ఞాన ప్రయొగాలె. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే రాకెట్లు ప్రయోగించే మన షార్ కేంద్రం లోనే "చెంగాలమ్మ " అనే దేవత గుడి ఉంది . ఆ దేవతకు మొక్కకుండా రాకెట్ లు నింగికెగసేదే లేదు . మరి మన అంతరిక్ష ప్రయోగాలను ఏ నాస్తిక శక్తులు విపలం చెయ్యటం లేదు అంటె దానికి కారణం మన సైంటిస్టుల్లొ "పాజిటివ్ థింకింగ్ " పెంచుతున్న ఆ దేవతల ఆరాధనేనా? కావచ్చు! 

     మొన్ననే నాస్తికుల అధ్వర్యంలో నడిచే "నాసా" వారు ప్రయోగించిన అమ్టరెస్ రాకెట్ ప్రయోగం అట్టర్ పెయిలూర్ అయింది . ప్రయోగించిన కేవలం కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది . మరి వారి పెయిలూర్ కి వారు దేవుడికి ప్రార్ధనలు చేయకపోవడమే అనవచ్చా ? దేవుడిని నమ్మకపోవడం వలన నాస్తికులకు కలిగే లాబాల సంగతేమో కాని , నమ్మినందు వలన తప్పకుండా లాభమే కాని నష్టం లేదు . ఆస్తికత్వం వలన శాస్త్రీయ దృక్పదాలు ఉండవు అనేవి తప్పుడు మాట. అలాగే శాస్త్రీయ దృక్పదాలు ఉన్న వారంతా మానవ కల్యాణానికి కారకులు అవుతారు అనుకోవడమూ బ్రమే . మానవ హననానికి కారణమయ్యే శాస్త్రీయ నాస్తికత్వం కన్నా , మనిషికి మంచి నీరు ఇచ్చె ఆస్తికత్వ అమాయకత్వమే మెలు.  అలా అని పోటి ప్రపంచo లో వెనుకబడి ఉండి పరాదినతకు గురికాలేక , వారితో పోటిపడుతూ శాస్త్రీయ పరిసోదనలు చేస్తూ వారికంటే మెరుగ్గా ఉండగలగడం బ్యాలైన్స్ మైండ్ ఉన్న మన శాస్త్రవేత్తలకు సాద్యమవుతుంది . దీనికి ప్రదాన కారణం వారిలోని అస్తికత్వమే అనడం లో ఎటువంటి సందేహం లేదు .   

జై ఆస్తిక జవాన్                                  జైఆస్తిక  కిసాన్                               జై ఆస్తిక విజ్ఞాన్


బ్లాగు వీక్షకులకు "కార్తీక పూర్ణిమ" శుభాకాంక్షలతో ...,.................                                                         

      
             

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!