చివరకు సోషలిజం కి "శోష " వచ్చి , సోషల్ మీడియాలో వాటేసుకుంటుంది !

                                                                                                                                                   

వారు అట్టాంటి ఇట్టాంటి విద్యార్దులు కారు  . భారత దేశానికే సోషలిజం తేవాలని గత కొన్ని దశాబ్దాలుగా ఎలుగెత్తి అరుస్తున్న కమ్మ్యూనిస్ట్ పార్టీ అప్ ఇండియా (మార్కిస్ట్) కి అనుబందo గా ఉన్న S.F.I విద్యార్ది సంఘం  బలపరచిన విద్యార్దులు . వారు మొత్తం పదిమంది మాత్రమే . అయితేనేం వారి వెనుక స్ట్రాంగ్ SFI ఉన్నది కాబట్టి డేర్ గా ఆ పని చేసారు .ఇంతకీ ఏమి చేసారు అనా ? ఏమి లేదు . ఎప్పుడూ చాటుగా వాటేసుకునే వారు సామ్యవాదుల అండతో పబ్లిక్ గా,  కాలేజీ ప్రవర్తనా నియమాలకు వ్యతిరేకంగా ,పట్ట పగలు అందరు చూస్తుండగా కాలేజీ మైదానం లో వాటేసుకున్నారు . ఇదంతా ఎందుకు అంటె మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా అంట.

  మొన్ని మద్య కేరళ లోని కోచి లో మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా కొంతమంది అభ్యుదయవాదులమని చెప్పుకునే విశ్రుంఖల  స్వేచ్చా వాదులు జరిపిన   "ముద్దుల ప్రేమ"  అట్టర్ ప్లాప్ అయి  ప్రజానీకం అసహ్యహించుకునేలా  చేసింది . దానితో మనసులో డీలా పడినా , పైకి బింకం గా "ఇటువంటి కార్యక్రమాలు  బవిష్యత్ లో ఇంకా చేస్తాం" అని గప్పాలు కొట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియా మానియా ఉన్న కొంత మందిలో అది కూడా ఒక పది మంది మాత్రమే ముందుకు రాగా వారి చేత "కౌగిళ్ళ ప్రేమ" ను నిర్వహించారు , కోచి లోని  మహారాజా కాలేజి S.F.I సంఘం వారు . నిజానికి S.F.I వారు ఇలాంటి నీతి బాహ్యత పనులును ఒప్పుకోరు . కాని దేశం లో నానాటికి పెరిగిపోతున్న మోడి ప్రబంజనమ్ , దానితో పాటు దేశం లో హిందూ సంస్కృతికి లబిస్తున్న ప్రజాదరణ  చూసి వారికి ఏమి చేయాలో అర్దం కావటం లేదు. అందుకే హిందూ సంస్కృతిని దెబ్బ తీసే ప్రతి చర్యను వారు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో  సమర్దించించి మరింత ఆబాసు పాలు అవుతున్నారు.చివరకు ఆ 10 మంది విద్యార్దులు కాలేజి నుండి సస్పెండ్ అయ్యారు.

 మార్క్స్ ఊహించిన సోషలిజం వచ్చి తీరుతుందన్న   భారతీయ కమ్మ్యోనిస్టుల సిద్దాంతీకరణ నిజమయ్యే దాఖలాలు లేవు. సోషలిజం కంటే ముందు "సోషల్ మీడియా ఇజం" వచ్చింది . దానితో  సెల్ ఉన్న ప్రతి వాడికి స్వాతంత్ర్యం వచ్చింది . 2000  చేతిలో ఉంటే  చాలు , సెల్ కొనుక్కుని అందులో వాళ్ళ వికారాలు అన్నీ అప్లోడ్ చేసి దునియా కి చూపించి విక్రుతానందమ్ పొందవచ్చు. ఇందులో పేద , దనిక తేడాలేమి లేవు . అ విదంగా    "సెల్ సోషలిజం " వచ్చింది. ఈ దెబ్బతో దశాబ్దాలుగా ఎలుగెత్తి చాటుతున్న సోషలిజం కాస్తా "సొల్లు సోషలిజం" అయింది . " సెల్లు సోషలిజం " దెబ్బకి 'సొల్లు సోషలిజం"  కనుమరుగై పోతుంది . అందుకే పాపం సామ్యవాదులు  తమకు వ్యతిరేకులైన హిందూ వర్గాలకు శత్రువులు గా వ్యవరించే వారిని మిత్రులుగా బావించి , వారు చేసేది మంచా ? చెడా? అని ఆలోచించకుండా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు . అందులో బాగమే "బహిరంగ ముద్దుల ప్రేమ" "కౌగిల్ల ప్రేమ" ను సమర్దించడమ్. ! ఎంత దయనీయమైన స్తితి! ఒకప్పుడు ప్రజలకు క్రమశిక్షణాయుతమైన  జీవనం గురించి సుద్దులు చెప్పిన సంఘాలేనా ఇవి!? ఔరా!

                             "బహిరంగ కౌగిళ్ళ ప్రేమ " కార్యక్రమం చూడాలంటే క్రింది వీడియోను క్లిక్ చేయండి

                           

                         "బహిరంగ ముద్దుల ప్రేమ" గురించి మరింత సమాచారం కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి .
                                           ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు     పెట్టుకున్నట్లుంది!!!! http://ssmanavu.blogspot.in/2014/11/blog-post_4.htmlComments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.